మన టీవీ ద్వారా గ్రూప్ - 2 శిక్షణా తరగతులు అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రసారం అవుతాయని తెలంగాణ ఐటీ, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మన టీవీ ద్వారా రోజుకు 4 గంటలు గ్రూప్ - 2 శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. త్వరలోనే సివిల్స్తోపాటు ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామన్నారు. బుధవారం హైదరాబాద్లో గ్రూప్ - 2 కోచింగ్ మనటీవీ ద్వారా ప్రసారం చేసేందుకు ఇస్రోతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది