తగ్గుతున్న బంగారం ధరలు కంపెనీల లాభాల మార్జిన్లపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ఈ రంగంలో ఉన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల షేర్ల ధరలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గత పది రోజుల్లో ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు 15 నుంచి 20 శాతం నష్టపోయాయి. ముత్తూట్ ఫైనాన్స్ షేరు 19 శాతం, మణప్పురం 17 శాతం, ఐఐఎఫ్‌ఎల్ 15 శాతం చొప్పున నష్టపోయాయి. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడుతుండటమే కాక... ఇంకా తగ్గుతాయన్న అంచనాలు గోల్డ్ లోన్ వ్యాపారస్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే దేశీ మార్కెట్లో ఇంకా అంతగా తగ్గలేదు. అయితే మరింత తగ్గవచ్చనే విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా... ఆభరణాలను తనఖా పెట్టుకొని అప్పులిచ్చే సంస్థలు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా కొత్తగా ఇచ్చే రుణాల్లో లోన్ టు వేల్యూ (ఎల్‌టీవీ) విలువను భారీగా తగ్గించేశాయి.
Published Thu, Jul 30 2015 1:14 PM | Last Updated on Wed, Mar 20 2024 1:04 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement