కర్నూలు నగరాన్ని కమ్మేసిన దట్టమైన పొగల వెనుక చీకటి కోణం ఆశ్చర్యం కలిగిస్తోంది. శ్రీ రాయలసీమ ఆల్కాలీస్ అండ్ అల్లైడ్ కెమికల్స్(ఎస్‌ఆర్‌ఏఏసీఎల్)కు సమీపంలోని శివటెక్ ఇండస్ట్రీస్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంతో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నగరాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. సింథటిక్ ఆర్గానిక్ కెమికల్స్ తయారీ యూనిటైన ఈ శివటెక్ ఇండస్ట్రీస్ కనీసం అగ్నిమాపకశాఖ నుంచి అనుమతి కూడా తీసుకోలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా అగ్నిప్రమాదం జరిగిన వెంటనే మంటలను అదుపు చేసేందుకు అవసరమైన పరికరాలు సదరు కంపెనీలో లేవు. ఈ కారణంగా మంటలు వ్యాపించి వెంటనే అదుపులోకి రాని పరిస్థితి ఏర్పడింది. ఎంతో విషతుల్యమైన ఈ రసాయనాల కంపెనీకే అగ్నిమాపకశాఖ అనుమతి లేదంటే.. ఇక మిగిలిన కంపెనీల పరిస్థితి ఏమిటో తలచుకుంటేనే గుండెల్లో దడ పుడుతోంది. మొత్తం మీద శివటెక్ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంతో సదరు కంపెనీకి సుమారు రూ.4 కోట్ల మేరకు నష్టం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనా. అయితే, అంతకుమించి ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Published Sun, Oct 9 2016 9:12 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement