గోవా జైలులో ఖైదీల బీభత్సం | Goa: 45 inmates attack Sada sub jail personnel, try to flee | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 25 2017 10:36 AM | Last Updated on Thu, Mar 21 2024 8:43 PM

గోవాలోని ఓ జైలులో రెండు గ్రూపుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఓ ఖైదీ మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. పంజీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సదా సబ్ జైలులో మంళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి వివరాలను డీఎస్పీ లారెన్స్ డి సౌజా బుధవారం తెలిపారు. జైలులో రెండు ఖైదీల గ్రూపుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఖైదీ వినాయక్ కోర్బాట్కర్ కత్తి పోట్లతో తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన ఆతన్ని ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈ నెలలోనే మరో ఖైదీ అశ్పక్ బెనర్జీ పై కత్తితో దాడి చేసిన ఘటనలో వినాయక్ ప్రమేయం ఉందని తెలిపారు.

Advertisement

పోల్

 
Advertisement