Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Sakshi Ground Report on First Day Survey: Telangana1
సమగ్ర సర్వే: మా అప్పులు తీరుస్తారా? మీకెందుకు చెప్పాలి?

‘‘మా ఆస్తుల వివరాలు, వార్షికాదాయం లెక్కలు ఎందుకు? స్థిర, చరాస్తులు, బ్యాంకు ఖాతా వివరాలతో ఏం చేస్తారు? ధరణి పాస్‌బుక్‌ నంబర్‌ ఎందుకు చెప్పాలి? మేం ఎక్కడ రుణం తీసుకుంటే, ఎందుకోసం తీసుకుంటే ప్రభుత్వానికి ఎందుకు? వీటితో మాకొచ్చే ప్రయోజనం ఏంటి? రైతుబంధు రానప్పుడు భూముల వివరాలు ఎందుకు అడుగుతున్నారు? ఇల్లు ఎన్ని గజాల్లో ఉంటే ఏం చేస్తారు?.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం వెళ్తున్న ఎన్యూమరేటర్లకు ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలివి. అసలు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారో, ఏ వివరాలు చెబితే ఏ పథకాలకు కోతపెడతారో, రేషన్‌కార్డు ఏమైనా రద్దు చేస్తారోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వివరాలు, ఉద్యోగం, వ్యాపారం వంటి వివరాలు చెప్పడానికి ముందుకురాని పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో చేపట్టిన పరిశీలనలో వెల్లడైన అంశాలివీ..సాక్షి, హైదరాబాద్‌/సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో వివరాల సేకరణ గందరగోళంగా మారింది. పేర్లు, కులం, వృత్తి వంటి కొన్ని సాధారణ వివరాలను వెల్లడిస్తున్న జనం.. ఆర్థికపర అంశాలను వెల్లడించేందుకు ఇష్టపడటం లేదు. ప్రజల నుంచి సరైన సమాధానాలు రాకపోవడం, కొన్ని అంశాల్లో సందేహాలు వ్యక్తం చేస్తూ ఎదురు ప్రశ్నలు వేస్తుండటం, వారికి సర్దిచెప్పాల్సి రావడంతో సర్వేలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఎన్యుమరేటర్లు వాపోతున్నారు.మరోవైపు పేద వర్గాల నుంచి మాత్రం సర్వేకు మంచి స్పందన కనిపిస్తోంది. రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు కావాలంటూ పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రక్రియలో భాగంగా... ఈ నెల 6వ తేదీ నుంచి ఇళ్లను గుర్తించి స్టిక్కర్లు వేసిన సంగతి తెలిసిందే. శనివారం నుంచి ఎన్యూమరేటర్లు ఆ ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలను సేకరించి, సర్వే ఫారాల్లో నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించారు. కాలమ్‌ నంబర్‌ 19 నుంచి తిప్పలు! రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలు (56 ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు) ఉన్నాయి. సర్వే బుక్‌లెట్‌ రెండు భాగాలుగా ఉంది. మొదటి విభాగం (పార్ట్‌–1)లో కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. ఇందులో విద్య, ఉద్యోగ, ఉపాధి, భూమి, రిజర్వేషన్లు, రాజకీయాలు, వలసలకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. సాధారణ వివరాలను వెల్లడించేందుకు ప్రజలు సిద్ధంగానే ఉన్నా.. కాలమ్‌ నంబర్‌ 19 నుంచి వస్తున్న పలు ప్రశ్నలు ఆందోళన రేపుతున్నాయి.ప్రధానంగా వ్యాపారం వార్షిక టర్నోవర్, వార్షికాదాయం, ఆదాయ పన్ను చెల్లింపులు, బ్యాంకు ఖాతా సమాచారం, భూములు, ధరణి పాసు పుస్తకం వివరాలు, భూమి కొనుగోలు కోసం వనరులకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించేందుకు చాలా మంది విముఖత చూపుతున్నారు. అదేవిధంగా రిజర్వేషన్‌ ఫలాలు, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వివరాలను అడిగినప్పుడు.. ఆ వివరాలు ఎందుకని ఎదురు ప్రశ్నలు ఎన్యూమరేటర్లకు ఎదురవుతున్నాయి. ‘ఆర్థిక స్థితిగతుల’పై ఆందోళన సర్వే ప్రశ్నావళి రెండో విభాగం (పార్ట్‌–2)లో కుటుంబ ఆర్థిక స్థితిగతులపై ప్రశ్నలు అడిగినప్పుడు ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. వాటికి సరైన సమాధానం రావడం లేదని ఎన్యూమరేటర్లు చెప్తు న్నారు. రుణాలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశు సంపద, స్థిరాస్తి, వాహనాలు, రేషన్‌కార్డు, నివాస గృహానికి సంబంధించిన సమాచారాన్ని చెప్పేందుకు ఇష్టపడటం లేదని అంటున్నారు. బ్యాంకు రుణాలు, అప్పులు, ఆస్తులకు సంబంధించిన ప్ర శ్నలు అడుగుతున్నప్పుడు ప్రజల నుంచి ఎదురు ప్రశ్నలు వస్తున్నాయని వివరిస్తున్నారు. ‘మేం రుణాలు చెల్లించకుంటే ప్రభు త్వం చెల్లిస్తుందా? ఆస్తుల వివరాలు మేమెందుకు చెప్పాలి? మా కున్న అప్పులకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఆదాయం వి వరాలు చెబితే పథకాలు వస్తాయా? ఉన్నవాటికి కోతపెడతారా?’ అని ప్రజలు నిలదీస్తున్నారని ఎన్యూమరేటర్లు వాపోతున్నారు. శనివారమూ కొనసాగిన స్టిక్కరింగ్‌ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఈ నెల 6వ తేదీనే ప్రారంభమైంది. 6, 7, 8వ తేదీల్లో ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన ప్రాంతంలోని ఇళ్లను పరిశీలించి యజమానులు, అద్దెదారుల వివరాలను తెలుసుకుని, స్టిక్కర్లు అంటించాలని, 9వ తేదీ నుంచి సర్వే ఫారాల్లో వివరాల నమోదు చేపట్టాలని నిర్ణయించారు. కానీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నాలుగో రోజు కూడా స్టిక్కరింగ్‌ ప్రక్రియే కొనసాగింది. ఇళ్లకు తాళం ఉండటం, యజమానులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఇళ్ల విజిటింగ్, స్టిక్కరింగ్‌ ప్రక్రియలో జాప్యం జరిగినట్లు ఎన్యూమరేటర్లు చెప్తున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా స్టిక్కరింగ్‌ ప్రక్రియ పూర్తయిందని.. ఆదివారం నుంచి సర్వే ఫారాల్లో వివరాల నమోదు కొనసాగుతుందని ప్రణాళిక శాఖ వర్గాలు వెల్లడించాయి. వివరాల సేకరణలో తిప్పలు సర్వేలో ఒక్కో ఇంటికి సంబంధించి 75 ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టడం, 43 ప్రశ్నలకు బుక్‌లెట్‌ చూసుకుని కోడింగ్‌ వేయడం వేయడం ఎన్యూమరేటర్లకు తలకు మించిన భారమవుతోంది. పట్టణాలు, గ్రామాల్లో 150 నుంచి 175 వరకు ఇళ్లను ఎన్యూమరేషన్‌ బ్లాక్‌గా విభజించి ఒక్కో ఎన్యూమరేటర్‌కు అప్పగించారు. రోజుకు 10 ఇళ్లలో సర్వే చేయాలని ఆదేశించారు. కానీ చాలా ప్రాంతాల్లో తొలిరోజు ఐదు, ఆరు ఇళ్ల సర్వేనే పూర్తయింది. కుటుంబాలు ఎక్కువగా ఉన్న ఇళ్లలో అయితే గంటకుపైనే సమయం పడుతోందని.. మధ్యాహ్నం నుంచి కాకుండా రోజంతా చేస్తేనే సర్వే పూర్తవుతుందని సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. వివరాలు సేకరిస్తూ ఫామ్‌ నింపడం కష్టంగా ఉండటంతో కుటుంబ సభ్యులను సహాయకులుగా తీసుకెళుతున్నట్టు చెప్తున్నారు. ఇళ్లకు తాళాలతో ఇబ్బంది పంటల కోతల సమయం కావడంతో ఎన్యూమరేటర్లు ఎప్పుడు వస్తారో తెలియక రైతులు, కూలీలు పనులకు వెళ్తున్నారు. దీనితో సర్వే కోసం వెళ్తున్న ఎన్యూమరేటర్లకు తాళాలు వేసిన ఇళ్లు దర్శనమిస్తున్నాయి. పట్టణాల్లో ఇళ్లలో ఎవరో ఒకరు ఉంటుండటంతో సర్వే ముందుకుసాగుతోంది. తాళాలు వేసిన ఇళ్లను గుర్తుంచుకుని మళ్లీ రావడం ఇబ్బందేనని ఎన్యూమరేటర్లు చెప్తున్నారు.జిల్లాల వారీగా ‘సర్వే’ తీరును పరిశీలిస్తే.. ⇒ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 8,53,950 ఇళ్లు ఉండగా ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో శనివారం రాత్రి వరకు స్టిక్కరింగ్‌ పూర్తి కాలేదు. వ్యవసాయ సీజన్‌ కావడంతో రైతులు, కూలీలు పొలాలకు వెళ్లడంతో చాలా ఇళ్లకు తాళం వేసి ఉంది. కొందరు ఇళ్ల యజమానులు వ్యక్తిగత వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. భద్రాద్రి జిల్లాలో సర్వే ఫామ్‌లు ఆలస్యంగా చేరాయి. ఏజెన్సీ ఏరియాలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటే ఆ వివరాలు చెప్పలేదు. గొత్తికోయలకు ఆధార్‌కార్డులు, ఓటరు కార్డులు ఉన్నా కులం సర్టిఫికెట్లు లేక సర్వేలో ఏం రాయాలో స్పష్టత లేకుండా పోయింది. ⇒ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చాలా మంది ఆదాయ వివరాలను సరిగ్గా చెప్పలేదు. ధరణి సమాచారం అడిగిన ఎన్యుమరేటర్లకు ‘మీకెందుకు?’అనే ప్రశ్న ఎదురైంది. రోజువారీ కూలీలు మొదటిరోజు పనులు వదులుకుని ఇంటి వద్దే ఉన్నా ఎన్యుమరేటర్లు రాక విసుగుపడటం కనిపించింది. ఇంటి నిర్మాణం, విస్తీర్ణంపై సమాధానాలు రాలేదు. ఐటీ రిటర్నులు, వడ్డీ వ్యాపారులు, కులాంతర వివాహాల సమాచారం రాబట్టలేకపోతున్నారు. ⇒ కరీంనగర్‌ నగర పాలక సంస్థ పరిధిలో శనివారం కూడా స్టిక్కరింగే కొనసాగింది. పలుచోట్ల కొందరు ఇంటికి స్టిక్కర్లు వేయవద్దంటూ నిరాకరించారు. ⇒ ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పత్రాల కొరతతో సర్వే ఆలస్యంగా మొదలైంది. ఒక్కో ఎన్యుమరేటర్‌ రోజుకు పది గృహాలను అప్పగించగా.. సమయం సరిపోక 5, 6 ఇళ్లే సర్వే చేస్తున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో శనివారం రాత్రి వరకు కూడా స్టిక్కరింగ్‌ కొనసాగింది. రెండో శనివారం కావడంతో ఆరీ్పలు, ఉపాధ్యాయులు సర్వేకు హాజరుకాలేదు. బోధన్‌ నియోజకవర్గంలో సర్వే స్టిక్కర్లు వేయలేదని స్థానికులు చెప్పారు. ⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11,17,467 ఇళ్లు ఉండగా.. 8,231 మంది ఎన్యుమరేటర్లను నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూములు, ఆస్తుల వివరాలను చెప్పడం లేదు. ఆధార్‌ నంబర్, పాస్‌బుక్‌ వివరాలు ఇచ్చేందుకు కూడా వెనకాడుతున్నారు. పట్టణాల్లో దాదాపు అన్ని వివరాలు చెబుతున్నా ఉద్యోగం, ఆస్తి వివరాలు దాటవేస్తున్నారు. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 8.5 లక్షల కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. పలువురు ఆస్తులు, భూములు, ఓపెన్‌ ప్లాట్ల వివరాలు చెప్పడం లేదు. ఇంట్లో ఉద్యోగం చేసే వారి వివరాలు చెప్పడం లేదు. ఉమ్మడి కుటుంబాల్లోని వారు వేర్వేరుగా వివరాలు నమోదు చేయాలని కోరుతున్నారు. ధరణి పాస్‌ బుక్‌ నంబర్, ఆధార్‌ కార్డులు వెతకడం, పట్టాపాస్‌ బుక్‌లు బ్యాంకుల్లో ఉండటంతో వివరాల నమోదులో జాప్యం జరుగుతోంది. బెల్లంపల్లిలో చాలాచోట్ల వార్డు కౌన్సిలర్లు, నాయకులు అందరినీ ఒకేచోటకు పిలిపించి.. వివరాలు నమోదు చేయించారు. ⇒ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 9,67,871 కుటుంబాలు ఉన్నాయి. రుణాలు, భూములు, ఆస్తి వివరాలు చెప్పడానికి చాలామంది ముందుకురాలేదు. బీసీ–ఈ, సీ సరి్టఫికెట్లు తీసుకున్న వారు చెప్పడానికి వెనుకంజ వేశారు. కొందరు మహిళా టీచర్లు తమ భర్త, పిల్లలను సహాయకులుగా తెచ్చుకున్నారు.రైతు భరోసా లేదు.. నేనెందుకు చెప్పాలి?వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం గిరి్నబావి ప్రాంతంలో నరిగె ఐలయ్య ఇంటికి సర్వే కోసం ఎన్యూమరేటర్‌ వెళ్లారు. కొన్నింటికి సమాధానాలు చెప్పిన ఐలయ్య.. వ్యక్తిగత ఆస్తుల విషయంలో సరిగా స్పందించలేదు. రైతు భరోసా రానప్పుడు భూమి వివరాలు ఎందుకని ఎదురు ప్రశ్నించారు. పింఛన్‌ ఎప్పుడు ఇస్తారని ఆరా తీశారు. ఎన్యూమరేటర్‌ సర్దిచెప్పడంతో చివరకు భూమి వివరాలు చెప్పినా.. ఈ కుటుంబం వద్దే రెండు గంటలు గడిచిపోయింది.అరగంట నుంచి గంట వరకు పడుతోంది.. మాకు రోజుకు 20 కుటుంబాల చొప్పున సర్వే చేయాలంటూ బుక్‌లెట్లు ఇచ్చారు. ప్రశ్నలు అడగడం, వాటి కోడ్‌ కోసం బుక్‌లెట్‌ చూడటం ఇబ్బందిగా ఉంది. డైరెక్ట్‌గా ఫామ్‌లోనే నమోదు చేసేలా ఉంటే బాగుండేది. సర్వేపై ప్రజలకు అవగాహన లేక సమాధానాలు చెప్పడానికి ఆలోచిస్తున్నారు. ఒక కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఉంటే అరగంట నుంచి గంట వరకు సమయం పడుతోంది. – ఎన్‌.పారిజాత, ఎన్యుమరేటర్, నకిరేకల్, నల్లగొండ జిల్లావివరాలు చెప్పేందుకు వెనకాడుతున్నారు ఇంటి యజమానిని ప్రశ్నలన్నీ అడిగి పూర్తి చేయడానికి చా లా సమయం పడుతోంది. కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. అవగాహన లేకపోవడంతో ఆస్తులకు సంబంధించిన వివరాలు చెప్పడానికి వెనుకాడుతున్నారు. కొన్ని ఇళ్ల వద్ద గంట దాకా సమయం పడుతోంది. సర్వే కోసం మరికొంత సమయం ఇవ్వాలి. – వేలిశెట్టి నరసింహారావు, ఎన్యుమరేటర్, వైరా, ఖమ్మం జిల్లా

Trump Wins Arizona Sweeps All 7 Swing States In US Elections 2
అరిజోనాలోనూ ట్రంప్‌ గెలుపు.. ఖాతాలో 312 ఎలక్టోరల్‌ ఓట్లు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో మిగిలిపోయిన అరిజోనా స్టేట్‌ రిజలల్ట్స్‌ కూడా అధికారికంగా వెల్లడయ్యాయి. అరిజోనానూ ట్రంప్‌ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక్కడున్న 11 ఎలక్టోరల్‌ ఓట్లను ట్రంప్‌ గెలుచుకున్నారు. దీంతో ట్రంప్ ఈ ఎన్నికల్లో మొత్తం 312 ఎలక్టోరల్‌ ఓట్లు గెలుచుకున్నారు. ప్రత్యర్థి డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలాహారిస్‌కు 226 ఎలక్టోరల్‌ ఓట్లే వచ్చాయి. అరిజోనా విజయంతో అమెరికాలో ఉన్న ఏడు ‍స్వింగ్‌ స్టేట్స్‌ను ట్రంప్‌ గెలుచుకున్నట్లయింది. అరిజోనాను 2016లో గెలుకున్న ట్రంప్‌ 2020లో బైడెన్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి అక్కడ ఈ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. అరిజోనా గెలుపుతో ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఏడు స్వింగ్‌ స్టేట్స్‌ను ట్రంప్‌ గెలుచుకుని రికార్డు సృష్టించారు. కాగా, అధ్యక్ష ఎన్నికల ఫలితాలు పోలింగ్‌ జరిగిన నవంబర్‌‌ 5న వెలువడడం ప్రారంభమవగా అరిజోనాలో మాత్రం కౌంటింగ్‌ పూర్తవడానికి నాలుగు రోజులు పట్టడం గమనార్హం. ఈ ఎన్నికల్లో గెలిచిన ట్రంప్‌ జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.ఇదీ చదవండి: ట్రంప్‌ మార్కు కనిపించేనా..

Explosion In Hyderabad Jubileehills Road No 1 Hotel3
HYD: హోటల్‌లో భారీ పేలుడు.. బస్తీలో ఎగిరిపడ్డ బండ రాళ్లు

సాక్షి,హైదరాబాద్‌:జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ వన్‌లోని ఓ హోటల్‌లో భారీ పేలుడు సంభవించింది. ఆదివారం(నవంబర్‌ 10) తెల్లవారుజామున 4 గంటలకు పేలుడు జరిగింది. హోటల్‌ కిచెన్‌లో ఉన్న రిఫ్రిజిరేటర్‌ కంప్రెసర్‌ పేలడంతో భారీ శబ్దం వచ్చింది. పేలుడు ధాటికి హోటల్‌ ప్రహరీ గోడ ధ్వంసమైంది. పేలుడు తీవ్రతకు రాళ్ళు ఎగిరి పడి పక్కనే ఉన్న దుర్గాభవానీ నగర్‌ బస్తీలో పడ్డాయి. రాళ్లు పడడంతో బస్తీలో ఐదు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇద్దరికి గాయాలయ్యాయి. భారీ శబ్దానికి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.పేలుడు ఘటనపై జూబ్లీహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: జగిత్యాలలో రోడ్డు ప్రమాదం

Chandrababu Govt illegal cases on social media activists who questioning TDP govt4
అక్రమ కేసులు.. నిర్బంధాలు.. చిత్రహింసలు.. అరాచకానికి పరాకాష్ట

‘‘మేము ఎలా పాలన సాగించినా ఎవరూ నోరెత్తకూడదు.. ఇది మా ప్రభుత్వం.. అంతా మా ఇష్టం.. తప్పు పట్టడానికి మీరెవరు? కాదు కూడదని మా నిర్ణయాలను ప్రశ్నిస్తే నాలుగు తగిలించడంతో పాటు నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లపై కేసులు పెట్టి బొక్కలో వేస్తాం. ఏం చేస్తారో చేసుకోండి. సుప్రీంకోర్టు, హైకోర్టుల సంగతి మా లాయర్లు చూసుకుంటారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్లను కూడా వదిలి పెట్టం. మేం చెప్పినట్లు ఎన్ని తప్పుడు కేసులైనా పెట్టడానికి పోలీసులున్నారు. ఆ విధంగా వాళ్లను ట్యూన్‌ చేసుకున్నాం. ఎవరైనా తోక జాడించి మమ్మల్ని ప్రశ్నిస్తే ఏం చేస్తామో.. ఎలాంటి కేసులు పెడతామో మాకే తెలియదు’’ అన్నట్లు కూటమి సర్కారు గుడ్లురు ముతోంది. నియంతృత్వమే తమ చట్టం అని, రెడ్‌బుక్‌ తమ రాజ్యాంగమని స్పష్టం చేస్తోంది. తాలిబన్లు సైతం విస్తుపోయేలా వికటాట్టహాసం చేస్తూ, సోషల్‌ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురిచేస్తూ రాజ్యమేలుతోంది. పక్కన పేర్కొన్న దయనీయ సంఘటనే ఇందుకు ఓ ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణలు రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉండటం ప్రజాస్వామ్య వాదులను విస్మయ పరుస్తోంది.సాక్షి, అమరావతి: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సోషల్‌ మీడియా యాక్టివిస్టులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వారిపైకి పోలీసులను ఉసిగొలుపుతోంది. రాజ్యాంగ ధర్మాన్ని మంటగలుపుతూ పౌర హక్కులను కాలరాస్తోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు చట్టం, రాజ్యాంగం అనే వాటికి తిలోదకాలు వదిలారు. అధికార పారీ్టల నేతలు చెప్పిన వారందరిపై ఉన్నవీ లేనివీ కల్పించి ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులతో విరుచుకుపడుతున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని 24 గంటల్లో న్యాయస్థానంలో హాజరు పరచాలన్న చట్టాన్ని నిర్భీతిగా ఉల్లంఘిస్తున్నారు. మహిళలు, వృద్ధులు, మైనర్లు అని కూడా చూడకుండా థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తూ చిత్రహింసలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు అర్ధరాత్రి, అపరాత్రి అని కూడా చూడకుండా ఊళ్లపై పడి బీభత్సం సృష్టిస్తున్నారు. నిద్రిస్తున్న వారిని అపహరించుకుపోతున్నారు. ఎక్కడికి తీసుకువెళుతున్నారో చెప్పరు. పోలీసు స్టేషన్‌కు వెళ్లి అడిగితే మాకేం తెలీదనే సమాధానం వస్తుంది. పోలీసు వాహనాల్లో కుక్కి.. కొడుతూ ఎక్కడెక్కడో తిప్పుతున్నారు. గుర్తు తెలియని ప్రదేశాల్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఎందుకు కొడుతున్నారని అడిగితే లాఠీలే సమాధానమిస్తున్నాయి. మేం చేసిన తప్పేమిటని ప్రశ్నిస్తే పోలీసుల బూట్లే మాట్లాడుతున్నాయి. ఒక్కొక్కరిపై రెండు మూడు అక్రమ కేసులు నమోదు చేస్తూ ఒక పోలీస్‌ స్టేషన్‌ నుంచి మరో పోలీస్‌ స్టేషన్‌కు తిప్పుతున్నారు. మూడు నాలుగు రోజుల్లోనే ఏకంగా 110కి పైగా అక్రమ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనం. ఇవన్నీ బాధితుల తరఫున లాయర్లు, గ్రామ పెద్దలు నిలదీస్తేనే అధికారికంగా ప్రకటించినవి కావడం గమనార్హం. అరెస్టు చూపకుండా వేధిస్తున్న కేసులు వేలల్లో ఉన్నాయనడం అక్షర సత్యం. ఒక్కో కేసులో ఒకరు మొదలు 10–20 మందిని సైతం నిందితులుగా చేరుస్తూ వేధిస్తున్నారు. సోషల్‌ మీడియా పోస్టుల ఆధారంగా అరెస్ట్‌ చేయకూడదన్న సుప్రీంకోర్టు తీర్పును సైతం బేఖాతరు చేస్తున్నారు. 41 ఏ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలన్న ఆదేశాలు తమకు పట్టవన్నట్టు చెలరేగిపోతున్నారు. బాధిత కుటుంబాలు హెబియస్‌ కార్పస్‌ పిటీషన్లతో హైకోర్టును ఆశ్రయించినా సరే తమ నియంతృత్వాన్ని నిర్భీతిగా సమర్ధించుకోవడం దుర్మార్గం. ఇదీ చంద్రబాబు మార్కు పోలీసు రాజ్యం. మహిళపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగం! సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ పెద్దిరెడ్డి సుధారాణి పట్ల పోలీసులు మహిళ అని కూడా చూడకుండా అత్యంత క్రూరంగా వ్యవహరించడం దారుణం. మూడు రోజుల పాటు ఆమెను, ఆమె భర్తను చిత్రహింసలకు గురిచేశారు. ‘నన్ను ఈ నెల 5వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. నా భర్త వెంకటరెడ్డినీ చిత్రహింసలకు గురిచేశారు. చిలకలూరిపేట సీఐ రమేష్‌ దుర్భాషలాడారు. నోరెత్తితే ఇష్టానుసారం కొట్టారు. థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల వద్ద జొన్నవాడలోని రాజరాజేశ్వరి ఆలయానికి వెళ్లినప్పుడు మమ్మల్ని పల్నాడు జిల్లా చిలకలూరిపేట సీఐ రమేష్‌ బృందం అదుపులోకి తీసుకుంది. చిలకలూరిపేట, ఒంగోలుకు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు’ అని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. తుదకు ఆమె తరఫు వారు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేయడంతో శుక్రవారం సాయంత్రం కొత్త పేట పోలీసులు గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టారు. ఇదే విషయాన్ని ఆమె మెజిస్ట్రేట్‌ ఎదుటే చెప్పారు. పోలీసులు కొట్టడంతో అయిన గాయాలను సైతం చూపించారు. ఈమెపై ఏకంగా 6 అక్రమ కేసులు బనాయించారు. నా భర్తను చంపేస్తారేమో.. ‘సోషల్‌ మీడియా యాక్టివిస్టు అయిన నా భర్త వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసులు చంపేస్తారేమోనని భయంగా ఉంది. రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంత వరకు ఎక్కడున్నాడో ఆచూకీ తెలియడం లేదు. ఐ టీడీపీ, విశాఖకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పినపాల ఉదయ భూషణ్, చంద్ర కిరణ్‌లు మా ఆయన పేరుతో ఫేక్‌ ఐడీ సృష్టించి, సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. విచారణలో కూడా ఈ విషయం తేలింది. అయినా ఇప్పుడు దీనిపై కుట్ర చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఆయనేదో అంతర్జాతీయ టెర్రరిస్ట్‌ అన్నట్లు వ్యవహరిస్తున్నారు’ అని రవీందర్‌రెడ్డి భార్య కళ్యాణి శనివారం మీడియా ఎదుట కన్నీటి పర్యంతమవడం ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్టగా నిలుస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మహిళలను వేధించినట్లా? కూటమి ప్రభుత్వ పెద్దలు నివసిస్తున్న విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో అరాచకాలు, దుర్మార్గాలకు అంతే లేకుండా పోయింది. ఓ పోస్టును సాకుగా చేసుకుని కూటమి నాయకుడొకరు తన పార్టీ కార్యకర్తలతో ఈ నెల 2వ తేదీన పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులిప్పించాడు. అదే రోజు ఎన్టీఆర్‌ జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లలోనూ 42 కేసులు నమోదు చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాలలో 172 మందికి నోటీసులిచ్చారు. శుక్రవారం నాటికి మొత్తంగా 260 మందికి నోటీసులు ఇచ్చారు. కూటమి సర్కారు వైఫల్యాలు, అక్రమాలపై ప్రశ్నిస్తే.. అమ్మాయిలపై తప్పుడు పోస్టు పెట్టారని అభాండాలు వేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ‘నేను ఇటీవల ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో వచ్చిన పోస్ట్‌ను చూశాను. ఈ మాత్రం దానికే నాకు సైబర్‌ పోలీసుల నుంచి నోటీసు వచ్చింది. స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలన్నారు’ అని గుంటూరుకు చెందిన ఆకుల మురళి అనే వ్యక్తి విస్మయం వ్యక్తం చేశారు. ఇది నేరమట!శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో ఈనెల 1వ తేదీన బైనపల్లి దానమ్మ అనే వృద్ధురాలు పింఛన్‌ కోసం గంటలతరబడి వేచి ఉంటూ సొమ్మసిల్లి పడిపోయింది. స్థానికులు వెంటనే ఓ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. ఇదే విషయాన్ని అదే మండలం కొండపల్లి గ్రామ ఉప సర్పంచ్‌ మడ్డు జస్వంత్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇతని పాలిట ఇదే పాపమైపోయింది. పాలక పార్టీ పెద్దల ఆదేశాలతో పోలీసులు అక్రమంగా కేసు పెట్టారు. అంతటితో ఆగకుండా ఆయన్ను భయపెట్టాలని కూడా ఆదేశించారు. దీంతో పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అప్పుడు ఆయన ఇంట్లో లేడు. గంటల కొద్దీ అక్కడే ఉండి ఆయన కుటుంబ సభ్యులను మానసికంగా వేధించారు. ఆ తర్వాత ఎటువంటి నోటీస్‌ ఇవ్వకుండానే జస్వంత్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ రోజు కార్తీక పూజ నిర్వహిస్తున్నామని, భోజనం చేసి వస్తానన్నా కూడా వదల్లేదు. ఫోన్‌ను కూడా లాగేసుకున్నారు. ఏం కేసు పెట్టారని అడిగినా అప్పుడు చెప్పలేదు. తర్వాత లాయర్‌ సాయంతో బయటకు వచ్చాడు. అయినా ఇప్పటికీ ఎప్పుడుపడితే అప్పుడు స్టేషన్‌కు రావాలంటూ ఫోన్లు చేసి పిలిపిస్తూ మానసికంగా వేధిస్తున్నారు. 192 బీఎన్‌ఎస్‌ సెక్షన్‌తో ఎఫ్‌ఐఆర్‌ (150/24) నమోదు చేశారు. శాంతిభద్రతలు నిల్‌.. వేధింపులు ఫుల్‌! వరుస హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. వీటిని అరికట్టాల్సిన చంద్రబాబు ప్రభుత్వం నిమ్మ­కు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. టీడీపీ గూండాలు కర్రలు, కత్తులతో గ్రామాలపై పడి బీ­భత్సం సృష్టిస్తున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో 177 మంది హత్యకు గురయ్యారు. 500కుపైగా హత్యాయత్నాలు జరి­గాయి. 2 వేలకుపైగా దాడులతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. టీడీపీ గూండాల దాడులతో భీతిల్లి దాదాపు 3 వేల కుటుంబాలు గ్రామాలు విడిచిపెట్టి ఇతర ప్రాంతాల్లో తల దాచుకుంటున్నాయి. అత్యాచార పర్వానికి అంతు లేకుండా పోయింది. ఇళ్లల్లో ఉండే చిన్నారులు, పాఠశాలకు వెళ్లే విద్యార్ధినులు, యువతులపై అత్యాచారాలతో ప్రజలు భయ­భ్రాంతులకు గురవుతున్నారు. నాలుగు నెల­ల్లోనే రాష్ట్రంలో 110 మందిపై అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయి. అయినా శాంతిభద్రతలతో తమకు సంబంధం లేదన్నట్లు సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓ ముస్లిం బాలిక కిడ్నాప్‌కు గురికాగానే ప్రభుత్వం స్పందించి ఉంటే ఇప్పుడు ఆ అమ్మాయి బతికుండేది. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు జాన్‌ 16 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడితే ఏ మేరకు శిక్ష వేశారో పాలకులే చెప్పాలి. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్‌ యార్డ్‌ వద్ద ఉన్న ఐషర్‌ వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తోటపాలెంలో ఓ యువతిని టీడీపీ నేత లైంగికంగా వేధించాడు. ఇలాంటి వారందరిపై ఏ చర్యలూ లేవు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీలోని బాత్‌ రూమ్‌లలో రహస్య కెమెరాలు పెట్టిన వారిపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగినా ఇక్కడ మాత్రం ఏ చర్యలూ లేవు. అన్నా.. వాడిక ఆర్నెల్లు నడవలేడు⇒ సోషల్‌ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని నిరంకుశ పాలన సాగిస్తోంది. ఇందులో భాగంగా అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు వారి ఆచూకీ తెలియనీయకుండా, కోర్టులోనూ హాజరు పర­చకుండా ఊళ్లు.. ఊళ్లు తిప్పుతూ.. వారిని ఏ విధంగా వేధిస్తున్నారో ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతలకు చెబుతుండటం గమనార్హం. ‘అన్నా.. మీరు చెప్పినట్లే వాడిని కుమ్మేశాను. ఏడాది.. కనీసం ఆర్నెల్లు వాడు నడవలేడు. ఆ తర్వాత కూడా వాడు కుంటుకుంటూ నడవాల్సిందే’ అని ఇటీవల ఓ ఎస్‌ఐ అధికార పార్టీ నేతకు చెప్పడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. ⇒ అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన సంజీవరెడ్డిని ఈ నెల 6వ తేదీ రాత్రి పుట్టపర్తి అర్బన్‌ సీఐ సునీత సిబ్బందితో వచ్చి ఇంటి నుంచి బలంవంతంగా లాక్కెళ్లింది. అప్పటి నుంచి సంజీవరెడ్డి ఆచూకీ తెలియడం లేదు. ⇒ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ను ప్రశ్నిస్తున్నారనే కారణంతో విశాఖ జిల్లా గాజువాకకు చెందిన వెంకటేష్, ప్రకాశం జిల్లాకు చెందిన పవన్‌పై కర్నూలు జిల్లా పత్తికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా తమకు ఊడిగం చేసే పోలీసులు ఎక్కడ ఉంటే అక్కడ అక్రమ కేసులు ఇష్టారాజ్యంగా నమోదు అవుతున్నాయి. ఇంకా వేలాది మందిపై తప్పుడు కేసులు పెట్టడానికి పోలీసులు కసరత్తు సాగిస్తున్నారు.⇒ వాస్తవాలు ఇలా ఉంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఏబీఎన్‌ వంటి ఎల్లో మీడియా ఈ అరాచకానికి కొమ్ము కాస్తుండటం దారుణం. నిబద్ధత కలిగిన ఇతర మీడియా సంస్థలు ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగా ఎలుగెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బరితెగించి సాగిస్తున్న ప్రభుత్వ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్‌ దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ బాధితుల తరఫున న్యాయ పోరాటానికి దిగింది. చంద్రబాబు ప్రభుత్వ రాక్షసత్వాన్ని నిలదీస్తోంది.

RTC bus collided with wedding reception car in jagtial5
కాళ్ల పారాణి ఆరకముందే.. వధువు కుటుంబంలో విషాదం

సాక్షి, జగిత్యాల జిల్లా: పచ్చని పందిళ్లు..మేళతాళాలు.. మంగళ వాయిద్యాల మధ్య వేద మంత్రాలతో వధూవరులు ఏకమయ్యారు. ఆ తర్వాత జరిగిన రిసెప్షన్ వధువు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ తర్వాత జరిగిన రిసెప్షన్ వధువు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం ఉదయం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వధువు తల్లిదండ్రులు చావు బతుకులు మద్య కొట్టుమిట్టాడుతుంటే అన్న , అతని స్నేహితురాలు ప్రాణాలు కోల్పోయారు. వధువు వివాహం జరిగిన గంటల వ్యవధిలో ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబళించడంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయిజగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హన్మకొండలో రిసెప్షన్‌ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న వధువు కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారును జగిత్యాల డిపోకి చెందిన సూపర్‌ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వధువు అన్న సంకీర్త్, స్నేహితురాలు రాజీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు వెనుక సీట్లో కూర్చున్న వధువు తల్లి,దండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Nathan McSweeney and Josh Inglis make Australias Test squad for India series6
టీమిండియా టెస్టు సిరీస్‌.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన! స్టార్‌ ప్లేయర్లకు చోటు

క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి మరో 12 రోజుల్లో తెరలేవనుంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుతో ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌​ షురూ కానుంది. ఈ క్రమంలో తొలి టెస్టుకు 13 సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టులో ఇద్దరు ఆన్‌క్యాప్డ్ ప్లేయర్లు నాథన్ మెక్‌స్వీనీ, జోష్ ఇంగ్లిష్‌లకు చోటు దక్కింది. తొలి టెస్టుకు మైఖల్‌ నసీర్‌ గాయం కారణంగా దూరమయ్యాడు. భారత్‌-ఎ జట్టుతో జరిగిన రెండో అనాధికారిక టెస్టులో నసీర్‌ గాయపడ్డాడు.ఓపెనర్‌గా నాథన్ మెక్‌స్వీనీ..భారత్‌-ఎ జట్టుతో జరిగిన సిరీస్‌లో నాథన్ మెక్‌స్వీనీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.రెండు మ్యాచ్‌ల్లోనూ మెక్‌స్వీనీ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. పెర్త్ టెస్టులో ఉస్మాన్ ఖవాజాతో కలిసి మెక్‌స్వీనీ ఓపెనింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.జోష్ ఇంగ్లిష్‌ కూడా ఇటీవల కాలంలో సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే పరిమిత ఓవర్ల జట్టులో కీలక సభ్యునిగా ఉన్న ఇంగ్లిష్‌.. ఇప్పుడు క్యారీకి బ్యాకప్‌గా చోటు సంపాదించుకున్నాడు.పెర్త్‌ టెస్టుకు ఆసీస్‌ జట్టు: స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్‌, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్చదవండి: ‘పాకిస్తాన్‌లో ఆడేదే లేదు’

Tamil Actor Delhi Ganesh Passed Away7
ప్రముఖ నటుడు ఢిల్లీ గణేశ్ కన్నుమూత

ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఢిల్లీ గణేశ్ (80) కన్నుమూశారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 400కి పైగా సినిమాల్లో నటించారు. వీటితో పాటు తమిళ సీరియల్స్, వెబ్ సిరీసుల్లోనూ నటించారు. అయితే గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. చెన్నైలో శనివారం రాత్రి 11:30 గంటలకు తుదిశ్వాస విడిచారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక)ఢిల్లీ గణేశ్ మృతితో తమిళ, తెలుగు ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఈయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చివరగా ఈయన కమల్ హాసన్ 'భారతీయుడు 2' మూవీలో కనిపించారు. అంతకు ముందు తెలుగులో ఈయన 'జైత్రయాత్ర', 'నాయుడమ్మ', 'పున్నమినాగు' తదితర సినిమాల్లో నటించారు. షారుఖ్ 'చెన్నై ఎక్స్‌ప్రెస్', సూర్య 'వీడొక్కడే', లారెన్స్ 'కాంచన 3' లాంటి డబ్బింగ్ చిత్రాల్లో ఈయన మీకు కనిపించే ఉంటారు.1976లో ప్రారంభమైన ఢిల్లీ గణేశ్‌ సినీ ప్రస్థానం.. ఈ ఏడాది వరకు కొనసాగింది. సినిమా ఇండస్ట్రీ రాకముందు ఈయన భారత వైమానిక దళంలోనూ పనిచేశారు. మొదటి సినిమా కె.బాలచందర్‌ దర్శకత్వంలో పట్టిన ప్రవేశం (1977)లో నటించారు. 1994 కలైమామణి అవార్డును తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈయనకు అందించింది. (ఇదీ చదవండి: OTT Review: గల్లీ ప్రేమను సింపుల్‌గా గెలిపించిన క్రికెట్‌)

YS Jagan Fire On CM Chandrababu TDP Govt Over Illigal Cases On YSRCP Social Media Activists: AP8
వ్యవస్థీకృత నేర రాజకీయాల్లో చంద్రబాబు బరితెగింపు: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ (వ్యవస్థీకృత నేరాలు)తో కూడిన పాలిటిక్స్‌ (రాజకీయాలు) సాగిస్తూ చంద్రబాబు మరింతగా బరి తెగించారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. కూటమి 100 రోజుల పాలన, మోసాలు, వైఫల్యాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు సృష్టించిన అబద్ధాన్ని ఎల్లో మీడియా మోయడం.. ఆ తర్వాత ఆ పార్టీల నాయకులు, వారిని మోస్తున్న అధికారులు ప్రజల్లో అశాంతిని రేపేలా చేయడం ఒక పన్నాగం ప్రకారం జరిగాయని ఎత్తి చూపారు. సోషల్‌ మీడియాపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ఎండగడుతూ శనివారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. ⇒ దొంగే ఎదుటివారిని పట్టుకుని దొంగా అన్నట్టుగా చంద్రబాబు తీరు ఉంది. నలభై ఏళ్లుగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న చంద్రబాబు ఇప్పుడు కూడా అదే చేస్తూ ఎదుటివారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తన స్కాంలు బయటపడుతున్నాయని, తాను చేసిన అవినీతి బయటకు వస్తోందని, తన పాలనా వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతున్నారనే దురహంకారంతో ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా గొంతు విప్పుతున్నవారిని, ముఖ్యంగా చంద్రబాబు తప్పులను నిలదీస్తున్న యువతను లక్ష్యంగా చేసుకుని చట్టవిరుద్ధంగా, అన్యాయంగా, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. తన అడుగులకు మడుగులొత్తే పోలీసులను వాడుకుంటూ వారిపై భౌతికదాడులు చేయిస్తూ, హింసిస్తున్నారు. ఇది ఆర్గనైజ్డ్‌ క్రైం కాదా? ⇒ ఎలాగూ చంద్రబాబు చేతిలోనే దాదాపుగా అన్ని పేపర్లు ఉన్నాయి. కాస్తోకూస్తో ప్రజాసమస్యలపై గొంతు విప్పే టీవీలను కూడా వ్యవస్థీకృతంగా దెబ్బ తీశారు. కేబుల్‌ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి వాటి ప్రసారాలను ప్రజలకు చేరనీయకుండా పలుమార్లు కట్‌ చేశారు. ఇక చంద్రబాబుకు కొరుకుడుపడనిది ఒకే ఒక్కటి. అదే సోషల్‌ మీడియా. అందుకే చంద్రబాబు ఇలా బరితెగిస్తున్నారు. ఇలా ఒక చేత్తో తన మీడియాను, మరో చేత్తో వ్యవస్థలను, ఆ వ్యవస్థల్లోని తన మనుషులను వాడుకుని నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు చేస్తున్న ఆర్గనైజ్డ్‌ క్రైమ్స్‌ చూస్తూనే ఉన్నాం. మరి ఆర్గనైజ్డ్‌ క్రైమ్స్‌కు పాల్పడుతున్నది ఎవరు? ⇒ ప్రజలకు మంచిచేసి కాకుండా, మభ్యపెట్టి, మోసం చేసి, అబద్ధాలు ఆడి అధికారంలోకి రావాలని, అధికారంలో ఉంటే దాన్ని ఇలాగే నిలబెట్టుకోవాలన్నది చంద్రబాబు సిద్ధాంతం. దీనికోసం చంద్రబాబుగారు ఒక అబద్ధాన్ని సృష్టిస్తారు. దానికి రెక్కలుతొడిగి తన ఎల్లోమీడియా ద్వారా శరవేగంగా వ్యాపింపచేస్తారు. దానిపైనే వారి పార్టీనాయకులచేత మాట్లాడిస్తారు. పనిలోపనిగా దత్తపుత్రుడిని, ఇతర పార్టీల్లో తనకు అనుకూలంగా ఉన్నవారినికూడా దీనికి వాడుకుంటారు.ఆ తర్వాత డిబేట్లు చేయిస్తారు. దీనికి మరిన్ని అవాస్తవాలు జోడించి తన కుమారుడు లోకేశ్‌ ద్వారా సోషల్‌ మీడియాలో విష ప్రచారం చేయిస్తారు. వాళ్లే ఆరోపణలు చేసి, వాళ్లే మీడియా ట్రయల్‌ చేసి, వాళ్లే దోషులెవరో నిర్ధారించి, వాళ్లే శిక్షలు విధిస్తారు. ఒక పథకం ప్రకారం, మాఫియా ముఠా మాదిరిగా చంద్రబాబు ఈ నేరాలు చేస్తూనే ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలను దెబ్బ తీయడానికి, రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననానికి నిరంతరం ప్రయతి్నస్తూనే ఉంటారు. మరి ఇది వ్యవస్థీకృత నేరం కాదా?⇒ అయ్యా చంద్రబాబూ, మీ పార్టీ టీడీపీ అధికారిక సోషల్‌ మీడియా అకౌంట్లో మీరే ఫేక్‌ న్యూస్‌పెట్టి, దాన్ని మీరే ప్రొపగండా చేసిన లేటెస్ట్‌ ట్వీట్‌ను రాష్ట్ర ప్రజలంతా గమనించారు. ఎప్పుడో రెండేళ్ల కిందట మా అమ్మ కారు టైర్‌ బరస్ట్‌ అయితే, అప్పటి వీడియోను ఇప్పుడు బయటకు తీసి, లేటెస్ట్‌గా ఇప్పుడే జరిగినట్టుగా, మీరు ట్వీట్‌లో పెడుతూ, నా తల్లిని నేను చంపాలని అనుకున్నానని సిగ్గుమాలిన రీతిలో వ్యక్తిత్వ హననానికి నువ్వు దిగావు.దీన్ని ఖండిస్తూ మా అమ్మ లేఖ రాస్తే దాన్నికూడా ఫేక్‌ లెటర్‌గా పేర్కొంటూ నువ్వు పబ్లిసైజ్‌ (ప్రచారం) చేయడం సిగ్గుమాలిన చర్య కాదా? మళ్లీ మా అమ్మ వీడియో మెసేజ్‌ కూడా ఇస్తూ మీ తీరును దుయ్యబట్టింది. ఇంతలా ఉద్దేశ పూర్వకంగా వ్యక్తిత్వ హననం చేసిన నిన్ను, నీ కొడుకును ఇదే పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదు? ఇలాంటివి శతకోటి మీ ఏబీఎన్, మీ ఈనాడు, మీ టీవీ–5, మీ అనుకూల మీడియా ఎన్ని చేసినా పోలీసులు ఏనాడైనా చర్యలు తీసుకున్నారా? నువ్వు చేస్తే ఏదైనా మంచే! కాని నువ్వు చేసిన తప్పుడు పనులను, ప్రజా వ్యతిరేక చర్యలను ఎవరైనా ప్రశి్నస్తే అది చెడు అవుతుందా? వారిపై కేసులుపెట్టి వారిని హింసించడం ధర్మమేనా? ⇒ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌తోకూడిన పాలిటిక్స్‌లో చంద్రబాబు మరింతగా బరితెగించారు. మొన్నటి తిరుమల లడ్డూ వ్యవహారం వరకూ జరిగిన అనేక పరిణామాలు దీనికి ఉదాహరణ. కూటమి 100 రోజుల పాలన, మోసాలు, వైఫల్యాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు సృష్టించిన అబద్ధాన్ని ఎల్లోమీడియా మోయడం, ఆ తర్వాత ఆ పార్టీల నాయకులు, వారిని మోస్తున్న అధికారులు ప్రజల్లో అశాంతిని రేపేలా చర్యలు, కార్యక్రమాలు చేయడం ఒక పన్నాగం ప్రకారం జరిగాయి. మరి వ్యవస్థీకృత నేరాల కింద అరెస్టు చేయాల్సింది ఎవరిని? జీవిత ఖైదు వేయాల్సింది ఎవరికి? చంద్రబాబుకు కాదా?

SunDay Special story on Children's Day9
పిల్లలూ దేవుడూ చల్లని వారే

పాటలు హీరో, హీరోయిన్ల సొంత సొత్తు కాదు. ఒకప్పుడు సినిమాల్లో పిల్లల పాత్రలు ఉండేవి. వారికి పాటలు ఉండేవి. పిల్లలు కథను నడిపించేవారు. పాటలు పాడి కథను నిలబెట్టేవారు. పిల్లల పాటల కోసం సినిమాలు హిట్‌ అయిన సందర్భాలున్నాయి. పిల్లల పాటలతో స్టార్స్‌ అయిన బాల నటీనటులు ఉన్నారు. కాని నేటి సినిమాల్లో పిల్లల పాటలు కనుమరుగయ్యాయి. వారి గొంతును వినపడనివ్వడం లేదు.పిల్లల పాట మళ్లీ బతకాలి. పిల్లల పాత్ర మళ్లీ నిలవాలి.‘లేరు కుశలవుల సాటి...సరి వీరులు ధారుణిలో’....‘లవ కుశ’లో లవుణ్ణి, కుశుణ్ణి చూడటానికి పల్లెల నుంచి జనం బండ్లు కట్టుకుని వచ్చేవారు. వారి నోటి నుంచి రామాయణ గాథను పాటలుగా విని పరవశించి పోయేవారు. ఉద్వేగంతో ఆనందబాష్పాలు రాల్చేవారు. పెద్దలు రామాయణం చెప్తేనే ఎంతో రుచిగా ఉంటుందే, మరి పిల్లలు చెప్తే ఇంకెంత రుచి!శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా!ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా!చెప్పాలంటే మనవాళ్లు చాలా గొప్పోళ్లోయి! ఏమంటే 1934లోనే లవకుశ తీశారు. అందులోని బాలనటులను, వారి పాటలను చూసి డబ్బులు కుమ్మరించారు. దాంతో దర్శకుడు సి.పుల్లయ్య పిల్లలు ప్రధాన పాత్రలుగా అంటే పిల్లలే అన్ని పాత్రలు చేసేలా ‘సతీ అనసూయ’ (1936) సినిమా తీసి దాంతో పాటు మరో పిల్లల సినిమా ‘ధ్రువ విజయం’ తీసి ఒకే టికెట్‌ మీద ఈ రెండు సినిమాలు ప్రదర్శించి రికార్డు స్థాపించారు. ఇలా మరో భాషలో జరగలేదు. ఈ విషయం మనవారు ప్రచారం చేసుకోరు. అన్ని పాత్రలను బాలలే ధరించిన సినిమాను దేశంలో తొలిగా తీసింది మనమే.చిన్నప్పుడు పెద్దప్పుడు:పాఠకులు ప్రేక్షకులుగా మారుతున్న కాలం. చదివే కథ నుంచి చూసే కథకు మారాలంటే వారికి ‘సినిమా’ అనే మీడియం మెల్లగా అలవాటు చేయాలి. అందుకని దర్శకులు కథను మెల్లగా చెప్పేవారు. కథానాయిక, నాయకుల జీవితాన్ని బాల్యం నుంచి మొదలుపెట్టి వారు పెద్దయ్యాక ఏం జరుగుతుందో చూపేవారు. అందువల్ల నాటి సినిమాల్లో పిల్లల పాత్రలు తప్పనిసరిగా ఉండేవి. ‘మల్లీశ్వరి’ సినిమాలో చిన్నప్పటి ఎన్టీఆర్, చిన్నప్పటి భానుమతిగా నటించిన మాస్టర్‌ వెంకటరమణ, బేబీ మల్లిక –‘రావిచెట్టు తిన్నె చుట్టు రాతి బొమ్మలు చెక్కాలోయ్‌మంచి బొమ్మలు చెక్కాలోయ్‌ నీ మల్లి బొమ్మలు చెక్కాలోయ్‌’అని పాడుకుంటే చూడటం ముచ్చటగా ఉంటుంది. మరి ఇవాళ రావిచెట్టు ఎంతమంది పిల్లలకు తెలుసో, తిన్నె అనే మాట ఎంతమంది పిల్లలకు అర్థమవుతోందో!అక్కినేని ‘దేవదాసు’లో చిన్నప్పటి దేవదాసు, చిన్నప్పటి పార్వతి పాడుకుంటారు. స్కూల్‌ ఎగ్గొట్టి తిరిగే దేవదాసును పార్వతి ఆ పాటలో ఆట పట్టిస్తుంది.‘ఓ దేవదా.. చదువు ఇదేనాఅయ్యవారు నిదరోతే తమరు ఇలాగే దౌడుదౌడా’...ఇక నేటికీ నిలిచి వెలుగుతున్న ‘నిదురపోరా తమ్ముడా’ పాట సంతానంలో రెండు సందర్భాల్లో వస్తుంది. ఒకటి చిన్నప్పుడు, ఒకటి పెద్దప్పుడు. చిన్నప్పటి పాటలో లతా మంగేశ్కర్‌ మూడు చరణాలు పాడితే, పెద్దప్పటి పాటలో ఒక చరణం ఘంటసాల పాడారు. చిన్నప్పటి పాటలో లతా–‘కలలు పండే కాలమంతా కనుల ముందే కదిలిపోయేలేత మనసుల చిగురుటాశ పూతలోనే రాలిపోయే నిదురపోరా తమ్ముడా’... అని పాడుతుంటే కలత నిద్రలతో బతుకుతున్న వారంతా కన్నీరు కారుస్తారు.బొమ్మల పెళ్లి:నాటి సినిమాలు పిల్లల్నే కాదు పిల్లల ఆటపాటల్ని కూడా పట్టించుకున్నాయి. అప్పటి పిల్లలకు బొమ్మల పెళ్లి చేయడం ఒక పెద్ద సరదా. ఈ బొమ్మల పెళ్లిళ్లు పిల్లల మధ్య నిజం పెళ్లిళ్లుగా మారి కథలు మలుపు తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు వీడియో గేమ్‌లు ముంచెత్తే ఈ రోజుల్లో పిల్లలు బొమ్మలు అనే మాట ఎత్తడం లేదు. పెద్దలు కూడా సెల్‌ఫోన్‌ నే బొమ్మగా చేతిలో పడేస్తున్నారు. బొమ్మలు పిల్లలకు నేస్తాలు. వాటినే సర్వస్వంగా భావించి ఆలనా పాలనా చూసి పెళ్లిళ్లు చేసేవారు పిల్లలు. ‘కన్యాశుల్కం (1955)’లో బొమ్మల పెళ్లి కోసం పిల్లలు పాడే పాట చాలా బాగుంటుంది.చేదాము రారే కల్యాణము... చిలకా గోరింక పెళ్లి సింగారము...‘మాంగల్యబలం’ (1959)లో పిల్లలు పాడే బొమ్మల పెళ్లి పాట వైవాహిక జీవితానికి ఒక వ్యాఖ్యానం లాంటిది. ఈ పాటను శ్రీశ్రీ రాశారంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంత సంప్రదాయ భావనలను ఇంత బాగా ఎలా రాశాడా అని.హాయిగా ఆలుమగలై కాలం గడపాలివేయేళ్లు మీరనుకూలంగా ఒకటై బతకాలి...తర్వాతి రోజుల్లో అక్కినేని పక్కన హీరోయిన్‌ గా ‘ప్రేమాభిషేకం’ వంటి సూపర్‌హిట్‌ను సాధించిన శ్రీదేవి బాలనటిగా అదే అక్కినేని ‘శ్రీమంతుడు (1971)’ లో బొమ్మల పెళ్లి పాట పాడింది. అంత చిన్న వయసులో ఆమె ఎక్స్‌ప్రెషన్‌ ్స చూడాలి ఇప్పుడైనా. భలే ఉంటాయి. మరి పాటో?చిట్టిపొట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలుబుల్లిబుల్లి రాధకు ముద్దుముద్దు రాజుకుపెళ్లండీ పెళ్లి ముచ్చటైన పెళ్లిమర్యాదలు చెప్తూ... అల్లరి చేస్తూ:పిల్లలు అల్లరి చేస్తే ముద్దు. అలాగే వారు బుద్ధిమంతులుగా ఉంటే మరీ ముద్దు. అల్లరి చేయడం పిల్లల హక్కు అనేది మర్చిపోయి, ఇవాళ వాళ్లను ఊపిరి సలపని హాస్టళ్లలో పడేసి తెగ తోమిస్తున్నారు తల్లిదండ్రులు. పరీక్షల భయం ఇవాళే కాదు ఆవాళ కూడా ఉంది. అందుకే ‘పెళ్లి చేసి చూడు’ (1952)లో స్టేజి నాటకంలో చిన్నారి బాలుడు పరీక్షలు ఎగ్గొట్టడానికి దొంగ కడుపునొప్పి తెచ్చుకుని పాడే పాట అల్లరి... చాలా వల్లరి.అమ్మా నొప్పులే అమ్మమ్మ నొప్పులేఫస్టుక్లాసులో పాసవుదామని పట్టుబట్టి నే పాఠాల్‌ చదివితేపరీక్షనాడే పట్టుకున్నదే బడికెట్లా నే వెళ్లేదే?ఇలా అల్లరి చేసే పిల్లలే సుద్దులు కూడా చెబుతారు. కె.వి.రెడ్డి తీసిన ‘దొంగరాముడు’ అల్లరి చేసే చిన్న అక్కినేనికి, చిన్న సావిత్రి సుద్దులు చెబుతుంది. ఎలా మసలుకోవాలో హితబోధ చేస్తుంది.తెలిసిందా బాబూ ఇపుడు తెలిసిందా బాబు అయవారు తెలిపే నీతులు ఆలించకపోతే వాతలే...కె.విశ్వనాథ్‌ తొలి సినిమా ‘ఆత్మగౌరవం’లో ఆయన ఎంత మంచి పాట పెట్టారంటే ఇంటికి వచ్చిన అతిథులను ఆ ఇంటి పిల్లలు ఎలా గౌరవించి ఆహ్వానించాలో అందులో ఉంటుంది. ఇంటి సంస్కారం పిల్లల ప్రవర్తనలోనే తెలుస్తుంది. ఇవాళ ఇంటికి బంధువులొస్తే పిల్లలు పలకరించనైనా పలకరించట్లేదు– నమస్కారం పెట్టే సంగతి తర్వాత. అంతే కాదు తమ గదుల్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటున్నారు. తల్లిదండ్రులు వారిని అందుకు ఎంకరేజ్‌ చేస్తున్నారు. కాని ఆత్మగౌరవంలో రేలంగి, గుమ్మడి అతిథులుగా వస్తే పిల్లలు ఎంత బాగా పాడతారో!మారాజులొచ్చారు మహరాజులొచ్చారు మా ఇంటికొచ్చారుమామంచి వారంట మనసున్న వారంట మాకెంతో నచ్చారు...భక్తి... దైవభక్తి:పిల్లలకు దేవుడు మంచి స్నేహితుడు. పిల్లలు దేవుని మీద సందేహం లేని భక్తి పెట్టుకుంటారు. పిల్లల ద్వారా భక్తిని చెప్పేందుకు ‘యశోదకృష్ణ’, ‘భక్త ప్రహ్లాద’, ‘భక్త ధ్రువ మార్కండేయ’లాంటి సినిమాలు వచ్చి ప్రజాదరణ పొందాయి. ‘యశోదకృష్ణ’తో శ్రీదేవి, ‘భక్త ప్రహ్లాద’తో రోజా రమణి పెద్ద స్టార్స్‌ అయ్యారు. ‘భక్త ప్రహ్లాద’లో ప్రహ్లాదుడు పాడిన పాటలు హిట్‌.నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనంమరోపాట–జీవము నీవే కదా...నేటికీ నిలిచి ఉన్నాయి.ఇక ‘లేత మనసులు (1966)’తో స్టార్‌ అయిన ‘కుట్టి పద్మిని’ పాడిన ఈ పాట 60 ఏళ్ల తర్వాత కూడా చల్లదనాన్ని కురిపిస్తూనే ఉంది.పిల్లలూ దేవుడూ చల్లని వారేకల్లకపటమెరుగని కరుణామయులే...‘మూగనోము’లో–తల్లివి నీవే తండ్రివి నీవేచల్లగ కరుణించే దైవము నీవే....సంభ్రమం... సందేహం:పిల్లలకు సందేహాలు జాస్తి. అలాగే ప్రతిదానికీ వారు వింత పడతారు. ఇప్పటి పిల్లల్లా అన్నీ గుగుల్‌ ద్వారా తెలుసుకొని నిమ్మళంగా ఉండిపోరు. పెద్దలను విసిగించేవారు. అలా పిల్లలకూ పెద్దలకూ ఒక సంభాషణ జరిగేది. ‘బాలరాజు కథ’లో ఈ పాట చూడండి–అడిగానని అనుకోవద్దు చెప్పకుండా దాటేయొద్దుఏమిటీ రహస్యం స్వామి ఏమిటీ విచిత్రంఆ రోజుల్లో ఫోన్‌ ఒక వింత. ఇంట్లో ఫోన్‌ ఉండటం ఒక హోదా. ఇరుగింటి పొరుగింటి వారికి అది పి.పి. నంబర్‌. ఇంట్లో పిల్లలకు ‘ట్రింగ్‌ ట్రింగ్‌’మన్నప్పుడల్లా సరదా. ఫోన్‌ రాకపోయినా రిసీవర్‌ చెవిన పెట్టుకుని మాట్లాడతారు. పాట పాడతారు ‘బడి పంతులు’లో బుల్లి శ్రీదేవి పాడింది.బూచాడమ్మ బూచాడు బుల్లి పెట్టెలో ఉన్నాడుకళ్లకెపుడు కనపడడు కబురులెన్నో చెబుతాడు...అనుబంధాల పాట:పెద్దవాళ్ల సమస్యలు పిల్లలకూ కష్టాలు తెస్తాయి. పిల్లలు చలించిపోతారు. ఆ అనుబంధాల కోసం పరితపిస్తారు. తమ లోపలి భావాలను పాట ద్వారా చెబుతారు. తల్లిదండ్రులను కోల్పోయి చెల్లెలితో మిగిలిన అన్న పాడే ఈ జోలపాట ఎంత ఆర్ద్రమైనది... ‘చిట్టి చెల్లెలు’లో.అందాల పసిపాప అన్నయ్యకు కనుపాపబజ్జోవే... బుజ్జాయి... నేనున్నది నీ కొరకే...నీకన్నా నాకెవరే...‘భార్యాబిడ్డలు’ సినిమాలో కన్నతండ్రయిన అక్కినేనిని దూరం చేసుకుని అతణ్ణి వెతుకుతూ వీధుల్లో తిరుగుతూ అతడి పిల్లలు పాడే పాట... ఇందులో కూడా శ్రీదేవి ఉంది...చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావునీవు లేక దిక్కులేని చుక్కలయ్యాముఎక్కడైనా తల్లిదండ్రులు పిల్లలకు జోకొడతారు. కాని ‘రాము’లో తల్లిదండ్రులకు జోకొడుతూ చిన్నారి కొడుకు పాడే పాట హిట్‌.పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలుకలు రెండుపాటలు పాడి జోకొట్టాలి జోజోజో...ఇక పిల్లలకు ఫ్రెండ్స్‌ అంటే ఇష్టం కదా. స్నేహంలో వారికి అంతరాలు ఉండవు, అభిమానం తప్ప! అందుకే స్నేహాన్ని నిర్వచిస్తూ ‘బాల మిత్రుల కథ’లోని ఈ పాట గొప్పగా ఉంటుంది.గున్నమామిడి కొమ్మ మీద గూళ్లు రెండున్నాయిఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది...పాపం పసివాడు:ఒక పాట... అమ్మానాన్నల కోసం తప్పి పోయిన పిల్లవాడు పరితపిస్తూ పాడే పాట సినిమాను సూపర్‌హిట్‌ చేయగలదు. ‘లాస్ట్‌ ఇన్‌ ద డెజర్ట్‌’ అనే ఇంగ్లిష్‌ సినిమా ఆధారంగా తెలుగులో తీసిన ‘పాపం పసివాడు’ సినిమా చూసిన మహిళా ప్రేక్షకులు కన్నీరు మున్నీరయ్యారు. కారణం తప్పిపోయిన పిల్లాడిలో తమ పిల్లల్ని చూసి ఇలాంటి పరిస్థితి వస్తే అనుకోవడమే. మాస్టర్‌ రాము నటించిన ఈ పాట ఆత్రేయ రాసిన తేలిక మాటల పాట పిల్లల భావోద్వేగాన్ని గొప్పగా చూపుతుంది.అమ్మా చూడాలి... నిన్నూ నాన్నను చూడాలినాన్నకు ముద్దులు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దుర పోవాలి...అంజలి అంజలి అంజలి:ఆ తర్వాత కూడా పిల్లల పాత్రలు, వారి పాటలు కొనసాగాయి. ‘బాల భారతం’ తీశారు. టి.కృష్ణ ‘రేపటి పౌరులు’ సినిమా తీశారు. ‘మణిరత్నం ‘అంజలి’ తీసి హిట్‌ కొట్టారు. గుణశేఖర్‌ ‘బాల రామాయణం’ తీశారు. ‘లిటిల్‌ సోల్జర్స్‌’ పిల్లల కోసం తీసిన చివరి హిట్‌ సినిమాగా నిలిచింది. ‘స్వాతి కిరణం’లో మాస్టర్‌ మంజునాథ్‌ బాల సంగీతకారుడుగా ‘ఆనతినియ్యరా హరా’...లాంటి క్లాసిక్‌ ఇచ్చాడు. ‘మనసంతా నువ్వే’ సినిమాలోని ‘తూనీగా... తూనీగా’ పాట ఇంటింటి పాటైంది. ‘అమ్మ రాజీనామా’, ‘దేవుళ్లు’ తదితర చిత్రాల్లో పిల్లలు పాటలు పాడి మెప్పించారు.అయితే ఆ తర్వాత ఫ్యాక్షన్‌ సినిమాలు వచ్చి తొడ గొట్టే పిల్లలు, కత్తి పట్టే పిల్లలు వచ్చారు. ఇవాళ టీవీల నిండా పిల్లలు అశ్లీల నృత్యాలు చేసే పెద్దల పాటలే తప్ప పిల్లల పాటలంటూ లేకుండా పోయాయి. కనీసం పిల్లలతో పాటు పెద్దలు పాడే పాటలైనా.పిల్లల పాటలు మళ్లీ బతకాలని కోరుకుందాం.ముద్దు ముద్దు నవ్వు... బజ్జోమ్మ నువ్వుతెలుగు సినిమాల్లో పిల్లలు తాముగా పాటలు పాడితే పిల్లల కోసం పెద్దలు తమంతట తాముగా పాడిన పాటలు చాలా ఉన్నాయి. అందరూ ఇష్టపడేవి ఉన్నాయి. ఆ పాటలు ఇప్పటికీ వినపడుతూనే ఉన్నాయి. ‘బంగారు పాప’లో ఎస్వీ రంగారావు అంతటి నిలువెత్తు మనిషి ఒక చిన్నారి పాపను చూసి పాడే ‘తాధిమి తకధిమి తోల్‌బొమ్మ’ పాట ఎందరికో ఇష్టం. ఆర్ద్రమయం. ‘ఖైదీ కన్నయ్య’లో ‘ఈ నిజం తెలుకో తెలివిగా నడుచుకో’ ఇప్పుడు కూడా ప్రతి బాలబాలికలకు బోధ చేసే గీతం. తర్వాతి రోజుల్లో ‘మంచి మనుషులు’లో శోభన్‌బాబు పాడిన ‘ఇది నా మాట విన్నావంటే జీవితమంతా పువ్వుల బాట’ కూడా ఇదే కోవలో హిట్‌గా నిలిచింది. ‘పండంటి కాపురం’లో ‘బాబూ... వినరా అన్నాదమ్ముల కథ ఒకటి’ పాట పిల్లలకు అనుబంధాలు చెప్తే, ‘ఎదగడానికెందుకురా తొందరా ఎదర బతుకంతా చిందర వందర’ అని బాల్యాన్ని అనుభవించాల్సిన వయసులో భవిష్యత్తు గురించి కోచింగ్‌లు తీసుకుంటున్న నేటి బాలల కోసం అన్నట్టుగా ‘అందాల రాముడు’లో అక్కినేని పాడుతారు. ఇక పిల్లల పుట్టిన రోజులకు అందరూ పాడేవారే. ‘వెలుగు నీడలు’లో ‘చిట్టిపొట్టి చిన్నారి పుట్టిన రోజు చేరి మనం ఆడిపాడే పండుగరోజు’లో సావిత్రి హుషారుగా పిల్లవాడితో పాటు గెంతడం కనిపిస్తుంది. ‘బంగారు కలలు’లో ‘పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి’, ‘తాత మనవడు’లో మనవడిని పట్టుకుని అంజలీ దేవి ఉద్వేగంగా పాడే ‘ఈనాడే బాబూ నీ పుట్టిన రోజు’ గొప్ప ఆశీర్వాద వచనం. ఇక పిల్లలను బుజ్జగించే, ఊరడించే పాటలు సినిమాల్లో బోలెడు. గంభీరంగా ఉండే ఎన్‌.టి.ఆర్‌ కూడా పసిపిల్లాడిని చూసి ‘ఆడబ్రతుకు’లో ‘బుజ్జిబుజ్జి పాపాయి.. బుల్లిబుల్లి పాపాయి.. నీ బోసి నవ్వులలో పూచే పున్నవి వెన్నెలలోయి’ అని పాడతాడు. ఇదే పి.బి.శ్రీనివాస్‌ ‘ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు జాజిమల్లె పువ్వు బజ్జొమ్మ నువ్వు’ పాట ‘సత్తెకాలపు సత్తెయ్య’లో చలం గొంతులో పాడతాడు. ఈ హీరో చలమే ‘సంబరాల రాంబాబు’లో చిన్నారి బాబుకు జోల పాడుతూ చందమామను సాయమడుగుతూ ‘మామా.. చందమామా.. వినరావా నా కథ’ అని అందుకుంటాడు. ‘జీవన తరంగాలు’లో శోభన్‌బాబు పాపకు జూ మొత్తం చూపుతూ ‘ఉడతా ఉడతా ఉచ్‌’ పాడటం రేడియో శ్రోతలు ఇప్పుడూ వింటారు. ‘స్వయంకృషి’లో చిరంజీవి ‘పారా హుషార్‌.. పారా హుషార్‌... తూరుపమ్మ ఉత్తరమ్మ పడమరమ్మ దక్షిణమ్మ పారా హుషార్‌’ అని పాడి వీపున కట్టుకున్న చిన్నారికి ఉల్లాసం కలిగిస్తాడు. ‘కలిసి పాడుదాం తెలుగు పాట కలిసి సాగుదాం వెలుగుబాట’ (బలిపీఠం), ‘భారత మాతకు జేజేలు బంగరుభూమికి జేజేలు’ (బడిపంతులు) అని పాడే ఉపాధ్యాయులు ఇప్పటి సినిమాల్లో ఎక్కడ? ఏమైనా ఆ రోజులే వేరు ఆ పాటలే వేరు.

Rashmika Gift Silver To Allu Arjun Before Pushpa 2 Release10
అల్లు అర్జున్‌కి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక

అల్లు అర్జున్ 'పుష్ప 2' రిలీజ్ టెన్షన్‌తో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా డిసెంబర్ 5కి రావాల్సిందే అనే టార్గెట్‍‌తో బిజీబిజీగా ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్స్ కొత్తోళ్లు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం పనిచేస్తున్నారనే రూమర్స్ గురించి పక్కన పెడితే ఇప్పుడు ఓ విషయం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.సినిమా రిలీజ్‌కి మరికొన్ని రోజులు ఉందనగా.. ఇందులోనే హీరోయిన్‌గా చేస్తున్న రష్మిక హీరో అల్లు అర్జున్‌కి క్యూట్ అండ్ స్వీట్ గిఫ్ట్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోని బన్నీ తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ ఫొటో లీక్.. కేసు పెట్టిన 'కన్నప్ప' టీమ్)'ఎవరికైనా వెండి బహుమతిగా ఇస్తే వాళ్లకు అదృష్టం కలిసొస్తుందని మా అమ్మ చెప్పేది. ఈ చిన్న వెండి వస్తువు, స్వీట్స్.. మీకు మరింత అదృష్టం తీసుకొస్తుందని అనుకుంటున్నాను. మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు' అని రష్మిక మందాన్న రాసుకొచ్చింది. 'ఇప్పుడు చాలా అదృష్టం కావాలి డియర్' అని 'పుష్ప 2' గురించి పరోక్షంగా ప్రస్తావించాడు.'పుష్ప' కోసం తొలిసారి అల్లు అర్జున్-రష్మిక కలిసి పనిచేశారు. ఇప్పుడు 'పుష్ప 2' కోసం పాన్ ఇండియా లెవల్లో మరోసారి మ్యాజిక్ చేయబోతున్నారు. మూవీపై అయితే భారీ అంచనాలు ఉన్నాయి. నవంబర్ 17న ట్రైలర్ రిలీజ్ ఉందనే రూమర్స్ వస్తున్నాయి.(ఇదీ చదవండి: డబుల్‌ ఎలిమినేషన్‌.. గంగవ్వతోపాటు హరితేజ కూడా!)

Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
లండన్‌లో ఘోర ప్రమాదం, చావు బతుకుల మధ్య హైదరాబాద్‌ యువతి

ఉపాధికోసం  విదేశాలకు వెళ్లిన యువతిని దురదృష్టం వెంటాడింది.

title
అమెరికా ఎన్నికల్లో ఎన్నారైల సత్తా.. ఎంతమంది గెలిచారంటే!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఊహించని విజయాన్ని నమోదు చేసుకు

title
ఎన్నారైలకు శుభవార్త: యూపీఐతో రోజుకు లక్ష పంపొచ్చు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రవాస భారతీయులకు (ఎన్నారైలు) నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా

title
లండ‌న్ వేదికగా ప్రారంభమైన వరల్డ్ ట్రావెల్ మార్కెట్

నవంబర్ 5-7 వరకు లండన్‌లో జరిగే వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM)లో భారతదేశం పాల్గొంటుంది.ఇన్‌బౌండ్ టూరిజంను మెరుగుపరచడం , ద

title
టాంపలో నాట్స్ బోర్డ్ సమావేశం సంబరాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ

అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్..

Advertisement
Advertisement