kiran government
-
కిరణ్ సర్కారును.. కడిగిపారేసిన కాగ్ !
నిధుల విడుదల జాప్యంతో సకాలంలో నీటి ప్రాజెక్టులు పూర్తికాలేదన్న కాగ్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అంచనా వ్యయం పెరిగి ఖజానాపై రూ.12,591.63 కోట్ల భారం సంక్షేమ పథకాల అమల్లోనూ కిరణ్ సర్కారు తీరును తీవ్రంగా ఆక్షేపించిన కాగ్ లబ్ధిదారులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయేలా చేశారని స్పష్టీకరణ ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని తుడా,స్విమ్స్ యాజమాన్యాలకు చీవాట్లు సాక్షి ప్రతినిధి, తిరుపతి: సంక్షేమాభివృద్ధి పథకాలకు బడ్జెట్లో నిధు ల కేటాయింపునకు విడుదలకూ పొంతన కుదరకపోవడం వల్ల ప్రగతి తిరోగమిస్తోందని కంప్ట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తేల్చిచెప్పింది. నిధుల విడుదలలో నిర్లక్ష్యంవల్ల సాగునీటి ప్రాజెక్టుల అం చనా వ్యయం అంతకంతకూ పెరి గి ప్రభుత్వ ఖజానాపై రూ.12,591.63 కోట్ల భారం పడిందని తేల్చింది. ఇందిరప్రభ, రాజీవ్ యువకిరణాలు, మహిళలకు, రైతులకు వడ్డీలేని రుణాలు వంటి పథకాల్లోనూ లబ్ధిదారులకు మొండిచేయి చూపారని పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికను శనివారం శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పటి కిరణ్ ప్రభుత్వం నిర్వాకాలను కాగ్ తూర్పారబట్టింది. సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేసేందు కు 2011-12లో ‘గ్రీన్ చానల్’ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. కానీ.. తాను ప్రవేశపెట్టిన విధానాన్నే కిరణ్ సర్కారు అపహాస్యం చేసింది. బడ్జెట్లో కేటాయించిన మేరకు ఏ ఒక్క ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు. 2011-12,2012-13 బడ్జెట్లలో సాగునీటి ప్రాజెక్టులకు అతి తక్కువ నిధులు విడుదల చేసింది. నిధుల కొరతకు భూసేకరణ సమస్య తోడవడంతో సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. స్టీలు, సిమెంటు, ఇంధనం వంటి ధరలు పెరగడంతో సా గునీటి ప్రాజెక్టుల వ్యయం అంతకంతకూ పెరిగింది. సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ ప్రాజెక్టును 2007-08లో రూ.399 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా 88,300 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు 23,666 ఎకరాల ఆయకట్టుకు కొత్తగా నీళ్లందించాలని, ఐదు లక్షల మంది దాహార్తి తీర్చాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు భూసేకరణ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. నిధులనూ సర్దుబాటు చేయలేకపోయింది. దీనివల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.437.42 కోట్లకు పెరిగింది. దాంతో ప్రభుత్వ ఖజానాపై రూ.38.42 కోట్ల భారం పడిందని కాగ్ తేల్చిచెప్పింది. రాయలసీమలో 6.02 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలన్న లక్ష్యంతో రూ.6,850 కోట్ల వ్యయంతో హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు పనులకు మార్చి 31, 2013 నాటికి రూ.6188.79 కోట్లను ఖర్చు చేశారు. నిధులను సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగింది. ప్రభుత్వ ఖజానాపై రూ.3,615 కోట్ల భారం పడిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. గాలేరు-నగరి ప్రాజెక్టు కింద కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల పరిధిలో 3.25 లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. 