Kasturba Gandhi Ashram school
-
కస్తూర్బాలో ఆకలి కేకలు..! విద్యార్థులు అర్ధాకలితో..
మహబూబ్‌నగర్: బాలానగర్ మండలంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో గురువారం విద్యార్థులు ఆకలితో అలమటించారు. సరైన భోజనం పెట్టకపోవడంతో విసిగిపోయిన విద్యార్థినులు ఒక్కసారిగా పాఠశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 384 మంది ఉన్నారు. వీరికి ప్రతిరోజు వంట చేసేందుకు ఐదుగురు సిబ్బంది ఉండాల్సి ఉంది. అయితే రెండేళ్లుగా ఇద్దరు సిబ్బంది లేకపోవడంతో ముగ్గురే వంట చేస్తున్నారు. ఇటీవల ఒకరు పని మానేసి వెళ్లిపోగా.. మిగిలిన ఇద్దరు బుధవారం సాయంత్రం నుంచి అనారోగ్యం కారణంగా సెలవు పెట్టారు. దీంతో రాత్రి భోజనం వండకపోవడంతో విద్యార్థులు బొరుగులు తిని అర్ధాకలితో పడుకున్నారు. గురువారం ఉదయం ప్రిన్సిపాల్ జ్ఞానేశ్వరి ఎలాగోలా ఉప్మా చేసి అందించారు. అయితే అది రుచిగా లేకపోవడంతో చాలా మంది తినలేదు. మధ్యాహ్నం కూడా వంట చేసే పరిస్థితి లేకపోవడంతో పాటు అప్పటికే ఇద్దరు విద్యార్థినులు నీరసించి పడిపోయారు. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థులు పాఠశాల ఆవరణలో ధర్నాకు దిగారు. సమస్యలను పలుసార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని విద్యార్థులు తెలిపారు. ఉన్నతాధికారులు వచ్చి సమస్యలకు పరిష్కారం చూపే వరకు ఇక్కడే ఉంటామని భీష్మించుకుని కూర్చున్నారు. పరిష్కారం కాని సమస్యలు పాఠశాలలో నిత్యం అందించే ఆహారాన్ని నాసిరకంగా వడ్డిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. పాఠశాలకు తనిఖీ సమయంలో వచ్చిన అధికారులకు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సమయంలో సమస్యలు, ఇబ్బందులు చెబితే తర్వాత తమపై మండిపడుతారన్నారని ఆరోపించారు. దీనికి తోడు తనిఖీలకు సంబంధించి ముందస్తు సమాచారం ఉండడంతో ఆ సమయంలో ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తారన్నారు. ఇతర రోజుల్లో నీళ్లతో కూడిన కూరలు వడిస్తారని విద్యార్థులు చెబుతున్నారు. పాఠశాల ఆవరణలో ఉన్న మినరల్ వాటర్ పనిచేయకపోవడంతో బోరు నీళ్లే తాగుతున్నామని తెలిపారు. గదులకు కిటీకీలు లేక వర్షం పడితే విద్యార్థులు నిద్రపోలేని పరిస్థితి ఉందన్నారు. పాఠశాలలో బాత్రూంలు ఉన్నా కొన్నింటికి తలుపులు లేక ఇబ్బంది పడుతున్నామన్నారు. వంట చేసే ఆయాలు తమతో సేవలు చేయించుకుంటారని ఈ విషయాన్ని ప్రశ్నిస్తే ఉపాధ్యాయులకు చెప్పి బెదిరిస్తారని తెలిపారు. పాఠశాల ప్రహరీ గోడ దూకి ఆకతాయిలు ఆవరణలోకి ప్రవేశిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా మొక్కుబడిగా 4, 5 సార్లు పాఠశాలకు వచ్చి పరిశీలించారే గానీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కాగా.. గురువారం విద్యార్థినులను చూసేందుకు వచ్చిన కొందరు తల్లిదండ్రులు పరిస్థితిని గమనించి..పాఠశాల ప్రిన్సిపాల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళన గురించి తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ నాయకులు అక్కడకు చేరుకుని వారికి మద్దతుగా నిలిచారు. ప్రిన్సిపాల్, సిబ్బందిపై మండిపడిన వారు సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అధికారుల విచారణ.. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారి బాబురావు పాఠశాల వద్దకు చేరుకుని విచారించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి బాలికలకు భోజనం పెట్టడంతో పాటు విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న డీఈఓ రవిందర్ సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
ఆదిలాబాద్: కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని నేరడిగొండ మండల పరిధిలోని కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఆశ్రమ పాఠశాలలోని ఫుడ్ పాయిజన్‌తో 20 మంది విద్యార్థినులకు అస్వస్థత చోటు చేసుకుంది. దీంతో వాళ్లందరినీ రిమ్స్‌కు తరలించారు నిర్వాహకులు. ఇదిలా ఉంటే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? ఫుడ్ పాయిజన్ ఘటనపై స్కూల్ నిర్వాహకుల స్పందన తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్రాణం తీసిన కోడిగుడ్డు -
మంచి ఉత్తీర్ణత సాధించాలి
తలమడుగు(బోథ్): విద్యార్థులు బాగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించాలని అసిస్టెంట్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. శుక్రవారం మండలంలోని లింగి గ్రామంలో కస్తూరిబా గాంధీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులను. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. ఎంత మంది విద్యార్థినులు ఉన్నారు. భోజనం మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదో తరగతిలో ఎంత మంది విద్యార్థినులు ఉన్నారు. ఎలా ప్రిపేర్ అవుతున్నారని తెలుసుకున్నారు. తెలుగు భాషపై పట్టుతో పాటు ఇంగ్లిష్‌పై శ్రద్ధ పెట్టాలన్నారు. మార్చిలో జరిగే పరీక్షలకు ఇప్పటి నుంచే కష్టపడి చదవాలన్నారు. కాపీయింగ్‌కు పాల్పడకుండా ఇప్పటి నుంచి కష్టపడి చదివితే మంచి విజయం సాధించవచ్చన్నారు. ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఉదయం ఎంత భోజనం పెడుతున్నారు. మధ్యాహ్నం, రాత్రి వేళలో ఎలాంటి భోజనం అందిస్తున్నారని తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు అందుబాటులో ఉండి మంచి ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులను తయారు చేయాలన్నారు. ఆయన వెంట శ్రీనివాస్‌రెడ్డి, ఎస్వో సువర్ణ తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీని పరిశీలిస్తున్న అసిస్టెంట్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ -
మళ్లీ త్రీఆర్స్
జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు : 112 ప్రాథమికోన్నత పాఠశాలలు : 92 ప్రాథమిక పాఠశాలలు : 527 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు : 66,759 కసూర్తిబా పాఠశాలలు : 18 విద్యార్థినులు : 2,889 మామడ(నిర్మల్) : విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం భాషల్లో అనర్గళంగా చదవడం, రాయడం, గణితంలో చతుర్విద ప్రక్రియలు, రాత అంశాలను నేర్పించాలని ఈ విద్యాసంవత్సం జూలై, ఆగస్టులలో 2017లో త్రీఆర్స్(రీడింగ్, రైటింగ్, రీజనింగ్) కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక, ఉన్నత, కస్తూరిబా, ఆదర్శ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని 60రోజుల పాటు నిర్వహించారు. విద్యార్థులు అన్ని అంశాల్లో కొంతవరకు ప్రగతి సాధించినప్పటికీ మరింత ప్రగతిని కనబర్చాల్సి ఉందని భావించారు. ఈ నెల 15నుంచి మార్చి చివరి వారం వరకు త్రీఆర్స్ కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అమలు ఇలా.. విద్యార్థులను జట్లుగా చేసి చివరి మూడు పీరియడ్లలో తెలుగు, ఆం గ్లం, గణితం ఒక్కో సబ్బెక్ట్కు ఒక్కో పీరియడ్ కేటాయించారు. ప్రా థమిక పాఠశాలలో తెలుగులో సరళ పదాలు నేర్పించారు. గుణింతాలు, ఆంగ్ల పదాల వద్ద, గణితంలో తీసివేతలను విద్యార్థులకు మ రింత సులభతరంగా బోధించాలని మానిటరింగ్ బృందం సూచించింది. ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల్లో తెలుగు, ఆంగ్లం లో వాక్యాలు.. గణితంలో గుణాకారాలు, భాగహారాలను మళ్లీ నేర్పించాలని సూచించారు. ప్రతీ పది రోజులకోసారి తెలుగు, గణితం, ఆం గ్లం విషయాలలో సాధించాల్సిన లక్ష్యాలను పట్టిక రూపొందించుకోవాలని సూచించారు. త్రీఆర్స్ నిర్వహణను 60రోజులు పూర్తయినా ల క్ష్యం నెరవేరలేదని మళ్లీ అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. ఉన్నత పాఠశాలల్లో చేయాల్సినవి.. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులను గ్రూపుల వారీగా విభజించి ఏ స్థాయిలో ఉన్నారో చూడాలి. తెలుగు ఆంగ్ల భా షల్లో పేరాలు చదివి అర్థం చేసుకోవడం, సొంతంగా రాయడం, గణితంలో గుణకారం, భాగహారాలతో కూడిన రాత లెక్కలను చేయగలిగే లా ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలి. మార్చి రెండో వా రంలోగా విద్యార్థులకు త్రీఆర్స్‌ను పూర్తి స్థాయిలో సాధించాల్సి ఉం టుంది. ప్రతీ పాఠశాలలో ఆరు నుంచి తొమ్మిది వరకు పిల్లలంతా త్రీఆర్స్ చేయగలరని పాఠశాలల వారీగా ధ్రువీకరించాల్సి ఉంటుందని సూచించారు. ప్రాథమిక పాఠశాలల్లో.. ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులకు మార్చి చివరి వరకు త్రీఆర్స్‌ను పూర్తి చేయాలి. తెలుగులో ఎంతమంది విద్యార్థులు సరళ పదాలు, గుణింత పదాలు, ఒత్తు పదాలు, వాక్యాలు చదవడం రాయడం చేయగలరో గుర్తించాలి. గణితంలో కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం, రాత లెక్కలు చేయగలరో గుర్తించాలి. ఆంగ్లంలో అక్షరాలు, పదాలు, వాక్యాలు, చదవడం, రాయడం చేయగలరో గుర్తించాలి. ఏ సబ్జెక్ట్లోనైన 80శాతం మంది విద్యార్థులు చేయగలిగితే మరో అంశాన్ని ప్రారంభించాలి. మార్చి చివరి వారంలో అంత్య పరీక్షలు నిర్వహించాలని అధికారులు సూచించారు. మానిటరింగ్ బృందం సందర్శన.. జనవరి 3నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర బృందం పాఠశాలలను సందర్శించింది. జిల్లాలోని 12 ప్రాథమిక పాఠశాలలు, 12 ఉన్నత పాఠశాలలను పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల రాష్ట్ర సగటు హాజరు 83శాతం కాగా, జిల్లాలో ఉపాధ్యాయుల హాజరు 75 శాతం ఉంది. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు శాతం రాష్ట్ర సగటు 84శాతం కాగా, జిల్లాలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయు ల హాజరు శాతం 87శాతం ఉందని మానిటరింగ్ బృందం నిర్ధారించింది. జిల్లాలోని మామడ మండలంలోని కొరిటికల్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో త్రీఆర్స్ బాగా అమలైనట్లు అధికారులు ప్రశంసించారు. అమలు సాధ్యమయ్యేనా? మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలున్నాయి. పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా ప్రాథమిక పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు వ్యవహరిస్తారు. వీరు ఇన్విజిలేటర్లుగా వెళ్తే త్రీఆర్స్‌ను విద్యార్థులకు బోధించడం ఇబ్బందిగా మారుతుంది. ఉన్నత పాఠశాలల్లో త్రీఆర్స్‌ను ముగించిన ఉపాధ్యాయులు ప్రస్తుతం సిలబస్‌పై దృష్టి పెట్టారు. త్రీఆర్స్పై దృష్టి పెట్టాలంటే సిలబస్ పూర్తి చేయడం కష్టంగా మారుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఆదేశాలు జారీ అయ్యాయి పాఠశాలల్లో ఇప్పటికే త్రీఆర్స్ అంశాలను అమలు చేశారు. మానిటరింగ్Š బృందాల పరిశీలనలో పూర్తిస్థాయిలో ప్రాథమిక అంశాలు అమలు కాలేదని త్రీ ఆర్స్‌ను నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఫి బ్రవరి 15నుంచి మార్చి వరకు ఈ కార్యక్రమాన్ని పాఠశాలల్లో నిర్వహించాలని సూచించారు. – వెంకటరమణారెడ్డి, సెక్టోరల్ అధికారి, నిర్మల్ పరీక్షలపుడు సాధ్యం కాదు పరీక్షల సమయంలో త్రీఆర్స్‌ను నిర్వహించడం సా« ద్యం కాదు. అధికారులు గుర్తించి రెండో విడతలో అ మలు చేయనున్న త్రీఆర్స్‌ను విరమించుకోవాలి. ప దో తరగతి పరీక్షలుండడంతో పాటు విద్యాసంవత్స రం ముగుస్తున్నందున సిలబస్‌పై ఉపాధ్యాయులు దృష్టి సారిస్తారు. వీటిని అధిగమించి త్రీఆర్స్‌ను నిర్వహించడం సాధ్యం కాదు. – తోట నరేంద్రబాబు, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి -
‘సంక్షేమానికి’ సన్న బియ్యం
ఇందూరు : నూతన విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంలో మార్పులు చేస్తోంది. పేదింటి విద్యార్థులకు ఉచితంగా సన్న బియ్యం అన్నాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జనవరి ఒకటి నుంచి ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం సరఫరా కానున్నాయి. ఈ విధానాన్ని జిల్లాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలతో పాటు కస్తూర్బాగాంధీ ఆశ్రమ పాఠశాలలలో అమలు చేసేం దుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకోస ంప్రభుత్వం సన్న బియ్యాన్ని కిలో రూ.36 చొప్పు న కొనుగోలు చేస్తుంది. రూ.35 రాయితీతో రూపాయికి కిలో చొప్పున వసతిగృహాలకు అందజేస్తుంది. ఇదీ పరిస్థితి జిల్లాలో బీసీ వసతి గృహాలు 40 ఉన్నాయి. ఇందులో 4,229 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. రోజూ 400 నుంచి 500 గ్రాముల బియ్యాన్ని వండి పెట్టాలి. ఇందుకోసం నెలకు 510 క్వింటాళ్ల సన్న బియ్యం అవసరమని ఆ శాఖ అధికారులు అంచనా వేశారు. 77 వసతి గృహాలలో ఉంటున్న 6,643 మంది విద్యార్థులకుగాను నెలకు 738 క్వింటాళ్లు బియ్యం కావాలని సాంఘిక సంక్షేమాధికారులు, వసతి గృహాలు, కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలు కలిపి 27 చోట్ల ఉంటున్న 4,242 మంది విద్యార్థులకు నెలకు 636 క్వింటాళ్ల సన్న బియ్యం అవసరమని గిరిజన సంక్షేమాధికారులు నివేదిక అందజేశారు. మొత్తంగా జిల్లాలో 146 వసతిగృహాలలలో ఉంటున్న 15,114 మంది విద్యార్థులకు నెలకు 1,884 క్వింటాళ్ల సన్న బియ్యం అవసరం కానుంది. ఈ మొత్తం బియ్యాన్ని వసతి గృహాలకు అందజేయడానికి పౌరసరఫరాల అధికారులు పది రోజుల క్రితమే కలెక్టర్ ఆధ్వర్యంలో మిల్లర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ధరను నిర్ణయించారు. మిల్లర్లు సన్న బియ్యం సరఫరాలో నాణ్యత పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. పక్కదారి పట్టిస్తే సస్పెన్షనే ఇప్పటి వరకు సంక్షేమ వసతి గృహాలకు దొడ్డు బియ్యం ద్వారానే అన్నం వండి పెట్టేవారు. వీటిని కూడా వార్డెన్లు పక్కదారి పట్టించి అమ్ముకుంటున్న సంఘటనలు చా లానే ఉన్నాయి. అలాంటివారు కిలో కు రూ.36 విలువ కలిగిన సన్న బి య్యాన్ని మార్కెట్లో అమ్ముకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సన్న బి య్యాన్ని పక్కదారి పట్టించినట్లు తేలినా, దొ రికినా సంబంధిత వార్డెన్‌ను వెంటనే సస్పెండ్ చేయనున్నట్లు సంక్షేమాధికారులు సంకేతాలు పం పుతున్నారు. పెరగనున్న కాస్మొటిక్‌చార్జీలు వసతి గృహ విద్యార్థులకు త్వరలోనే మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచడానికి ప్రభుత్వం ఆలోచి స్తోంది. ఇదివరకు ప్రతీ విద్యార్థికి మెస్ చార్జీలను నెలకు రూ. 780 చెల్లించేవారు. దీనిని పెంచి రుచికరమైన కూరగాయల భోజనంతోపాటు, మాంసాహా రం, పౌష్టికాహారం అందజేయడానికి చర్యలు చేపడుతోంది.బాలికలకు కాస్మోటిక్ చార్జీలు నెలకు రూ. 100 ఉండగా దానిని రూ.120కు పెంచనుంది. బాలురుకు రూ. 70 నుంచి రూ.100కు పెంచే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.