రాష్ట్ర చేపగా కొరమీను | Koramanu fish diclared as Telangana state fish | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 21 2016 9:28 AM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

‘కొరమీను’ను రాష్ట్ర చేపగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అధికారిక చేపగా కొరమీనుకు గుర్తింపునిచ్చింది. దీన్నే మరేల్ లేదా మురేల్ ఫిష్‌గా పిలుస్తారు. మత్స్యశాఖ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం కొరమీనును అధికారిక చేపగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొరమీను శాస్త్రీయ నామం చన్నా స్ట్రయేటస్. ప్రతి రాష్ట్రానికి ఆ రాష్ట్ర చేపగా ఒక రకాన్ని గుర్తిస్తారు.

Advertisement
 
Advertisement
 
Advertisement