భార్యపై కోపంతో పిల్లలను చంపిన ప్రొఫెసర్ | icfai-university-professor-kids-found-dead-at-medchal | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 6 2014 5:41 PM | Last Updated on Fri, Mar 22 2024 11:12 AM

ఆత్మహత్య చేసుకున్న ఇక్ఫాయ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాఘవేంద్ర గురుప్రసాద్ ఇద్దరు పిల్లలు విఠల్ విరించి (9), నంద విహారి (5) శవాలై కనిపించారు. వీరి మృతదేహాలను సైబరాబాద్ పోలీసులు మేడ్చల్ లోని బీరప్పగూడలో కనుగొన్నారు. వీరిని తండ్రే హత్యచేశాడని పోలీసులు తెలిపారు. తండ్రితో పాటు వెళ్లి వీరు అదృశ్యమైయ్యారు. సికింద్రాబాద్ జేమ్స్ స్ట్రీట్ రైల్వే ట్రాక్‌పై రైలు కింద పడి గురుప్రసాద్ బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలను హత్య చేసిన తర్వాతే అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పిల్లలకు విషమిచ్చి హత్యచేసినట్టు వెల్లడించారు. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విరించి, విహారి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. భార్య సుహాసినిపై కోపంతో అతడీ కిరాతకానికి ఒడిగట్టాడు. కన్నకొడుకులను కర్కశంగా హత్యచేసి పూడ్చిపెట్టినట్టు పోలీసులు గుర్తించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement