అంతర్జాతీయ క్రికెట్లో ఓ శకం ముగియనుంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్మన్ మాజీ కాబోతున్నాడు. క్రికెట్ దేవుడి చిరస్మరణీయ క్లాస్ ఇన్నింగ్స్లు ఇక చరిత్రగా మిగలనున్నాయి. రెండు దశాబ్దాలకుపైగా అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసిన బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగనున్నాడు. ఇప్పటికే టి-20, వన్డేలకు వీడ్కోలు పలికిన మాస్టర్.. తన చరిత్రాత్మక 200వ టెస్టు అనంతరం ఈ ఫార్మాట్ నుంచీ వైదొలగనున్నాడు. వెస్టిండీస్తో స్వదేశంలో త్వరలో జరిగే సిరీసే అతనికి చివరిది. కోట్లాది అభిమానుల కూడా. 200వ టెస్డు ఆడిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగనున్నట్టు ముంబైకర్ స్వయంగా గురువారం ప్రకటించాడు. దీంతో రెండేళ్లుగా తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు సచిన్ తెరదించాడు. తన కెరీర్ను పూర్తిగా ఆస్వాదించానని సంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు అండగా నిలిచిన అభిమానులకు, సన్నిహితులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ మేరకు బీసీసీఐ లేఖ రాశాడు. 1989లో పాకిస్థాన్తో సిరీస్లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మాస్టర్ లెక్కకుమిక్కిలి రికార్డులు కొల్లగొట్టాడు. వంద సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. వన్డేలు, టెస్టులు అత్యధిక పరుగులు.. ఇలా ఎందరో దిగ్గజాలకు సాధ్యంకాని రికార్డుల్ని సాధించాడు. మైదానంలోనే గాక నిజజీవితంలోనూ హుందాగా ఉండే 40 ఏళ్ల మాస్టర్ 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నాడు.
Published Thu, Oct 10 2013 5:10 PM | Last Updated on Thu, Mar 21 2024 8:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement