ఎస్సారెస్సీ కాలువకు భారీ గండి | huge break in the SRSC canal | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 20 2016 4:24 PM | Last Updated on Thu, Mar 21 2024 9:52 AM

కరీంనగర్ జిల్లా మల్యాల మండలం మానాల వద్ద ఎస్సారెస్సీ కాలువకు మంగళవారం ఉదయం భారీ గండి పడింది. నీరంతా వృథాగా పోతోంది. కాలువ నీరు దమ్మక్క చెరువు భారీగా చేరుతుండడంతో దమ్మక్కచెరువుకు గండిపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. గండి ఫలితంగా మ్యాడంపల్లికి రాకపోకలు బంద్ అయ్యాయి. ఎమ్మెల్యే బి.శోభ సంఘటన స్థలానికి చేరుకుని అధికారులను అప్రమత్తం చేశారు. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు నుంచి కాలువకు నీటి విడుదలను నిలిపివేశారు. గత కొద్ది రోజులుగా ఎస్సారెస్సీ నుంచి కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యామ్‌కు 6500 క్యూసెక్కుల నీటిని విడుదలచేస్తున్నారు. కాలువ మరమ్మతు పనులు ల్పోభూయిష్టంగా ఉండడంవల్లే గండి పడిందని స్థానికులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement