ల్యాండ్ బ్యాంకు’ పచ్చని గ్రామాల్లో చిచ్చు రేపుతోంది. భూసమీకరణ సభలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. పారిశ్రామిక అవసరాల సాకుతో జిల్లాకు లక్ష ఎకరాల చొప్పున మొత్తం 13 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకు కోసం రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న ఎత్తులపై రైతులు మండిపడుతున్నారు. రోడ్డెక్కి పోరాటాలు చేస్తున్నారు... న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. కర్నూలు, విజయనగరం, కృష్ణా, చిత్తూరు, తూర్పుగోదా వరితోపాటు పలుచోట్ల జరుగుతున్న ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసు కేసుల అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. పోలీసు పికెట్లతో భయానక వాతావరణం సృష్టిస్తున్నా రైతులు వెనక్కు తగ్గడం లేదు. ప్రాణప్రదంగా చూసుకునే తమ భూముల్లోకి అడుగుపెడితే తరిమి కొడతామని అధికారులను హెచ్చరిస్తున్నారు.
Published Thu, Sep 29 2016 6:44 AM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM
Advertisement
Advertisement
Advertisement