డల్లాస్‌లో వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు | Dallas, Ys Jagan Birthday Celebrations | Sakshi
Sakshi News home page

డల్లాస్‌లో వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు

Published Thu, Dec 20 2018 5:57 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలు ఎన్‌ఆర్‌ఐ వైఎస్సార్‌సీ విభాగం ఆధ్యర్యంలో డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. డల్లాస్‌లోని ప్రవాసాంధ్రులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఏపీలో వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనంటూ జై జగన్‌ నినాదాలతో హోరెత్తించారు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి అండగా నిలిస్తామని ఎన్‌ఆర్‌ఐలు తెలిపారు. తెలంగాణలో వచ్చిన ఫలితాలే ఏపీలో రానున్న ఎన్నికల్లో పునావృతమవుతాయని, టీడీపీ ఓటమి ఖాయమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా రావాలంటే వైఎస్‌ జగన్‌ సీఎం కావాలన్నారు. నాలుగున్నర ఏళ్లుగా వైఎస్‌ జగన్‌ ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారని, ప్రతి ఒక్క ఎన్‌ఆర్‌ఐ రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement