పార్టీ విప్‌ పదవిని నిరాకరించిన కేశినేని నాని | BIg Shock TO TDP, Kesineni Nani To Join BJP | Sakshi
Sakshi News home page

పార్టీ విప్‌ పదవిని నిరాకరించిన కేశినేని నాని

Published Wed, Jun 5 2019 11:01 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

తెలుగుదేశం పార్టీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని షాక్‌ ఇచ్చారు. పార్లమెంటరీ విప్‌ పదవిని ఆయన తిరస్కరిస్తూ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో చేసిన పోస్ట్‌ ఆ పార్టీలో కలకలం రేపుతోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిన్న టీడీపీ ముఖ్యనేతలతో సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లోక్‌సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్, పార్టీ విప్‌గా విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా సీఎం రమేష్‌ను నియమించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే 24 గంటలు కూడా గడవకముందే ఆ పదవిని తాను తీసుకోనంటూ కేశినేని నాని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టడం గమనార్హం.

Advertisement
 
Advertisement
 
Advertisement