తలమడుగు(బోథ్): విద్యార్థులు బాగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించాలని అసిస్టెంట్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. శుక్రవారం మండలంలోని లింగి గ్రామంలో కస్తూరిబా గాంధీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులను. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. ఎంత మంది విద్యార్థినులు ఉన్నారు. భోజనం మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదో తరగతిలో ఎంత మంది విద్యార్థినులు ఉన్నారు. ఎలా ప్రిపేర్ అవుతున్నారని తెలుసుకున్నారు.
తెలుగు భాషపై పట్టుతో పాటు ఇంగ్లిష్‌పై శ్రద్ధ పెట్టాలన్నారు. మార్చిలో జరిగే పరీక్షలకు ఇప్పటి నుంచే కష్టపడి చదవాలన్నారు. కాపీయింగ్‌కు పాల్పడకుండా ఇప్పటి నుంచి కష్టపడి చదివితే మంచి విజయం సాధించవచ్చన్నారు. ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఉదయం ఎంత భోజనం పెడుతున్నారు. మధ్యాహ్నం, రాత్రి వేళలో ఎలాంటి భోజనం అందిస్తున్నారని తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు అందుబాటులో ఉండి మంచి ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులను తయారు చేయాలన్నారు. ఆయన వెంట శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌వో సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
కేజీబీవీని పరిశీలిస్తున్న అసిస్టెంట్ కలెక్టర్ ప్రతీక్‌జైన్
Comments
Please login to add a commentAdd a comment