25 మంది మహిళలు ‘తాళి’ తెంచేశారు | Dravidar kazhagam holds thaali removal function | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 14 2015 5:07 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

ద్రావిడార్ కళగం మంగళవారం నాడిక్కడ చేపట్టిన ఓ కార్యక్రమంలో 25 మంది మహిళలు తమ మెడలోని మంగళ సూత్రాలను ఉదయం 6.45 గంటల ముహూర్తానికి తెంపేశారు. బానిసత్వం నుంచి విముక్తి అయినట్టు గర్వంగా ప్రకటించారు. వాటికున్న బంగారాన్ని హేతువాద ద్రావిడార్ కళగంకు విరాళంగా ఇచ్చారు. ఇంతలో ఈ కార్యక్రమాన్ని నిలిపినేస్తూ హైకోర్టు నుంచి ద్విసభ్య బెంచి ఉత్తర్వులు జారీ చేసింది. కార్యక్రమం అర్ధాంతరంగా నిలిచిపోయింది. న్యాయ పోరాటంలో తాము విజయం సాధించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని ద్రావిడార్ కళగం అధ్యక్షుడు కే వీరమణి ప్రకటించారు. ‘ఆహా తాళి తెంచేయడంతో ఎంతో ఉపశమనంగా ఉంది. ఇంతకాలం దీన్ని ఓ అవమానకరమైన చిహ్నంగానే చూశాను. ఇక ముందు ఇది నా మెడలో లేకపోవడం వల్ల నాకు కలిగే బాధేమి లేదు’ అని ఈ కార్యక్రమంలో తాళి తెంచేసిన ఓ మహిళ వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement