ప్రైవేట్ వాహనాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? | ys-jagan-mohan-reddy-supports-rtc-strike | Sakshi
Sakshi News home page

Published Sun, May 10 2015 11:09 AM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

తమ డిమాండ్లను పరిష్కారించాలని కోరుతూ సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కార్మిక సంఘాలతో తక్షణం చర్చలు జరిపి ఆర్టీసీ సమ్మెను విరమింపచేసే విధంగా చూడాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు వాహనాల కారణంగా ఆర్టీసీకి ఏటా రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోందన్న విషయం బాబుకు తెలుసని.. మరి అటువంటప్పుడు ప్రైవేట్ వాహనాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం చంద్రబాబు ఉందన్నారు. ఈ మేరకు శనివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు వైఎస్ జగన్ బహిరంగ లేఖ రాశారు. ఆర్టీసీ కార్మికులపై కక్ష సాధింప చర్యలతో పాటు, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం తగదని సూచించారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement