ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిన నేపథ్యంలో కిరణ్ సర్కార్ను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని భారత రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీకి మాజీ ఎమ్మెల్సీ కే. దిలీప్కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు బుధవారం ప్రణబ్కు లేఖ రాశారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో సమైక్య ఉద్యమాన్ని కిరణ్ ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆ లేఖలో ఆరోపించారు.
ఓ విధంగా చెప్పాలంటే సీఎం కిరణ్ సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఏపీఎన్జీవోల సమ్మెను సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టే తప్పు పట్టినప్పటికీ వారు సభను హైదరాబాద్లో జరుపుకునేందుకు అనుమతి ఇవ్వడం సీఎం పక్షపాత ధోరణికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రాజ్యధర్మాన్ని విస్మరిస్తున్న సీఎం కిరణ్కు ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కులేదని దిలీప్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.