
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి 51 మంది కోలుకోవడంతో వారిని డిశ్చార్జి చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఇందులో 8 మంది వలస కూలీలు ఉన్నారు. దీంతో మొత్తం కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,332కు చేరింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు మొత్తం 9,370 మందికి పరీక్షలు నిర్వహించగా 110 మందిలో పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.
వీరిలో 12 మంది వలస కార్మికులున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 3,571కు చేరింది. ఇందులో 418 కేసులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలవి కాగా, కోయంబేడుకు సంబంధించినవి 226, విదేశాల నుంచి వచ్చిన 111 మంది ఉన్నారు. వీరిని మినహాయిస్తే రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,816గా ఉంది. కృష్ణా జిల్లా, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా వైరస్‌తో మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 62కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,177గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment