మూడున్నరేళ్ల కిందట... అంటే 2013 ఆగస్టులో ఏం జరిగిందో గుర్తుందా? డాలరుతో పోలిస్తే రూపాయి దారుణంగా పడిపోరుుంది. దిగుమతి చేసుకునే వస్తువల ధరలు భారీగా పెరిగిపోయారుు. సామాన్యుడి నుంచి పారిశ్రామికవేత్తల వరకూ అంతా బెంబేలెత్తిపోయారు. మళ్లీ ఇపుడు అదే పరిస్థితులు తలెత్తుతున్నాయా...! అనే భయాలు వ్యక్తమవుతున్నారుు. ఎందుకంటే ఈ సోమవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో... రూపాయి అప్పటి రికార్డు కనిష్టస్థారుు 68.85 సమీపానికి చేరింది. కేవలం పది రోజుల్లో 200 పైసలు నష్టపోరుున రూపాయి తాజాగా 68.27 స్థారుుకి వచ్చి చేరింది. ఇది మరింతగా తగ్గితే, మనదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సహా దిగుమతయ్యే ప్రతి ఉత్పత్తి ధరా పెరిగిపోతుంది. అసలే పెద్ద నోట్ల రద్దుతో రోజువారీ ఖర్చులకు కరెన్సీ నోట్లు లేక అల్లాడుతున్న ప్రజల నెత్తిమీద ధరల భారం పడే ప్రమాదం రూపాయి రూపంలో పొంచి ఉన్నట్టు కనిపిస్తోంది.
Published Tue, Nov 22 2016 8:05 AM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM
Advertisement
Advertisement
Advertisement