ఇందూరు : నూతన విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంలో మార్పులు చేస్తోంది. పేదింటి విద్యార్థులకు ఉచితంగా సన్న బియ్యం అన్నాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జనవరి ఒకటి నుంచి ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం సరఫరా కానున్నాయి.
ఈ విధానాన్ని జిల్లాలో ఉన్న ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ వసతి గృహాలతో పాటు కస్తూర్బాగాంధీ ఆశ్రమ పాఠశాలలలో అమలు చేసేం దుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకోస ంప్రభుత్వం సన్న బియ్యాన్ని కిలో రూ.36 చొప్పు న కొనుగోలు చేస్తుంది. రూ.35 రాయితీతో రూపాయికి కిలో చొప్పున వసతిగృహాలకు అందజేస్తుంది.
ఇదీ పరిస్థితి
జిల్లాలో బీసీ వసతి గృహాలు 40 ఉన్నాయి. ఇందులో 4,229 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. రోజూ 400 నుంచి 500 గ్రాముల బియ్యాన్ని వండి పెట్టాలి. ఇందుకోసం నెలకు 510 క్వింటాళ్ల సన్న బియ్యం అవసరమని ఆ శాఖ అధికారులు అంచనా వేశారు. 77 వసతి గృహాలలో ఉంటున్న 6,643 మంది విద్యార్థులకుగాను నెలకు 738 క్వింటాళ్లు బియ్యం కావాలని సాంఘిక సంక్షేమాధికారులు, వసతి గృహాలు, కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలు కలిపి 27 చోట్ల ఉంటున్న 4,242 మంది విద్యార్థులకు నెలకు 636 క్వింటాళ్ల సన్న బియ్యం అవసరమని గిరిజన సంక్షేమాధికారులు నివేదిక అందజేశారు.
మొత్తంగా జిల్లాలో 146 వసతిగృహాలలలో ఉంటున్న 15,114 మంది విద్యార్థులకు నెలకు 1,884 క్వింటాళ్ల సన్న బియ్యం అవసరం కానుంది. ఈ మొత్తం బియ్యాన్ని వసతి గృహాలకు అందజేయడానికి పౌరసరఫరాల అధికారులు పది రోజుల క్రితమే కలెక్టర్ ఆధ్వర్యంలో మిల్లర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ధరను నిర్ణయించారు. మిల్లర్లు సన్న బియ్యం సరఫరాలో నాణ్యత పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
పక్కదారి పట్టిస్తే సస్పెన్షనే
ఇప్పటి వరకు సంక్షేమ వసతి గృహాలకు దొడ్డు బియ్యం ద్వారానే అన్నం వండి పెట్టేవారు. వీటిని కూడా వార్డెన్‌లు పక్కదారి పట్టించి అమ్ముకుంటున్న సంఘటనలు చా లానే ఉన్నాయి. అలాంటివారు కిలో కు రూ.36 విలువ కలిగిన సన్న బి య్యాన్ని మార్కెట్లో అమ్ముకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సన్న బి య్యాన్ని పక్కదారి పట్టించినట్లు తేలినా, దొ రికినా సంబంధిత వార్డెన్‌ను వెంటనే సస్పెండ్ చేయనున్నట్లు సంక్షేమాధికారులు సంకేతాలు పం పుతున్నారు.
పెరగనున్న కాస్మొటిక్‌చార్జీలు
వసతి గృహ విద్యార్థులకు త్వరలోనే మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచడానికి ప్రభుత్వం ఆలోచి స్తోంది. ఇదివరకు ప్రతీ విద్యార్థికి మెస్ చార్జీలను నెలకు రూ. 780 చెల్లించేవారు. దీనిని పెంచి రుచికరమైన కూరగాయల భోజనంతోపాటు, మాంసాహా రం, పౌష్టికాహారం అందజేయడానికి చర్యలు చేపడుతోంది.బాలికలకు కాస్మోటిక్ చార్జీలు నెలకు రూ. 100 ఉండగా దానిని రూ.120కు పెంచనుంది. బాలురుకు రూ. 70 నుంచి రూ.100కు పెంచే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
‘సంక్షేమానికి’ సన్న బియ్యం
Published Wed, Dec 24 2014 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM
Advertisement
Advertisement