2005లో ఆ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.3,777.94 కోట్లు. మార్చి 31, 2013 నాటికి రూ.4,135.62 కోట్లను ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టుకు కేటాయించిన నిధులను విడుదల చేయకపోవడంతో పనులు సాగ డం లేదు. దీని వల్ల అంచనా వ్యయం పెరిగి.. ప్ర భుత్వ ఖజానాపై రూ.5,143.21 కోట్ల భారం పడింది. తెలుగుగంగ ప్రాజెక్టు కింద చెన్నై నగరానికి తాగునీరు అందించాలని, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 1.40 లక్షల ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. 1983లో ఆ ప్రాజెక్టును చేపట్టినప్పు డు అంచనా వ్యయం రూ.637 కోట్లు. కానీ.. ఆ ప్రాజెక్టుకు నిధులను సక్రమంగా విడుదల చేయకపోవడం వల్ల పనులు సా..గుతూ వస్తున్నాయి. దీ నివల్ల అంచనా వ్యయం రూ.4,432 కోట్లకు పెరి గింది. దాంతో ప్రభుత్వ ఖజానాపై రూ.3,795 కో ట్ల భారం పడినట్లయిందని కాగ్ స్పష్టీకరించింది. ఈ తాగునీటి ప్రాజెక్టుకు సక్రమంగా నిధులు కేటాయించాలని పేర్కొంది. సంక్షేమం కాదు.. సంక్షామమే! రైతులకు 2011 నుంచి రూ.లక్ష వరకూ వడ్డీ లేని రు ణాలు.. రూ.3 లక్షల వరకూ పావలా వడ్డీకే రుణాలు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. సకాలంలో చెల్లించిన రైతులకు మాత్రమే ఈ రాయితీ వర్తింపజేస్తామని మెలిక పెట్టింది. కానీ.. జిల్లాలో సకాలంలో చెల్లించిన రైతులకు రూ.14 కోట్లకు పైగా వడ్డీ రాయితీని చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని కాగ్ ఎత్తిచూపింది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకూ వడ్డీ రాయితీని అందించడంలో ప్రభుత్వం దాటవేత వైఖరి అనుసరిస్తోందని పేర్కొంది. మార్చి 31, 2013 నాటికి మహిళా సంఘాలకు రూ.21 కోట్ల మేర వడ్డీ రాయితీని చెల్లించక పోవడాన్ని ఎత్తిచూపింది. ఇందిరమ్మ గృహనిర్మాణంలోనూ ప్రభుత్వం తీరును తప్పుపట్టింది. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల లబ్ధిదారులు అప్పులపాలవుతున్నారని ఆరోపించింది. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.28 కోట్లు చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తేల్చింది. ముస్లింలు, క్రిస్టియన్ల సంక్షేమానికి కేటాయించిన నిధుల వినియోగంలోనూ ప్రభుత్వం పిసినారితనాన్ని ప్రదర్శించిందని పేర్కొంది. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించడంలోనూ.. ఇందిర జలప్రభ కింద నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలోనూ ప్రభుత్వం కాడిదించడాన్ని కాగ్ ఆక్షేపించింది. తుడా, స్విమ్స్లకు చీవాట్లు తిరుపతి పట్టాణాభివృద్ధి సంస్థ(తుడా), శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(స్విమ్స్)కూ కాగ్ చీవాట్లు పెట్టింది. 2011-12 ఆర్థిక సంవత్సరం నాటికి మాత్రమే తుడా ఆడిటింగ్ పూర్తి చేసింది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ నివేదికను తుడా అందించలేదని కాగ్ పేర్కొంది. తుడా నిర్మించిన వాణిజ్య దుకాణాల సముదాయాలను లీజుకు ఇవ్వకపోవడం వల్ల సంస్థకు భారీ ఎత్తున నష్టం వస్తోందని తేల్చింది. స్విమ్స్‌నూ కాగ్ కడిగేసింది. నిధుల వినియోగంలో స్విమ్స్ ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదంది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిటింగ్‌ను చేయించడంలో స్విమ్స్ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని తప్పుపట్టింది. ఆడిట్ నివేదికను ఇప్పటిదాకా అందించలేదంది. ఎప్పటికప్పుడు ఆడిట్ చేయించి.. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని ఆ సంస్థకు సూచించింది. -
తడి ‘ఆరే’!
సాగుకు ఆరు గంటలే విద్యుత్ ఏడు గంటల సరఫరాకు మంగళం ఏపీసీపీడీసీఎల్ ఉత్తర్వులు జారీ ప్రమాదంలో రబీ సాగు సాక్షి, సంగారెడ్డి: దొంగ చాటు విద్యుత్ కోతలు ఇక అధికారికమయ్యాయి. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్‌ను సరఫరా చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. 9 ఏళ్లుగా అమల్లో ఉన్న ‘వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ సరఫరా’ విధానానికి కిరణ్ సర్కార్ మంగళం పాడింది. ఇకపై వ్యవసాయానికి ఆరు గంటల విద్యుత్ మాత్రమే సరఫరా ఉండనుందని ఏపీసీపీడీసీఎల్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 2 నుంచే కోతల ఉత్తర్వులు అమలులోకి వచ్చాయి. బొగ్గు ఆధారిత(థర్మల్) విద్యుత్పాదన మెరుగయ్యే వరకు ఆరు గంటల సరఫరా మాత్రమ ఉండనుందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ.. అనధికారిక కోతలను అధికారికం చేయడానికే ఈ ఉత్తర్వులను అమల్లోకి తెచ్చినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లోడ్ రిలీఫ్(ఎల్సీ) పేరుతో రోజూ వ్యవసాయానికి ఎడాపెడా కోతలు పెట్టేస్తున్నారు. ఎల్సీ అమలైన ఫీడర్ల పరిధిలో ఒకే విడతగా 3 గంటల విద్యుత్ సరఫరా చేసి చేతులు దులుపుకుంటున్నారు. మిగిలిన ఫీడర్ల పరిధిలో సైతం 5 నుంచి 6 గంటల సరఫరా మాత్రమే ఉంటోంది. రబీ సాగు ఊపందుకున్న తరుణంలో కోతలు తీవ్రం కావడంతో ఇప్పటికే రైతులు రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బోర్లు, బావుల కింద 32 వేల హెక్టార్లలో వరి పంట వేశారు. ఇప్పుడు మొత్తం సరఫరానే 6 గంటలకు పరిమితం చేయడంతో రబీ సాగు ప్రమాదంలో పడింది. జిల్లాలో ఉన్న 618 విద్యుత్ ఫీడర్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపు పరిధిలో పగలు ఓ విడత, రాత్రి మరో విడత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. ఈ కింది వేళల్లో ఆరు గంటల విద్యుత్‌ను సరఫరా చేయాలని ఏపీసీపీడీసీఎల్ నుంచి ఆదేశాలందాయి. రాత్రి వేళల్లో సరఫరా కారణంగా రైతులు ప్రశాంతంగా ఇళ్లలో నిద్రపోయే పరిస్థితి లేకుండా పోయింది. జిల్లాలో జిల్లాలో 8,97,188 విద్యుత్ కనెక్షన్లుండగా అందులో 5,96,148 గృహ, 59,153 వాణిజ్య, 8057 పారిశ్రామిక, 2,20,246 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. ప్రస్తుతం జిల్లాకు రోజూ 15 -17 మిలియన్ యూనిట్ల సరఫరా మాత్రమే ఉంటోంది. పెరిగిన అవసరాల దృష్ట్యా జిల్లా కోటాను రోజూ 22 మి.యూలకు పెంచాలని కోరుతూ రెండు నెలల కింద విద్యుత్ శాఖ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేకుండా పోయింది. భారీ పరిశ్రమలకు నిలయం కావడంతో జిల్లాలో విద్యుత్ అవసరాలు ఎక్కువే. జిల్లాకు సరఫరా చేస్తున్న విద్యుత్‌లో 45 శాతం పారిశ్రామిక, మరో 45 శాతం వ్యవసాయ అవసరాలకు వినియోగిస్తుండగా.. మిగిలిన 10 గృహ అవసరాలకు సరఫరా చేస్తున్నట్లు విద్యుత్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లా అవసరాలకు రోజూ 22 మి.యూ.ల విద్యుత్ అవసరం కాగా పది రోజులుగా జిల్లాకు సరఫరా అయిన విద్యుత్ ఇలా ఉంది.. తేదీ సరఫరా (మి.యూ.లలో) జనవరి 24 17.02 జనవరి 25 17.05 జనవరి 26 16.01 జనవరి 27 16.23 జనవరి 28 16.34 జనవరి 29 16.29 జనవరి 30 16.15 జనవరి 31 16.73 ఫిబ్రవరి 01 16.51 ఫిబ్రవరి 02 15.61 -
..‘అనంత’కు శరాఘాతం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : నాటి చంద్రబాబు సర్కారు పాపం.. నేటి కిరణ్ ప్రభుత్వం నిర్లక్ష్యం హంద్రీ-నీవా సుజల స్రవంతి ఆయకట్టు రైతులకు శరాఘాతంగా మారింది. కృష్ణా నదీ జలాల వివాదంపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ శుక్రవారం ఇచ్చిన తుది తీర్పు హంద్రీ-నీవా ఆయకట్టు రైతుల ఆశలను అడియాసలు చేసింది. కర్ణాటక సర్కారు చేపట్టిన ఆలమట్టి రిజర్వాయర్ నిర్మాణాన్ని అప్పటి చంద్రబాబు సర్కారు అడ్డుకోలేకపోయింది. మన రాష్ట్రంలో కృష్ణా బేసిన్లో ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టడంలోనూ చంద్రబాబు సర్కారు విఫలమైంది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో సమర్థవంతంగా వాదనలు విన్పించడంలో కిరణ్ సర్కారు విఫలమైంది. పర్యవసానంగా హంద్రీ-నీవా భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. 1973లో కృష్ణా నదీ జలాల పంపిణీపై బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఇచ్చింది. కృష్ణానదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,130 టీఎంసీల నికర జలాలు అందుబాటులో ఉంటాయని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ మన రాష్ట్రానికి 811, కర్ణాటకకు 734, మహారాష్ట్రకు 584 టీఎంసీలు కేటాయించింది. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు మిగులు జలాలపై హక్కును కల్పించింది. బచావత్ ట్రిబ్యునల్ గడవు 2001లో పూర్తయింది. కృష్ణా జలాలను మళ్లీ పంపిణీ చేయడం కోసం జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలో ట్రిబ్యునల్‌ను కేంద్రం 2004 ఏప్రిల్ 2న ఏర్పాటు చేసింది. అప్పుడే మేల్కొని ఉంటే..: మిగులు జలాలపై హక్కు రావాలంటే ప్రాజెక్టులను నిర్మించాలి. ఇదే అంశాన్ని 1995 నుంచి 2004 మధ్య సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు నీటిపారుదల రంగ నిపుణులు అనేక సందర్భాల్లో సూచించారు. వాటిని అమలు చేయాల్సిన చంద్రబాబు తద్భిన్నంగా స్పందించారు. ‘కృష్ణా నదిలో నీళ్లే లేవు.. ప్రాజెక్టులు నిర్మించి ఏం చేసుకోవాలి’ అంటూ అనేక సందర్భాల్లో నీటిపారుదలరంగ నిపుణులను చంద్రబాబు అపహాస్యం చేశారు. కానీ.. ఎన్నికలకు ముందు మాత్రం ఓట్ల కోసం చంద్రబాబుకు ప్రాజెక్టులు గుర్తుకొచ్చేవి. రైతులు గుర్తుకొచ్చేవారు. కానీ.. ఆ తర్వాత వాటిని మరచిపోయేవారు. ఇందుకు ప్రత్యక్ష తార్కాణం.. మన జిల్లాలో చేపట్టిన హంద్రీ-నీవా పనులే. 1996 మధ్యంతర లోక్‌సభ ఎన్నికలకు ముందు ఐదు టీఎంసీల సామర్థ్యంతో కేవలం తాగునీటి కోసం హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం కోసం ఉరవకొండలో పునాదిరాయి వేశారు. కానీ.. తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ఇంతలోనే 1999 సాధారణ ఎన్నికలు రానే వచ్చాయి. ఈసారి 30 టీఎంసీల సామర్థ్యంతో హంద్రీ-నీవాకు ఆత్మకూరు వద్ద శంకుస్థాపన చేశారు. రెండు మూడు మీటర్ల మేర కాలువ తవ్వి.. ఆ తర్వాత ఆ పనులను గాలికొదిలేశారు. హంద్రీ-నీవాను చంద్రబాబు ఆనాడే పూర్తిచేసి ఉంటే.. ఈ రోజున బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఆ ప్రాజెక్టుకు నికర జలాలు కేటాయించి ఉండేదని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. ఇది దుర్భిక్ష ‘అనంత’ను సుభిక్షం చేసేదని చెబుతున్నారు. చంద్రబాబు నిర్లక్ష్యం ఫలితంగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ జిల్లా రైతులకు గొడ్డలిపెట్టు వంటి తీర్పును వెలువరించింది. కృష్ణా నదిలో 65 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,293 టీఎంసీల జలాలు లభిస్తాయని అంచనా వేసిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మన రాష్ట్రానికి 1005, కర్ణాటకకు 911, మహారాష్ట్రకు 666 టీఎంసీలు కేటాయించింది. ఆలమట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచుకునే అధికారాన్ని కర్ణాటకకు కట్టబెట్టింది. ఇది హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ఆయకట్టు రైతులకు అశనిపాతంగా మారింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2010 డిసెంబర్ 31న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పుడే కిరణ్ సర్కారు మేల్కొని ఉంటే.. ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదనే అభిప్రాయం నిపుణుల్లో బలంగా వ్యక్తమవుతోంది. ఇప్పుడెలా..? దుర్భిక్ష రాయలసీమ జిల్లాలను సుభిక్షం చేయాలన్న లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. రూ.6,8850 కోట్లతో అంచనా వ్యయంతో శ్రీశైలం జలాశయం నుంచి 40 టీఎంసీలను ఎత్తిపోసి రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. ఇందులో మన జిల్లా పరిధిలోనే 3.45 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా పథకాన్ని రూపొందించారు. హంద్రీ-నీవాకు కేటాయించిన 40 టీఎంసీలను శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద వచ్చే 120 రోజుల్లో రోజుకు మూడున్నర వేల క్యూసెక్కులకు తగ్గకుండా నీటిని ఎత్తిపోసుకోవచ్చునని పేర్కొన్నారు. కృష్ణా జలాల పంపిణీ వివాదం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారిస్తోన్న నేపథ్యంలో.. హంద్రీ-నీవాకు మిగులు జలాలు కేటాయించారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చిన తర్వాత రాష్ట్రానికి కేటాయించిన నికర జలాల మంజూరులో హంద్రీ-నీవాకు తొలి ప్రాధాన్యం ఇస్తామని అప్పట్లో వైఎస్ హామీ ఇచ్చారు. హంద్రీ-నీవా పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు వైఎస్ భారీ ఎత్తున నిధులు కేటాయించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పనులపై రూ.4,700 కోట్లకుపైగా ఖర్చు చేశారు. గతేడాది నవంబర్ 18న శ్రీశైలం నుంచి హంద్రీ-నీవా కాలువల్లోకి ట్రయల్ రన్ ద్వారా నీటిని ఎత్తిపోశారు. ఈ ఏడాది ఇప్పటిదాకా 4.5 టీఎంసీలను హంద్రీ-నీవా కాలువల్లోకి ఎత్తిపోస్తే.. మన జిల్లా పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్‌కు 1.5 టీఎంసీలు చేరాయి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలను కూడా మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసిన నేపథ్యంలో.. మన రాష్ట్రానికి అదనంగా కేటాయించిన 200 టీఎంసీల నికర జలాల్లో హంద్రీ-నీవా వాటా ఎంత అన్నది తేల్చాల్సి ఉంది. ఇకపోతే ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచితే.. ఆ డ్యామ్ నిండి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండిన తర్వాతనే శ్రీశైలం రిజర్వాయర్‌లోకి కృష్ణా జలాలు వస్తాయి. ప్రస్తుతం ఆగస్టు మొదటి వారం నాటికే శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం 854 అడుగులకు చేరుతోంది. కానీ.. ఆలమట్టి ఎత్తు పెంచితే.. సెప్టెంబరు మొదటి వారానికి గానీ శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగులకు నీళ్లు చేరవు. 854 అడుగులకు నీళ్లు చేరితేగానీ హంద్రీ-నీవా కాలువల్లోకి నీటిని ఎత్తిపోయలేని దుస్థితి నెలకొంటుంది. దీన్ని బట్టి చూస్తే హంద్రీ-నీవా ఆయకట్టు రైతులకు కష్టాలు తప్పవన్నది విశదమవుతోంది. -
చంద్రబాబు-2 పాలన అందిస్తున్న కిరణ్
హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంచడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. సామాన్యుడిపై భారం మోపేలా చార్జీలు పెంచడం దారుణమని పేర్కొంది. ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కిరణ్ సర్కార్‌కు అంతిమ ఘడియలు సమీపించాయని వైఎస్సార్ సీపీ నాయకుడు జనక్ ప్రసాద్ ధ్వజమెత్తారు. కిరణ్ హయాంలో నాలుగు సార్లు ఛార్జీలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారని తెలిపారు. రోశయ్య హయాంలో ఒకసారి వడ్డించారని ఆయన వెల్లడించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్టీసీ ఛార్జీలు, పన్నులు పెంచకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశారని గుర్తు చేశారు. చంద్రబాబు అడుగుజాడల్లో కిరణ్ నడుస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు-2 పాలనను ప్రజలకు కిరణ్ కుమార్ రెడ్డి అందిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని జనక్ ప్రసాద్ అన్నారు. -
కిరణ్ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
-
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిన నేపథ్యంలో కిరణ్ సర్కార్‌ను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి మాజీ ఎమ్మెల్సీ కే. దిలీప్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు బుధవారం ప్రణబ్‌కు లేఖ రాశారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో సమైక్య ఉద్యమాన్ని కిరణ్ ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆ లేఖలో ఆరోపించారు. ఓ విధంగా చెప్పాలంటే సీఎం కిరణ్ సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఏపీఎన్జీవోల సమ్మెను సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టే తప్పు పట్టినప్పటికీ వారు సభను హైదరాబాద్‌లో జరుపుకునేందుకు అనుమతి ఇవ్వడం సీఎం పక్షపాత ధోరణికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రాజ్యధర్మాన్ని విస్మరిస్తున్న సీఎం కిరణ్‌కు ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కులేదని దిలీప్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. -
మొద్దుబారిన ప్రభుత్వం
ఓ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు కోట్ల మంది ప్రజల ఆకాంక్షకు మద్దతుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వంలో చలనంలేదు. రాష్ట్రాన్ని విభజించడం అనివార్యం అయితే ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్టన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి చంచల్‌గూడ జైలులోనే ఆమరణదీక్ష చేపట్టి ఏడురోజులైనా ప్రభుత్వంలో కదలికలేదు. ఆయన దీక్షకు సీమాంధ్రలోని అన్ని వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నా ప్రభుత్వం మాత్రం మొద్దుబారిపోయింది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వానికి తోడుపోయారు. ఆయన కూడా నోరు మెదపడంలేదు. జగన్ ఈ నెల 25న నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. అయిదు రోజులకు ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. నిరాహార దీక్ష విరమించమని జైలు అధికారులు, వైద్యులు చెప్పినా ఆయన వినలేదు. ఆయన బాగా నీరసించిపోవడం, ఆరోగ్యం ఆందోళనకర పరిస్థితులకు చేరడంతో అయిదవ రోజు గురువారం అర్ధరాత్రి ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆయన పల్స్ రేటు పడిపోయింది. సుగర్ లెవల్స్ పడిపోయాయి. ఆయన దీక్ష విరమించకపోతే శరీరంలోని అవయవాలపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరించారు. తాను అనుకున్న లక్ష్యం నెరవేరేవరకు దీక్ష విరమించేదిలేదని జగన్ స్పష్టం చేశారు. ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, సమైక్యాంధ్రవాదులు అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వం నుంచి స్పందనలేదు. ఒక్క ప్రభుత్వ ప్రతినిధి కూడా ఆస్పత్రివైపు కన్నెత్తి చూడలేదు. జగన్ ఆరోగ్యం గంటగంటకు క్షీణిస్తోంది. దాంతో వైద్యులలో ఆందోళన ఎక్కువవుతోంది. ఆయన ఆరోగ్యంపై వైద్యుల బృందం రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించింది. చివరకు జగన్‌ను వేరే ఆస్పత్రికి తరలించాలని కోరుతూ జైళ్ల శాఖ అధికారులకు ఉస్మానియా సూపరింటెండెంట్ శుక్రవారం సాయంత్రం ఒక లేఖ రాశారు. ‘‘ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఒంట్లో కీటోన్స్ బాగా పెరిగాయి. దీనివల్ల కిడ్నీ సమస్యలు వచ్చే ఆస్కారముంది. ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి జగన్మోహన్రెడ్డి నిరాకరిస్తున్నారు’’ అని వివరించారు. ఆయనను నిమ్స్‌కు పంపాల్సిందిగా ఉస్మానియా సూపరింటెండెంట్ జైళ్ల శాఖ అధికారులకు సూచించారు. ‘‘ప్రాణం కంటే ముఖ్యమైనదేదీ లేదని వైద్యులు జగన్‌కు చెప్పాను. ఇక ఆలస్యం చేయకుండా ఆహారం తీసుకోవాలని సూచించాను. కానీ జగన్ సున్నితంగా తిరస్కరించారు. దీక్ష కొనసాగిస్తాను'' చెప్పారు. శారీరకంగా పూర్తిగా నీరసించిన స్థితిలో ఉండి కూడా జగన్ తమతో ఓపికగా, చిరునవ్వుతో మాట్లాడటం పట్ల వైద్యులు విస్మయం వ్యక్తం చేశారు. జగన్‌లోని సంకల్ప శక్తి తమను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయనకు పరీక్షలు చేస్తున్న ఒక వైద్యుడు ‘సాక్షి’తో అన్నారు. ‘‘నేనొక లక్ష్యం కోసం దీక్ష చేస్తున్నాను. అది నెరవేరే వరకూ దీక్ష విరమించబోను. రాష్ట్ర ప్రయోజనాల కంటే నా ప్రాణం విలువైనదేమీ కాదు. రాజకీయ దురుద్దేశాలతో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించకపోతే, పట్టించుకోకపోతే ఎలా? అన్ని ప్రాంతాలకూ న్యాయం చేయడం సాధ్యం కాదనుకుంటే ఈ రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలి. అడ్డగోలుగా తీసుకున్న విభజన నిర్ణయం వల్ల కృష్ణా ఆయకట్టు పూర్తిగా ఎడారిగా మారే ప్రమాదంలో పడింది. అదే జరిగితే... కృష్ణా బేసిన్ ఇటు తెలంగాణలోనూ, అటు సీమాంధ్రలోనూ ఉన్నందున రెండు ప్రాంతాల ప్రజలూ తీవ్ర ఇక్కట్ల పాలవుతారు. కృష్ణా డెల్టా ఎడారవడమే గాక కొత్త అంతర్రాష్ట్ర వివాదాలు తలెత్తుతాయి. అటు రాయలసీమలో, ఇటు తెలంగాణలోనూ మిగులు జలాలపై ఆధారపడ్డ ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు కూడా వట్టిపోతాయి. అవన్నీ మొండిగోడలుగా మిగులుతాయి. అందుకే నేను దీక్ష చేయాల్సి వస్తోంది. అనాలోచితంగా రాష్ట్రాన్ని విడదీసి ఇలాంటి పెను సమస్యలు సృష్టించే బదులు సమైక్యంగానే కొనసాగించడమే అందరికీ శ్రేయస్కరం. ప్రజల కోసం మనం చేసే పనుల రాష్ట్రానికి ప్రయోజనం కలిగి, తద్వారా ఓట్లయినా, అధికారమయినా రావాలి. అంతే తప్పితే కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసమే పనులు చేయడం నైతిక రాజకీయం కాజాలదు.చంద్రబాబు నాయుడు ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా ఏమాత్రం ఆలోచించినా ఈ దుస్థితి వచ్చేది కాదు. ఇంతటి కీలక తరుణంలో ఎవరూ గట్టిగా నిలదీయకపోతే ఎలా? పార్టీలన్నీ చిత్తశుద్దితో వ్యవహరించాల్సిన అవ సరముంది. ఇన్ని రోజులుగా నేను చేస్తున్న దీక్ష వల్ల ఏ కొద్దిగానైనా రాష్ట్ర హితం కోసం ఆలోచిస్తారని, ప్రజలకు కొంతయినా మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను’’ అని ఉస్మానియా వైద్యులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. పరిస్థితి విషమిస్తుండటంతో శుక్రవారం సాయంత్రం బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు వైద్యులు ప్రయత్నించగా జగన్ అంగీకరించలేదు. ‘‘నాలో దీక్ష చేసే శక్తి ఇంకా ఉంది. మీరు అర్ధరాత్రి వేళ నా గదిలోకి వచ్చినా మీలో ప్రతి ఒక్కరినీ గుర్తు పట్టగల స్థితిలో ఉన్నాను. గతంలో ఏడు రోజులు దీక్ష చేశాను. దయచేసి నా దీక్షను మీరు బలవంతంగా నిలిపివేయవద్దు. మీరు చేసే వైద్య పరీక్షలకు నేను పూర్తిస్థాయిలో సహకరిస్తాను. కానీ మంచినీళ్లు మినహా ఏ రకమైన ద్రవహారాన్నీ తీసుకోను. మీరు కూడా బలవంతంగా నాకు ఆహారం ఇచ్చేందుకు ప్రయత్నించకండి. వైద్యులుగా మీరు చేస్తున్న సేవలకు నా కృతజ్ఞతలు...’’ అని వారితో అన్నారు. చివరకు చేసేదిలేక ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సూచన మేరకు శుక్రవారం రాత్రి 11.40 ప్రాంతంలో జగన్‌ను పోలీసులు నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిమ్స్‌లో కూడా జగన్ దీక్ష కొనసాగించారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి గానీ, ప్రధాన ప్రతిపక్షం నుంచి గానీ స్పందనలేదు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కనీసం మానవత్వం కూడా లేదని తేలిపోయింది. ఒక ప్రజా నేత రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన సమస్యపై ఏడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటే వారు నోరు మెదపకపోవడం ఎంద దారుణం! ఇది రాజకీయంగా ఆలోచించే సమయమా? జగన్ శారీరకంగా బలహీనపడిపోయి, ఆరోగ్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో వైద్యలు ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి ప్రయత్నించినా ఆయన ససేమిరా అన్నారు. ఆయన పట్టుదలతో తెలుగు ప్రజల కోసం దీక్ష కొనసాగించాలనే నిర్ణయించుకున్నారు. జగన్ ఆరోగ్య పరిస్థితి చాలా ప్రమాదకరంగా వుందని, ఫ్లూయిడ్స్ ఎక్కించకపోతే ప్రాణానికే ప్రమాదమని నిమ్స్ వైద్యుల బృందం ఇచ్చిన సమాచారానికి చంచల్‌గూడ జైలు అధికారులు స్పందించారు. సెక్షన్ 593 నిబంధన ప్రకారం బలవంతంగానైనా ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు నిమ్స్ డాక్టర్లకు అనుమతి ఇచ్చారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన దశలో 151 గంటలుగా చేస్తున్న జగన్ నిరాహర దీక్షను వైద్యులు బలవంతంగా భగ్నం చేశారు. డాక్టర్లు బలవంతంగా జగన్‌కు ఫ్లూయిడ్స్ ఎక్కించారు. అయితే జగన్ పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని రోజులపాటు చికిత్స అవసరమని డాక్టర్లు చెప్పారు. -
విజయమ్మ దీక్ష భగ్నానికి కుట్ర: వాసిరెడ్డి పద్మ
-
విజయమ్మ దీక్ష భగ్నానికి కుట్ర: వాసిరెడ్డి పద్మ
సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రేపటి నుంచి చేపట్టిన సమరభేరీ దీక్షను భగ్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆదివారం ఆరోపించారు. హైదరాబాద్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...అవనిగడ్డ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ పోటీ చేయడం లేదు, అయితే పోటీలో లేని పార్టీకి ఎన్నికల కోడ్ ఏలా వర్తింస్తుందో చెప్పాలి అని అన్నారు. ఏదో కారణం చెప్పి ప్రభుత్వం విజయవాడలో వైఎస్ విజయమ్మ దీక్షకు అనుమతి నిరాకరించిందని ఆమె ఆగ్రహాం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర కోసం చేస్తున్న ఉద్యమంలో రాష్ట్రంలోని అన్ని పార్టీల కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉందన్నారు. సీడబ్ల్యూసీ భేటీకి కంటే ముందే తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతిని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రాజకీయా డ్రామాలు ఆడుతున్నారన్ని ఆమె పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజలను ఎన్ని రోజలు మోసం చేస్తారని ఆమె ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. అయితే ఆ పార్టీ నేతలను ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆమె జోస్యం చేప్పారు. కాగా ఆంటోని కమిటీకి వైఎస్ఆర్ సీపీ చెప్పాల్సిందేమీ లేదని ఆమె స్ఫష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రకటన చేసినప్పుడు మిన్నకుండ ఉన్న నేతలు ఇప్పుడు మాట్లాడటం ఏమిటని వాసిరెడ్డి పద్మ ఈ సందర్బంగా చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. చంద్రబాబు కేంద్రంలో చక్రం కాదు కదా, బొంగరం కూడా తిప్పలేరని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు.