విద్యార్థులు, ఉద్యోగులకు వానరాకపై అప్‌డేట్స్
మేఘాలను చూస్తే అదో ఆనందం
‘సాక్షి’ పాఠకులకు తెలంగాణ వెదర్‌మ్యాన్ అనుభవాలు
ఇంటి డాబానే అతడికి ప్రయోగశాల.. ఆకాశంలో కమ్ముకున్న మేఘాలే అతడికి స్నేహితులు.. ఆ మేఘాలే అతడితో ముచ్చటిస్తాయి.. మబ్బులతోనే అతడు సావాసం చేస్తాడు.. వాటి యోగ క్షేమాలు తెలుసుకుంటాడు.. మబ్బుల ఆకారాలను చూసి మురిసిపోతాడు.. చిన్నప్పటి నుంచి అవే తన నేస్తాలు. అందుకే ఇప్పుడు తెలంగాణ మొత్తానికీ నేస్తమయ్యాడు. అందరి ఇళ్లల్లో, మనసుల్లో చోటు సంపాదించుకున్నాడు. ఇంతకీ అతడెవరా అనుకుంటున్నారా? అతడే తెలంగాణ వెదర్ మ్యాన్‌గా పేరు గాంచిన బాలాజీ తరిణి.
రుములు వస్తే చాలు ఇంట్లోకి వెళ్లి అమ్మ కొంగు చాటుకో.. నాన్న ఒడిలోకో జారుకుంటాం. కానీ బాలాజీ మాత్రం ఎంతో ఆసక్తిగా చూసేవాడు. అలా వాటిని చూస్తూనే బాల్యం గడిచిపోయింది. అయితే కరోనా సమయంలో మాత్రం తన ఆలోచనలకు పదును పెట్టాడు. ఆకాశం, మబ్బులు వర్షంపై తనకున్న ఆసక్తి కాస్తా మారింది.. నలుగురికీ సాయపడాలనే ఆలోచన తన మదిలో అంకురించింది. ఆ ఆలోచనలే తనను వెదర్‌మ్యాన్‌గా మలిచిందని చెబుతారు బాలాజీ.
ఎలా అంచనా వేస్తాడు
తనకున్న పరిజ్ఞానంతో ఎలాంటి మేఘాలు ఏర్పడ్డాయి.. ఏ మేఘాలు ఏర్పడితే ఎలాంటి వాతావరణం ఉంటుందనే అంచనా వేస్తాడు. వర్షం మోస్తరుగా వస్తుందా..? భారీగా వస్తుందా.. అనేది కూడా మేఘాల కదలికలను బట్టే చెప్పేస్తాడు. ఇలా గ్రౌండ్ విశ్లేషణ చేసిన తర్వాత.. శాటిలైట్ చిత్రాలు, మ్యాప్స్, వాతావరణ సంస్థలు, న్యూమరికల్ వెదర్ మోడల్స్ ద్వారా మోడల్ అనాలిసిస్ ద్వారా మరో అంచనాకు వస్తాడు. ఈ రెండింటినీ బేరీజు వేసుకుని వాతావరణం ఎలా ఉంటుందనే దాన్ని అంచనా వేస్తాడు.
అత్యంత కచి్చతత్వంతో..
˘వాతావరణాన్ని అంచనా వేయడం అంత సులువు కాదు. వెనకటి రోజుల్లో రైతులు మబ్బుల కదలికలను బట్టి వాతావరణాన్ని అంచనా వేసేవారు. కానీ ఇప్పుడు గ్లోబల్ వారి్మంగ్ వంటి కారణాలతో ఎప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుందో కూడా అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా అత్యంత కచ్చితత్వంతో వాతావరణాన్ని అంచనా వేస్తున్నాడు. ట్విట్టర్ (ఎక్స్) పేజీ ద్వారా తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడు వెదర్ అప్‌డేట్స్ ఇస్తున్నాడు.
సరదాలు సరదాలే..
వాతావరణం అంచనా వేయడం తనకో హాబీ అని, చదువులు, సరదాల కోసం కూడా టైం కేటాయిస్తానని చెప్పుకొచ్చాడు. అయితే కొన్ని సార్లు తన ఫాలోవర్లకు సమాచారం అందించడం కోసం సరదాలు కూడా పక్కన పెడతానని వివరించారు. ఇక, ఇంజినీరింగ్ అయిపోయాక గేట్, ఏఈ, ఏఈఈ వంటి వాటిపై దృష్టి సారిస్తూనే వాతావరణాన్ని హాబీగా కొనసాగిస్తానని పేర్కొన్నాడు. అయితే అప్పుడప్పుడూ కొందరు విమర్శలు చేస్తారని, వారి కామెంట్స్‌ను పట్టించుకోకుండా ముందుకు వెళ్తానని చెప్పాడు. ఎక్కువ మంది తన అంచనాలను నమ్మి, ప్రోత్సహిస్తుంటే కొందరి విమర్శలను మనసుకు తీసుకుని బాధపడటం సరికాదని పేర్కొన్నాడు.
వారి ప్రోత్సాహంతో...
జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో సివిల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న బాలాజీకి.. వాతావరణాన్ని అంచనా వేయడంలో రజినీ, వెదర్‌బ్రదర్ వంటి వారి ప్రోత్సాహం, సహకారంతో నైపుణ్యం సాధించానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ట్విట్టర్‌లో లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్ట్రాగామ్‌లో 35 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. వారందరికీ కచి్చతమైన సమాచారం అందిస్తే చాలా సంతృప్తిగా ఉంటుందని చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment