తారాగణం ఎంపిక కోసం ఫేస్‌బుక్‌లో చేసిన ప్రచారానికి విశేషాదరణ లభించింది. చాలామంది తమ ప్రొఫైల్స్ పంపించారు. వాటిల్లోంచి 15 మందిని ఎంచుకుని, మేకప్ టెస్ట్‌కు పిలిచారు. ఫైనల్‌గా ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేశారు. ఒక హీరోగా చేస్తున్న సుమంత్‌రెడ్డికిదే తొలి సినిమా. మరో హీరో మనీష్ ఇంతకుముందు ‘హమ్‌తుమ్’ తదితర చిత్రాల్లో నటించారు. కథానాయికలు ఆకృతి, మధులగ్నదాస్ ఇప్పటికే కొన్ని సినిమాలు చేశారు. కొన్ని సన్నివేశాలు సంభాషణలతో సహా సిద్ధమయ్యాయి. సంగీత దర్శకుడు సుమన్ జూపూడి తానే ఓ పాట రాసి బాణీతో సహా సిద్ధం చేశారు. ప్రస్తుతం పాట ఆ రికార్డింగ్ జరుగుతోంది. షూటింగ్‌కు కావాల్సిన సరంజామా అంతా సిద్ధం చేసుకున్నారు. లొకేషన్ల ఎంపిక కూడా పూర్తయింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్-మియాపూర్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో చిత్రీకరణ మొదలు పెట్టారు. తెల్లవారు జాము 6 గంటల వరకూ నిర్విరామంగా ఈ షూటింగ్ జరుగుతుంది.
Published Thu, Oct 16 2014 3:20 PM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement