కోల్కత్తా మహానగరంలో బహుళ అంతస్తుల భవనం చటర్జీ ఇంటర్నేషనల్ బిల్డింగ్లోని 15వ అంతస్తులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే మంటల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారి వెల్లడించారు. ఆ బహుళ అంతస్తుల భవనంలో పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు ఉన్నాయని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు చెప్పారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరు గాయపడినట్లు కానీ మరణించినట్లుగాని సమాచారం లేదు. అలాగే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
Published Tue, Sep 2 2014 12:33 PM | Last Updated on Thu, Mar 21 2024 8:10 PM
Advertisement
Advertisement
Advertisement