చంద్రబాబు తీరు నచ్చకే ఐఏఎస్‌ల హస్తిన బాట | 10 IAS officers transferred in AP | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 26 2016 7:40 AM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM

అఖిల భారత సర్వీసుకు చెందిన ఐఏఎస్‌ అధికారులు రాష్ట్రం వదిలివెళ్లిపోతున్నారు. గత రెండున్నరేళ్లలో పలువురు కేంద్ర సర్వీసుకు వెళ్లిపోగా.. అదే బాటలో మరొక పది మంది హస్తిన బాటపడుతున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలి నచ్చకనే ఎక్కువ మంది రాష్ట్రంలో పనిచేయడానికి ఇష్టపడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారాంతపు సెలవులు, పండుగలనే తేడా లేకుండా ప్రతిరోజూ ప్రయోజనం లేని సమీక్షలతో గంటల తరబడి తమ సమయాన్ని సీఎం వృథా చేస్తున్నారని, ఆ సమీక్షలకు వెళ్లి చెప్పింది విని రావడం తప్ప ఎటువంటి ఫలితం ఉండటం లేదనే భావన పలువురు ఐఏఎస్‌లలో వ్యక్తం అవుతోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement