రాహుల్ గాంధీ పెళ్లి ఎప్పుడు? అన్న ప్రశ్న విపక్ష పార్టీలకు ఓ వ్యంగ్యాస్త్రమైనప్పటికీ.. ఆయన మాత్రం వివాహం విషయంలో తొందరపడనంటున్నారు. ‘నాకు తగిన జోడీ దొరికితేనే మూడు ముళ్లూ వేస్తా’నంటున్నారు. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు అని ఇంటర్వ్యూలో ఆయన్ను ప్రశ్నిస్తే.. ‘‘ఈ ప్రశ్న ఎప్పుడూ ఎవరో ఒకరు అడుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం నేను ఎన్నికల రణంలో బిజీగా ఉన్నాను. దురదష్టవశాత్తూ, వ్యక్తిగత జీవితంపై ఇంతవరకు దష్టి పెట్టలేదు’’ అని చెప్పారు. తగిన అమ్మాయి తనకు దొరికినప్పుడు పెళ్లాడతానని తెలిపారు. తర్వాత తన అభిరుచులపై స్పందించిన రాహుల్.. ఎక్కువగా కాల్పనికేతర పుస్తకాలు చదువుతాను. అందులోనూ తన పనికి సంబంధించి అంటే.. చరిత్ర, భౌగోళికశాస్త్ర, రాజకీయ వ్యవహారాలు.. ఇంకా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, చైనాల గురించి చదువుతానని తెలిపారు.తనకి అభిమాన సినీ నటులు ఎవరూ లేరని రాహుల్ స్పష్టం చేశారు.
Published Sun, Mar 16 2014 9:06 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM
Advertisement
Advertisement
Advertisement