సీమాంధ్ర నేతలంతా సంయమనం పాటించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్‌సింగ్ కోరారు. రాజీనామాలు ప్రభుత్వంపై ప్రభావం చూపబోవని అన్నారు. తెలంగాణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసి తీరుతామన్నారు. సీమాంధ్రలో జాతీయ నాయకుల విగ్రహాలు కూల్చడం బాధాకరమన్నారు. విడిపోయినా సీమాంధ్ర ప్రాంతానికి ఆర్థికంగా ఎదిగే సామర్థ్యం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర ప్రజల ఆవేదనను తాము అర్థం చేసుకున్నామని చెప్పారు. కలిసి మెలసి పనిచేద్దామని ఆయన ఇరు పాంత్రాల వారికి పిలుపునిచ్చారు. గాంధీనగర్, చండీగఢ్‌లా అద్భుతమైన కొత్త రాజధాని నిర్మించుకోవచ్చని దిగ్విజయ్ సింగ్ అన్నారు. దిగ్విజయ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే తెలంగాణ అంశంపై కాంగ్రెస్ నిర్ణయం వెలువరించిన సంగతి తెలిసిందే. ఆయన ఇన్చార్జిగా వచ్చిన తర్వాత తెలంగాణపై సంప్రదింపులు ముగించి కాంగ్రెస్ తన వైఖరి స్పష్టం చేసింది.
Published Thu, Aug 1 2013 5:27 PM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement