బుధవారం తెల్లవారుజామున పశ్చిమ ఇండోనేసియాను పెను భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 6.5గా నమో దైన ఈ ఘటనలో ఇప్పటివరకు 97 మృతదేహాలను వెలికితీయగా.. మరింత మంది శిథిలాల కింద మృతిచెంది ఉండొ చ్చని భావిస్తున్నారు. పీడీ జయ జిల్లాలో ఎక్కువ ప్రభావం చూపిన ఈ భూకంపం కారణంగా చాలామటుకు భవనాలు నిలువునా కుప్పకూలిపోయాయి. సుమత్రా దీవిలోని ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువ. ఉదయం ప్రార్థనల కోసం ముస్లిం సోదరులు సిద్ధమవుతున్న సమయంలో భూమి కంపించింది. దీంతో ఇళ్లతోపాటు మసీదుల్లోనూ పెద్దసంఖ్యలో మృతుల సంఖ్య ఉండొచ్చని భావిస్తున్నారు.
Published Thu, Dec 8 2016 7:18 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM
Advertisement
Advertisement
Advertisement