శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యాంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు ధర్నా చేపట్టేందుకు తెలుగు తల్లి విగ్రహం నుంచి ర్యాలీగా అసెంబ్లీకి బయల్దేరారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ వారిని పోలీసులు మధ్యలోనే అడ్డుకుని అరెస్ట్ చేశారు. అయితే శాంతియుతంగా నిరసన తెలియచేసేందుకు వెళుతున్న తమను బలవంతంగా అరెస్ట్ చేయటం అప్రజాస్వామ్యమన్నారు. అరెస్ట్ చేసినవారిని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
Published Fri, Sep 20 2013 11:08 AM | Last Updated on Thu, Mar 21 2024 5:15 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement