హన్మకొండలో దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మంటలు ఎగసిపడటంతో బీజేపీ నాయకురాలి చేతులు అంటుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. తొమ్మిది నెలల పసిపాపపై అత్యాచారం.. ఆపై హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మా ఆందోళన చేపట్టారు.