మద్యం మత్తులో మంగళవారం అర్థరాత్రి బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు. పీకలదాకా మద్యం సేవించిన ఆకతాయిలు అడ్డొచ్చినవారిపై దాడికి తెగబడ్డారు. బుడమేరు వంతెన వద్ద ఆటో డ్రైవర్‌పై దాడికి యత్నించగా ఆటో డ్రైవర్ తప్పించుకుని పరారయ్యాడు.
అనంతరం స్థానికులను పిలుచుకువచ్చి బ్లేడ్ బ్యాచ్‌లో ఒక యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. స్థానికులు పెద్దసంఖ్యలో రావడంతో బ్లేడ్ బ్యాచ్ సభ్యులు తలోదిక్కు పారిపోయారు. ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు.