దమ్ముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని ప్రజాకోర్టులో ఎదుర్కోమని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్కు బెయిలు వస్తుందంటే చంద్రబాబుకు గుండెపగిలినంత పని అవుతోందన్నారు. జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు తన పార్టీ ఎంపీలను ఢిల్లీ పంపి వ్యవస్థలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగన్ కేసును నిర్భయ కేసుతో పోల్చి బాబు రాక్షాసానందం పోందుతున్నారని మండిపడ్డారు. తనకు అధికారం కావాలి, జగన్‌కు బెయిల్ రాకూడదు అదే ఆయన ధేయం అన్నారు. జగన్కు బెయిల్ వస్తే కుప్పంలో కూడా ఓడిపోతాననే భయం బాబును వెంటాడుతోందన్నారు. సామాజిక అత్యాచారం చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. తెలంగాణకు సంబంధించి కేంద్రానికి బ్లాంక్ చెక్కు వంటి లేఖ ఇవ్వడం ద్వారా ఆయన ఈ రాష్ట్రాన్ని చీల్చేందకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు వ్యవహార శైలి చూసి సభ్య సమాజం తలదించుకుంటున్నదన్నారు.
Published Tue, Sep 17 2013 2:59 PM | Last Updated on Wed, Mar 20 2024 1:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement