రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిల్ ను కొట్టేసిన హైకోర్టు | HC rejects andhra pradesh bifurcation pil | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 8 2013 3:18 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా తదుపరి చర్యలేవీ చేపట్టకుండా కేంద్ర కేబినెట్, కేంద్ర హోంశాఖ కార్యదర్శులను ఆదేశించాలని అభ్యర్థిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను హైకోర్టు కొట్టివేసింది. ఇందులో ప్రజాప్రయోజనాలు లేవంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. రాష్ట్రవిభజనకు ఉద్దేశించి రాజ్యాంగంలోని 3వ అధికరణ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, ప్రవేశికకు విరుద్ధంగా ఉందని, ఈ కారణంతో దాన్ని కొట్టివేయాలని పిటిషినర్‌ పీవీ కృష్ణయ్య హైకోర్టు ముందు వాదనలు వినిపించారు. రాష్ట్రంలో 371(డి) అధికరణ అమల్లో ఉండగా 3వ అధికరణకు అనుగుణంగా రాష్ట్ర విభజన చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని వాదించారు. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం పిల్ను కొట్టివేస్తూ మంగళవారం మధ్యాహ్నం తీర్పు వెలువరించింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement