జూలైలో గల్లంతైన ఏఎన్-32 ఎయిర్‌క్రాఫ్ట్‌లోని 29 మంది సిబ్బంది అంతా మృతి చెందినట్లు భావిస్తున్నామని భారత వైమానిక దళం వారి బంధువులకు తెలియజేసింది. గాలింపు చర్యలు, దొరికిన సాక్ష్యాలను బట్టి ప్రయాణికులు బతికుండే వీలు లేదని నిర్ధారణకు వచ్చినట్లు తెలిపింది. ఆగస్టు 24వ తేదీతో ఉన్న లేఖను ఆయా కుటుంబాలకు పంపింది. అలాగే బీమా, ఇతర కార్యక్రమాల విషయంలో ముందుకెళ్లవచ్చని సూచించింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన గాలింపు కార్యక్రమా లు కొనసాగుతాయని ఎయిర్‌ఫోర్స్ వర్గాలు పేర్కొన్నాయి. చైన్నై సమీపంలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన ఒక రవాణా విమానం బంగాళాఖాతంలో జూలై 22న కన్పించకుండా పోయిన విషయం తెలిసిందే.
Published Fri, Sep 16 2016 6:44 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
Advertisement