కృష్ణా జిల్లా పరిధిలో బందరు పోర్టు ఏర్పాటు పేరుతో ప్రభుత్వం బలవంతంగా చేపట్టిన భూసమీకరణ చర్యలకు వ్యతిరేకంగా బాధితుల పోరాటానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు ప్రకటించారు. ఈ పోర్టు కోసం ప్రభుత్వం 30 వేల ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా సేకరిస్తోంది. ఈ చర్యలతో పేద రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో బాధితుల ఆందోళనకు అండగా నిలిచేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ డిసెంబర్ 1న బాధిత గ్రామాల్లో పర్యటించనున్నారు. పోర్టు పరిసర గ్రామాలకు జగన్ వెళ్లి బాధితుల సమస్యలు తెలుసుకుంటారు.
Published Fri, Nov 25 2016 7:46 AM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement