సుర్రుమన్న సూరీడు.. | Temperature Increases Day By Day in Telangana | Sakshi
Sakshi News home page

సుర్రుమన్న సూరీడు..

Published Tue, Apr 2 2024 7:38 AM | Last Updated on Tue, Apr 2 2024 12:27 PM

Temperature Increases Day By Day in Telangana  - Sakshi

అమీర్‌పేటలో గొడుగుల నీడలో వెళ్తున్న యువతులు

సుర్రుమన్న సూరీడు.. 

పగలు భగభగలు..రాత్రి ఉక్కపోత 

సోమవారం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు 

మియాపూర్‌లో 41.7 డిగ్రీలు, కందుకూరులో 41.6 డిగ్రీలు నమోదు

సాక్షి,హైదరాబాద్‌: ఎండలు భగ్గున మండుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకే సూరీడు నిప్పులు కక్కతున్నాడు. మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. తాజాగా సోమవారం మియాపూర్‌లో అత్యధికంగా 41.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమో దు కాగా, కందుకూరు, చందానగర్, నాగోల్‌లో 41.6 డిగ్రీలు, చిలుకూరు, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో 41.5 డిగ్రీలు, ఇబ్రహీంపట్నంలో 41.5, డిగ్రీలు, షాబాద్, రాచలూరు, అత్తాపూర్‌ తదితర మండలాల్లో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతల చొప్పున రికార్డు అయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లో 40 నుం చి 40.9 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
    
మీటరు గిరగిర.. 
భగ్గున మండుతున్న ఎండలకు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు రోజంతా ఆన్‌లో ఉండటం, సామర్థ్యానికి మించి విద్యుత్‌ వినియోగిస్తుండటంతో సబ్‌స్టేషన్లలోని పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు హీటెక్కుతున్నాయి. ఫీడర్లు ట్రిప్పవుతుండటంతో పాటు కండకర్లు, ఇన్సులేటర్లు వేడికి పేలిపోతున్నాయి. ముఖ్యంగా సాయంత్రం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య అత్యధిక డిమాండ్‌ నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గత ఏడాది ఏప్రిల్‌ 1న 2954 మెగావాట్లు నమోదు కాగా, తాజాగా సోమవారం ఏకంగా 3738 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం నమోదైంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement