బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆందోళనలు..తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా | Telangana Assembly Sessions Dec 16th Live Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆందోళనలు..తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

తెలంగాణ  అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

బీఆర్‌ఎస్‌  ఎమ్మెల్యేల ఆందోళనలతో  అసెంబ్లీ సమావేశాలను రేపటికి వాయిదా వేసిన స్పీకర్‌

2024-12-16 14:45:44

వాడీవేడిగా బీఏసీ సమావేశం..

  • కొనసాగుతున్న బీఏసీ సమావేశం..
  • 50 నిమిషాలుగా కొనసాగుతున్న బీఏసీ సమావేశం
  • సభలో నిబంధనలు, ఎమ్మెల్యేల ప్రోటోకాల్ అంశంపై బీఏసీలో చర్చ
  • సభ ఎన్ని రోజులు జరపాలనే ఎజెండాపై చర్చ
  • వాడివేడిగా తెలంగాణ శాసనసభ బీఏసీ సమావేశం
     
2024-12-16 13:55:21

స్పీకర్‌కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన బీఆర్‌ఎస్‌ నేతలు..

  • కేటీఆర్‌ కామెంట్స్‌..
  • స్పీకర్‌కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన బీఆర్‌ఎస్‌ నేతలు.
  • కేటీఆర్ నేతృత్వంలో స్పీకర్‌ను కలసి నోటీసులు ఇచ్చిన బీఆర్‌ఎస్‌
  • అప్పుల విషయంలో ప్రభుత్వం సభను తప్పుదారి పట్టించిందని ప్రివిలేజ్ నోటీసులో పేర్కొన్న బీఆర్‌ఎస్‌ శాసనసభ పక్షం
  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లిన బృందం
  • లగచర్లపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని స్పీకర్‌ కోరిన బీఆర్‌ఎస్‌.
  • పరిశీలిస్తామన్న స్పీకర్‌
  • గతంలో అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్‌ను అంగీకరించిన సంప్రదాయం ఉందని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లిన గులాబీ నేతలు
  • ముఖ్యమంత్రి రేవంత్‌ అప్పుల విషయంలోనే కాదు.. మీత్తిల విషయంలో కూడా తప్పు మాట్లాడుతున్నారు
  • ఒక హీరోకు బెయిల్ వస్తే కూడా జైలులో పెట్టారు
     
2024-12-16 12:43:26

బీఏసీ సమావేశం ప్రారంభం..

  • అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్‌లో  ప్రారంభమైన బీఏసీ సమావేశం
  • హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం.
  • ప్రభుత్వ విప్‌లు, బీఏసీలో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ నేతలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ.
  • బీఏసీ సమావేశానికి హాజరైన బీజేపీ సభ్యులు, సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావు
2024-12-16 12:37:49

రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం పెరిగింది..

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వివేకానంద కామెంట్స్‌..
  • బెల్ట్ షాపుల సమస్యపై మా ప్రశ్న రాగానే సభను స్పీకర్ వాయిదా వేశారు
  • గల్లి గల్లిలో బెల్ట్ షాపులు పెరిగిపోయాయి
  • బెల్ట్ షాపులు పెంచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది
  • పార్లమెంట్ ఎన్నికల ముందు ఏప్రిల్, మేలో వేలాది కేసులు అయ్యాయి..
  • ఆ తర్వాత కేసులు నమోదు చేయడం లేదు
  • మద్యం ధరలు పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది
  • గీత కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు
  • గీత వృత్తిని నిర్వీర్యం చేసే కుట్ర ప్రభుత్వం చేస్తోంది
  • రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం పెరిగింది
  • మా పార్టీ నేతలను డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు
2024-12-16 12:34:41

విహార యాత్రలో​ ముఖ్యమంత్రి, మంత్రులు..

  • మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి కామెంట్స్‌..
  • ప్రజా సమస్యలు చర్చించడానికి ప్రభుత్వానికి భయమేస్తోంది
  • హైడ్రా పేరుతో, మూసీ ధన దాహంతో ప్రజలను ఇబ్బంది పెట్టారు
  • లగచర్లలో భూమిని లాక్కోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది
  • ఒక రైతుకు గుండెపోటు వస్తే బేడీలు వేసి తీసుకువచ్చారు
  • ముఖ్యమంత్రి జైపూర్‌లో విహార యాత్రలు చేస్తున్నారు
  • రైతులకు బేడీలు.. ముఖ్యమంత్రులు, మంత్రులు విహార యాత్రలు చేస్తున్నారు
  • జరిగిన వాస్తవాలను వినలేక ప్రభుత్వం పారిపోయింది
  • స్పీకర్ ప్రభుత్వ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారు.
  • పేర్లు లేని వారికి, బూతులు మాట్లాడే వారికి స్పీకర్ అవకాశం ఇస్తున్నారు
  • రాష్ట్రంలో ప్రజలను పెడుతున్న హింసను అడ్డుకుంటాం
  • ధాన్యం కొనుగోలు సోయి లేదు.. నోటికి వచ్చిన లెక్కలు చెబుతున్నారు
  • కాకి లెక్కలు మాట్లాడుతున్నారు
  • లగచర్ల గిరిజన రైతుల తరఫున పోరాటం చేస్తాం

  •  
2024-12-16 12:34:41

స్పీకర్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు..

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో స్పీకర్‌ను కలిశారు.
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
  • ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి తప్పుడు లెక్కలు అసెంబ్లీ ప్రకటించారని భట్టిపై ప్రివిలేజ్‌ మోషన్ మూవ్ చేసిన బీఆర్‌ఎస్‌ నేతలు
  • మరోవైపు.. కాసేపట్లో బీఏసీ సమావేశం జరగనుంది. 
2024-12-16 12:18:28

సభ ముందుకు యూనివర్సిటీల సవరణ బిల్లు

  • సభ ముందుకు యూనివర్సిటీల సవరణ బిల్లు
  • తెలంగాణ యూనివర్సిటీల సవరణ బిల్లును ప్రవేశ పెట్టిన తెలంగాణ శాసన సభ.
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి దామోదర రాజనర్సింహ
2024-12-16 12:13:28

సర్పంచ్‌ల బిల్లులపై హరీష్‌ రావు ఫైర్‌

  • సర్పంచుల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి హరీష్ రావు
  • 690 కోట్లు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని మంత్రి సీతక్క గారు చెప్పారు.
  • ఈరోజు రాష్ట్రంలో బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు, కానీ సర్పంచులకు బిల్లులు చెల్లించడం లేదు.
  • ఏడాది కాలం నుండి 690 కోట్లు ఇవ్వకుండా సర్పంచులు, ఎంపీటీసీలను ఈ ప్రభుత్వం గోస పుచ్చుకుంటున్నది.
  • గవర్నర్ ను కలిసి మొర పెట్టుకున్నారు, మంత్రులను కలిసి మొరపెట్టుకున్నారు. ఎక్కడిక్కడ వారిని అరెస్టులు చేశారు.
  • కేసీఆర్‌ పల్లెలను అద్భుతంగా తీర్చిదిద్దారు.
  • పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి గొప్ప కార్యక్రమాలు అమలు చేశారు.
  • పల్లె ప్రగతికి ప్రతి నెల 275 కోట్లు, పట్టణ ప్రగతి కోసం 150 కోట్లు ఇచ్చాము.
  • కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంలో ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదు.
  • కేంద్ర ప్రభుత్వ చెబుతున్న లెక్కలు. దేశవ్యాప్తంగా ఉత్తమ గ్రామపంచాయతీలు ప్రకటిస్తే 20కిగాను 19 తెలంగాణ గ్రామాలకు వచ్చాయి.
  • తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీదే.
  • ఈ ప్రభుత్వం వచ్చాక SFC నిధులు విడుదల కావడం లేదు, 15 ఫైనాన్స్ కమిషన్ బిల్లులు డైవర్ట్ చేశారు.
  • జీపీ ఫండ్ కూడా ఖర్చు పెట్టుకోకుండా చేశారు.
  • సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి.
  • అప్పులు చేసి, బంగారం కుదువపెట్టి గ్రామ పంచాయతీ పనులు చేశారు.
  • నవంబర్ ఒక్క నెలలోనే బడా బడా కాంట్రాక్టర్లకు 1200 కోట్లు విడుదల చేశారు
  • చిన్న పనులు చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు బిల్లులు విడుదల చేయకుండా పగ బట్టారు
  • వారిపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు.
  • గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయక పోవడం వల్ల రోగాలు పెరిగాయి.
  • తెలంగాణకు పోతే చికెన్ గున్యా ఉంది, వెళ్ళకండి జాగ్రత్త అని అమెరికా హెచ్చరించిన దుస్థితి వచ్చింది.
  • ఇది దేశానికి, తెలంగాణకు అవమానం.
  • సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పిటిసిలకు 9 నెలలు అయినా జీతాలు పెండింగ్లో ఉన్నాయి
  • చేసిన పనులకు బిల్లులు ఇవ్వరు, జీతాలు ఇవ్వరు.
  • అప్పులు కట్టలేక వారు చాలా బాధల్లో ఉన్నారు
  • ఇప్పటికైనా బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టమైన తేదీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
     
2024-12-16 12:13:28

రేషన్‌ కార్డులపై గుత్తా కీలక వ్యాఖ్యలు

  • శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు.. 
  • అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలి.
  • పేదరికం అనుభవిస్తున్న  వారికి మాత్రమే ప్రభుత్వం సరుకులు పంపిణీ చేయాలి.
  • అనర్హులు కూడా రేషన్ కార్డ్ పొంది ప్రభుత్వం ఆదాయానికి గండి పెడుతున్నారు.
  • సివిల్ సప్లై అధికారులు సమగ్ర విచారణ జరిపి అవసరం లేని వారికి కార్డులను తొలగించాలి.
  • అవసరం ఉన్న వారికి మాత్రమే రేషన్ కార్డులను పంపిణీ చేయాలి.

 

 

2024-12-16 12:05:53

బీఆర్‌ఎస్‌ నేతలపై శ్రీధర్‌ బాబు సీరియస్‌

  • బీఆర్‌ఎస్‌ వాకౌట్‌పై మంత్రి శ్రీధర్‌ బాబు సీరియస్‌
  • బీఆర్‌ఎస్‌ పాలనలో సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్నారు.
  • ప్రతీ నెలా రూ.250 కోట్లు చెల్లిస్తే పెండింగ్‌ బిల్లులు ఎలా ఉంటాయి?.
  • శాసనసభను బీఆర్‌ఎస్‌ తప్పు దోవ పట్టింస్తోంది.
  • సభ నుంచి వాకౌట్‌ చేయడం సరైన నిర్ణయం కాదు. 
     
2024-12-16 11:26:03

బీఆర్‌ఎస్‌ నేతల వాకౌట్‌..

  • హరీష్ రావు కామెంట్స్‌..  
  • సభ నడుపుతున్న తీరు బాధ కలిగిస్తోంది.
  • సీతక్క సర్పంచ్ పెండింగ్ బిల్లుల విషయంలో నా పేరు తీయడం కరెక్ట్ కాదు.
  • పల్లె ప్రగతి పేరుతో ప్రతీ నెలా 250 కోట్లు మేము ఆనాడు విడుదల చేసాము.
  • అనంతరం, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ సభ్యుల నినాదాలు.
  • ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ నినాదాలు.
  • తెలంగాణ శాసన సభ నుంచి బీఆర్‌ఎస్‌ నేతల వాకౌట్
2024-12-16 10:53:00

పంచాయతీలకు కొత్త రోడ్లు: మంత్రి సీతక్క

  • మంత్రి సీతక్క కామెంట్స్‌..
  • పంచాయతీలకు 12వేల కోట్లతో 11 వేల కిలోమీటర్ల రోడ్లు వేయబోతున్నాం.
  • గత పదేళ్ళలో పంచాయతీ రోడ్లకు కేవలం రెండు వేల కోట్లే ఖర్చు పెట్టారు.
  • గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో మా ప్రభుత్వంపై భారం పడుతుంది.
  • సర్పంచ్ పెండింగ్ బిల్లులను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చింది.
  • సర్పంచ్ బిల్లులు పెండింగ్ ఇప్పుడే కాదు 2014 నుంచి ఉన్నాయి.
  • సర్పంచ్ పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికి హరీష్ రావుకు ఆనాడు అవకాశం ఉన్నా క్లియర్ చేయలేదు.
  • హరీష్ రావు ఒక్క సంతకంతో 6వందల కోట్లు పెండింగ్ బిల్లులు క్లియర్ అయ్యేవి.
  • బీఆర్‌ఎస్‌ అంటే బకాయిల రాష్ట్ర సమితి లెక్క తయారు చేశారు.
     
2024-12-16 10:36:18

కేంద్రం నిధులను డైవర్ట్‌ చేస్తున్నారు: హరీష్‌ రావు

  • హరీష్ రావు కామెంట్స్‌..
  • రాష్ట్రంలో పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు.
  • చిన్న కాంట్రాక్టర్లు కాళ్లు అరిగేలా తిరుగుతున్నా.. బిల్లు ఇవ్వడం లేదు.
  • పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా పల్లెలను అద్భుతంగా తీర్చిదిద్దాం.
  • కేంద్ర ప్రభుత్వ నిధులు డైవర్ట్ చేస్తున్నారు.
  • ఎప్పటిలోగా పంచాయతీ పనులకు బిల్లులు ఇస్తారో చెప్పాలి.
  • చలో అసెంబ్లీకి వస్తే సర్పంచ్‌ను అరెస్ట్‌ చేశారు. 
  • వారికి రావాల్సిన బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారు?
     
2024-12-16 10:34:40

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత..

  • లగచర్ల ఘటనపై బీఆర్‌ఎస్‌ నేతల నినాదాలు..
  • దీంతో, తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. 
  • లగచర్ల రైతన్నలకు బేడీలు వేసిన ప్రభుత్వ వైఖరిపైన నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల నినాదాలు
  • రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వ తీరు పైన నినాదాలు
  • రైతులకు బేడీల సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు
  • ప్లకార్డులను శాసనసభలోకి తీసుకుపోకుండా అడ్డుకున్న పోలీసులు
2024-12-16 10:10:27

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

  • తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 
  • నేడు అసెంబ్లీకి పలు బిల్లులు..
2024-12-16 10:06:46

లగచర్ల రైతులు చేసిన తప్పేమిటి?: కౌశిక్‌ రెడ్డి

  • పాడి కౌశిక్‌ రెడ్డి కామెంట్స్‌..
  • బీఏసీలో చర్చించకుండానే అసెంబ్లీ ఎజెండా ఖరారు చేయడం దారుణం
  • టూరిజం మీద కాదు ఇపుడు చర్చించాల్సింది.
  • లగచర్లలో రైతులను అక్రమంగా అరెస్టు చేయడంపై చర్చించాలి
  • లగచర్ల రైతులు చేసిన తప్పేమిటి?
  • నెల రోజులుగా జైల్లో వేసేంత తప్పు రైతులు ఏం చేశారు?
  • గుండె పోటు వచ్చిన హీరా నాయక్ కు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకు వస్తారా ?
  • యావత్ తెలంగాణ రైతులను అనుమానించారు
  • టూరిజం మీద చర్చ కాదు లగచర్లలో జరిగిన టెర్రర్ మీద చర్చ జరగాలి
  • అదానీ అల్లుడు అన్నదమ్ముల కోసం రేవంత్ భూ సేకరణ చేస్తున్నారు
  • లగచర్లపై చర్చ జరగాలని వాయిదా తీర్మానం ఇచ్చాము
  • ఎట్టి పరిస్థితుల్లో చర్చ జరగాల్సిందే
  • అప్పు ఏడు లక్షల కోట్ల రూపాయలంటూ అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన ఆర్థిక మంత్రి భట్టిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులిస్తాం.
     
2024-12-16 09:56:02

బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం..

  • బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం..
  • అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం.
  • లగచర్ల ఘటనపై బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం ఇచ్చింది.
  • రైతులను అరెస్ట్‌ చేసి, జైలులో హింసిస్తున్నారని ఆరోపణ 
     
2024-12-16 09:22:10

నేడు కేబినెట్‌ భేటీ..

  • మధ్యాహ్నం కేబినెట్‌ భేటీ..
  • మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ కేబినెట్ భేటి..
  • అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమావేశం కానున్న కేబినెట్..
  • 5 ఆర్డినెన్స్‌లకు ఆమోదం తెలపనున్న కేబినెట్.
  • ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ తేనున్న కేబినెట్..
తెలంగాణ సభ సమరం..అసెంబ్లీలో ప్రధాన చర్చలు ఇవే!
2024-12-16 09:03:09

పలు బిల్లులపై చర్చ..

  • నేడు పలు బిల్లులపై చర్చ..
  • నేడు ప్రశ్నోత్తరాలు.. సంతాపాలు, రెండు బిల్లులు, స్వల్పకాలిక చర్చ
  • బెల్టు షాపుల మూసివేత, పెండింగ్‌ బిల్లులు, టీజీఐఐసీ పార్కులపై ప్రభుత్వ సమాధానం
  • స్పోర్ట్స్‌ యూనివర్సిటీతో పాటు మరో బిల్లు ప్రవేశపెట్టనున్న సర్కారు
  • పర్యాటక విధానంపై అసెంబ్లీ, మండలిలో స్వల్పకాలిక చర్చ
2024-12-16 09:03:09

కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

  • నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు.
  • ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రారంభం..
  • ఇటీవల మృతిచెందిన మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతి, ఊకే అబ్బయ్య, రామచంద్రారెడ్డికి సంతాపం తెలుపనున్న అసెంబ్లీ.
  • అనంతరం ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్న స్పీకర్
  • అసెంబ్లీలో టూరిజం పాలసీపై లఘు చర్చ..
  • దివంగత మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేన్ రెడ్డికి సంతాపం తెలపనున్న శాసనమండలి.
  • అనంతరం ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్న ఛైర్మన్..
  • మండలి లో టూరిజం పాలసీపై లఘు చర్చ..
     
2024-12-16 09:00:56
Advertisement
 
Advertisement
 
Advertisement