సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రేపటి నుంచి చేపట్టిన సమరభేరీ దీక్షను భగ్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆదివారం ఆరోపించారు. హైదరాబాద్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...అవనిగడ్డ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ పోటీ చేయడం లేదు, అయితే పోటీలో లేని పార్టీకి ఎన్నికల కోడ్ ఏలా వర్తింస్తుందో చెప్పాలి అని అన్నారు. ఏదో కారణం చెప్పి ప్రభుత్వం విజయవాడలో వైఎస్ విజయమ్మ దీక్షకు అనుమతి నిరాకరించిందని ఆమె ఆగ్రహాం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర కోసం చేస్తున్న ఉద్యమంలో రాష్ట్రంలోని అన్ని పార్టీల కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉందన్నారు. సీడబ్ల్యూసీ భేటీకి కంటే ముందే తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతిని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రాజకీయా డ్రామాలు ఆడుతున్నారన్ని ఆమె పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజలను ఎన్ని రోజలు మోసం చేస్తారని ఆమె ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. అయితే ఆ పార్టీ నేతలను ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆమె జోస్యం చేప్పారు. కాగా ఆంటోని కమిటీకి వైఎస్ఆర్ సీపీ చెప్పాల్సిందేమీ లేదని ఆమె స్ఫష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రకటన చేసినప్పుడు మిన్నకుండ ఉన్న నేతలు ఇప్పుడు మాట్లాడటం ఏమిటని వాసిరెడ్డి పద్మ ఈ సందర్బంగా చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. చంద్రబాబు కేంద్రంలో చక్రం కాదు కదా, బొంగరం కూడా తిప్పలేరని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు.
Published Sun, Aug 18 2013 1:45 PM | Last Updated on Thu, Mar 21 2024 5:15 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement