మూడు రోజులుగా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్ | encounter enters third day in pampour, one terrorist killed | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 12 2016 10:20 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

జమ్ము కశ్మీర్‌లోని పాంపోర్ ప్రాంతంలోగల ఓ ప్రభుత్వ భవనంలో నక్కిన ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు గత మూడు రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఈడీఐ) భవనంలో దాగిన ఉగ్రవాదుల్లో ఒకరిని భద్రతాదళాలు హతమార్చాయి. శ్రీనగర్- జమ్ము జాతీయ రహదారి సమీపంలో గల ఈ భవనంమీద పలుమార్లు మోర్టార్లతో దాడి చేయడంతో పాటు ఉగ్రవాదులను హతమార్చేందుకు ఐఈడీ కూడా పేల్చారు. సోమవారం ఉదయం మొదలైన ఈ ఎన్‌కౌంటర్ బుధవారం ఉదయం కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement