లోక్సభ ప్రసారాలను నిలిపివేసి, సభ్యుల ఆందోళన, నిరసన, గందరగోళం మధ్య అత్యంత ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను లోక్సభ ఆమోదించినట్లు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు. పార్లమెంటు మెయిన్ గేటు మూత - పెద్ద సంఖ్యలో మార్షల్స్ సభలోకి ప్రవేశం-లోక్సభ గ్యాలరీలు, ద్వారాలు మూసివేసి.... అత్యంత దారుణంగా, అప్రజాస్వామికంగా బిల్లు ఆమోదం తతంగాన్ని ముగించాం అనిపించారు. కీలకమైన బిల్లు ఆమోదించే విషయంలో అధికార కాంగ్రెస్కు, ప్రధాన ప్రతిపక్షం బిజెపి సహకరించిన తీరు బాధాకరం. రెండు పక్షాలు కుమ్మక్కై తెలుగు ప్రజలకు ద్రోహం చేశారని విమర్శలు వెల్లువెత్తాయి.