Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

ప్రధాన వార్తలు

Indian family hosts wedding as Chinese neighbours hold funeral. Their mutual harmony wins hearts1
ఇది కదా హ్యూమన్‌ స్పిరిట్‌ .. ఓ వైపు పెళ్లి.. మరో వైపు అంత్యక్రియలు

కౌలాలంపూర్‌: నేటి సమాజంలో మంటగలుస్తున్న మానవత్వానికి మచ్చుతునక ఈ ఉదంతం. జూలై 5న మలేషియాలోని నెగెరి సెంబిలాన్ రాష్ట్రంలోని టంపిన్ పట్టణంలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వైపు భారతీయ కుటుంబం వివాహ వేడుకను నిర్వహిస్తుండగా, అదే వీధిలో చైనా కుటుంబం 94 ఏళ్ల మహిళకు అంత్యక్రియలు నిర్వహించింది.చైనా కుటుంబానికి చెందిన వాంగ్ అనే రాజకీయ నాయకుడు తన తల్లి మరణాన్ని ‘జాయ్‌ఫుల్ ఫ్యూనరల్’గా పేర్కొన్నారు. అంటే, వృద్ధాప్యంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మరణించడం చైనా సంస్కృతిలో శుభంగా భావిస్తారు. అయితే, తన తల్లి మరణంతో వాంగ్‌ భారతీయ కుటుంబాన్ని సంప్రదించారు. ‘రాత్రి ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు ఉండవు. మీరు మీ వేడుకను కొనసాగించవచ్చు అని వారికి భరోసా ఇచ్చారు. దీంతో భారతీయ కుటుంబం పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించింది. సంగీతాన్ని తగ్గించి, అతిథులను అంత్యక్రియల ప్రదేశానికి దూరంగా వాహనాలు పార్క్ చేయమని సూచించింది.ప్రస్తుతం ఈ ఘటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇది నిజమైన మలేషియన్ స్పిరిట్ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. సాంస్కృతిక భిన్నత్వం ఉన్నా.. పరస్పర గౌరవం, సానుభూతి ఎలా మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్తాయో ఇది ఒక అద్భుత ఉదాహరణగా నిలిచిందని కామెంట్లు చేస్తున్నారు.

Relief For Vallabhaneni Vamsi In The Supreme Court2
సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట

ఢిల్లీ: సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట లభించింది. మైనింగ్ కేసులో వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను హైకోర్టుకు సుప్రీం కోర్టు తిప్పి పంపించింది. అరెస్టు నుంచి రక్షణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌పై గురువారం.. సుప్రీంకోర్టు విచారణ జరిపింది.హైకోర్టు తమ వాదన వినకుండానే ముందస్తు బెయిల్ ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదించారు. దాంతో కేసును ఏపీ హైకోర్టు మరోసారి విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అరెస్టు నుంచి రక్షణను సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.

Test Cricket Legends: Top 5 Players Most Player Of The Match Awards No Sachin3
సచిన్‌కు చోటు లేదు!.. ఈ లిస్టులో టాప్‌-5లో ఉన్న క్రికెటర్లు వీరే!

టీమిండియా- ఇంగ్లండ్‌ (Ind vs Eng) మధ్య టెస్టు సిరీస్‌.. క్రికెట్‌ ప్రేమికులకు అసలు సిసలైన సంప్రదాయ ఫార్మాట్‌ మజాను అందిస్తోంది. ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఇరుజట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికి మూడు పూర్తయ్యాయి.అయితే, ఈ మూడు టెస్టులు ఆఖరిదైన ఐదో రోజు వరకు ఉత్కంఠగా సాగడం ఒక విశేషమైతే.. అ‍న్నింటిలోనూ ఫలితం కూడా తేలడం మరో విశేషం. లీడ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ మ్యాచ్‌ను టీమిండియా నుంచి లాగేసుకుని ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.ఇక ఎడ్జ్‌బాస్టన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన టీమిండియా సారథి శుబ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ (269), సెంచరీ (161)లతో అదరగొట్టి.. భారత్‌కు ఏకపక్ష విజయం అందించాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిసారి టీమిండియా గెలుపు జెండా ఎగరవేయడంలో కీలక పాత్ర పోషించి ఈ అవార్డు అందుకున్నాడు.అయితే, లార్డ్స్‌ టెస్టులో మాత్రం ఆతిథ్య జట్టు మరోసారి పైచేయి సాధించింది. కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ ఇటు బ్యాట్‌తో.. అటు బంతితో రాణించి.. జట్టును గెలిపించుకున్నాడు. తద్వారా 2-1తో ఆధిక్యంలో నిలిపాడు. ఇలా మూడు టెస్టుల్లో ఒక్కొక్కరు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచారు.మరి టెస్టు ఫార్మాట్లో అత్యధికసార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు అందుకున్న క్రికెటర్ల జాబితాలో టాప్‌-5లో ఉన్నది ఎవరో తెలుసా?!.. సంప్రదాయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల వీరుడి (15921)గా ఉన్న టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ మాత్రం ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం.జాక్వెస్‌ కలిస్‌సౌతాఫ్రికా లెజెండరీ ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కలిస్‌ టెస్టుల్లో అత్యధికంగా 23 సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. తన కెరీర్‌లో 166 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కలిస్‌.. 13289 పరుగులు చేశాడు. ఇందులో 45 శతకాలు, రెండు డబుల్‌ సెంచరీలు ఉన్నాయి.ముత్తయ్య మురళీధరన్‌శ్రీలంక స్పిన్‌ దిగ్గజం టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యధిక వికెట్ల వీరుడు (800). అతడు తన కెరీర్‌లో 133 టెస్టులాడి 19 సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు.వసీం అక్రంపాకిస్తాన్‌ ఐకానిక్‌ ఫాస్ట్‌ బౌలర్‌ వసీం అక్రమ్‌ తన కెరీర్‌లో 104 టెస్టులు ఆడి.. 414 వికెట్లు కూల్చాడు. తన నిలకడైన బౌలింగ్‌తో ఈ స్వింగ్‌ సుల్తాన్‌ పదిహేడు సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.షేన్‌ వార్న్‌ఆస్ట్రేలియా స్పిన్‌ లెజెండ్‌ షేర్‌ వార్న్‌. అంతర్జాతీయ క్రికెట్‌లో 145 టెస్టులు ఆడిన వార్న్‌.. 708 వికెట్లు పడగొట్టాడు. అతడి ఖాతాలోనూ పదిహేడు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు ఉన్నాయి.కుమార్‌ సంగక్కరశ్రీలంక మాజీ కెప్టెన్‌, స్టైలిస్‌ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ కుమార్‌ సంగక్కర తన కెరీర్‌లో 134 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. నిలకడైన ప్రదర్శనలతో శ్రీలంక బ్యాటింగ్‌ లైనప్‌ ప్రధాన పిల్లర్‌గా పేరొందిన సంగక్కర పదహారు సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. సంగక్కర టెస్టుల్లో 38 సెంచరీలు, 11 డబుల్‌ సెంచరీల సాయంతో 12400 పరుగులు సాధించాడు. అ న్న ట్లు చెప్పనే లేదు కదూ! సచిన్‌ తన కెరీర్‌లో పద్నాలుగు సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును గెలుచుకున్నాడు. చదవండి: భారత ఓపెనింగ్‌ జోడీ ప్రపంచ రికార్డు

Supreme Court Orders Hunt For Russian Woman4
రష్యన్‌ మహిళను వెతికి పట్టుకోండి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: భర్తతో విడాకుల కేసు పెండింగ్‌లో ఉన్న సమయంలో ‘కస్టడీ డీల్‌’లో ఉన్న ఐదేళ్ల పిల్లాడితో కనిపించకుండా పోయిన రష్యాకు చెందిన మహిళను వెంటనే వెతికి పట్టుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖను ఆదేశించింది సుప్రీంకోర్టు. కొన్నేళ్ల క్రితం రష్యాకు చెందిన మహిళ విక్టోరియా బసూను భారత్‌కు చెందిన సైకత్‌ బసూ వివాహం చేసుకోగా, ప్రస్తుతం వారి మధ్య విడాకుల కేసు ఢిల్లీ సాకేత్‌ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ సమయంలో విక్టోరియా బసూ కనిపించకుండా పరారైయినట్లు భర్త సైకత్‌ బసూ ఫిర్యాదు చేశాడు. తన భార్య పిల్లాడిని తీసుకుని పరారైనట్లు సైకత్‌.. సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిలో భాగంగా విచారణ చేపట్టిన ధర్మాసనం సదరు మహిళను వెంటనే పట్టుకోవాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో రష్యన్‌ మహిళ వెంట పెట్టుకుని తీసుకుని పోయిన ఆమె కుమారుడ్ని వెంటనే ట్రేస్‌ అవుట్‌ చేయాలని ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించింది. ఇందులో ఎటువంటి జాప్యం లేకుండా త్వరతగతిన పిల్లాడి ఆచూకీని ఛేదించాలని స్పష్టం చేసింది. ఆపై పిల్లాడిని తండ్రి సైకేత్‌కు అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం.. పిల్లాడితో పాటు కనిపించకుండా పోయిన విక్టోరియా బసూ పాస్‌పోర్ట్‌ సీజ్‌ చేయాలని ఆదేశించింది. ఎయిర్‌పోర్ట్‌, నావీ పోర్ట్‌ల్లో అధికారులు ఆ మహిళపై ఓ కన్నేసి ఉంచాలని ఆదేశాల్లో పేర్కొంది ధర్మాసనం. అదే సమయంలో ఆమెపై లుకౌట్‌ నోటీసులు జారీ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. విక్టోరియా బసూ ఎక్కడ ఉందో తెలియదంటూ ఆమె తరఫు న్యాయవాది తెలిపిన క్రమంలో.. సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ‘ ‘ఆమె ఎక్కడ ఉందో మీకు తెలుసు. మీరు మాతో ఆటలు ఆడాలనుకుంటున్నారా?, మీ దగ్గరికి మళ్లీ వస్తాం.. మీరు కాస్త ఆగండి’ అని జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పష్టం చేశారు. ఆమెకు రష్యా ఎంబాసీ అధికారి సాయం చేశారు..తన భార్య పారిపోవడానికి భారత్‌లో ఉన్న రష్యన్‌ ఎంబసీ ప్రతినిధి సాయం చేశారని సైకేత్‌ కోర్టుకు తెలిపారు. విడాకుల కేసు ప్రోసిడింగ్స్‌లో ఉండగా ఢిల్లీలోని రష్యన్‌ ఎంబసీ నుంచి ఆమె పారిపోయిందని భర్త తెలిపారు. ఎంబసీ వెనుక గేటు నుంచి ఆమె వెళ్లిపోయిందని, రష్యన్‌ ఎంబసీ అధికారి ఆమెకు సాయం చేశారని భర్త ఆరోపిస్తున్నాడు. లగేజీ పట్టుకుని మరీ వెళ్లిన ఆమెను సదరు అధికారి పంపించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. రష్యన్‌ ఎంబాసీ అధికారి ఆమెకు సాయం చేయడం తాను చూశానన్నాడు. అ అధికారి ఇళ్లు సోదా చేయడానికి అనుమతి కోరండిరష్యన్ రాయబార కార్యాలయ అధికారితో సంబంధం ఉందని బాధిత భర్త చేసిన ఆరోపణను కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది; ఆమె గుర్తించబడకుండా భవనంలోకి ప్రవేశించడానికి సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ఎవరు అనేది అస్పష్టంగా ంది. ఢిల్లీలోని ఈ అధికారి ఇంటిని సోదా చేయడానికి అనుమతి కోరాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించింది సుప్రీంకోర్టు.విడాకుల కేసు పెండింగ్‌లో ఉన్న కారణంగా ఆ పిల్లాడు మూడు రోజులు తల్లి దగ్గర ఉండాలనేది కస్టడీ డీల్‌. దీనిలో భాగంగా మే 22వ తేదీన పిల్లాడిని తీసుకుంది. అదే తాను పిల్లాడిని చివరిసారి చూడటమని కోర్టుకు తెలిపాడు భర్త సైకేత్‌. భార్య విక్టోరియా బసూ.. జూలై 7 నుంచి పిల్లాడితో సహా కనిపించకుండా పోయిందని సైకేత్‌ బసూ కోర్టుకు తెలిపారు.

YSRCP Leader Botsa Satyanarayana Takes On Chandrababu Govt5
‘వాగ్దానాలకు అతీలేదు గతి లేదు.. మందు కావాలని మాత్రం ఆలోచించారు’

పశ్చిమ గోదావరి జిల్లా: కూటమ ఏడాది పాలనలో ఇచ్చిన హామీలకు చేసిన పాలనకు పొంతన లేదని వైఎస్సార్‌సీపీ ఉయగోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్. బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. జిల్లాలోని ఉండి నియోజకవర్గం ఇంచార్జ్‌ పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో బాబు షూరిటీ -మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు, నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళి కృష్ణంరాజు, కన్వీనర్ ఉమాబాల, మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు , ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, భీమవరం నియోజకవర్గ ఇంచార్జ్‌ చిన్నమిల్లి వెంకటరాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు బొత్స మాట్లాడుతూ.. ‘ కూటమి నేతల మెడలు వంచి పాలన చేయించాలనే ఉద్దేశంతోనే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టాము. ఐదు కోట్ల మందిపై ప్రమాణం చేసి భవిష్యత్తు గ్యారెంటీ అంటూ బాండ్లు ఇచ్చారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇచ్చిన వాగ్దానాలను కూటమీ ప్రభుత్వం నెరవేర్చలేదు. మూడు సిలిండర్లని ఒక సిలిండర్ ఇచ్చారు. సూపర్ సిక్స్ హామీల గురించి అడిగితే నాలికమందం అంటున్నాడు చంద్రబాబు. చంద్రబాబు మాయగాడు.. మాయగాడికి తోడు ఒక మోసగాడు తోడయ్యాడు. ఎప్పుడు ఎన్నికల్లో గెలిచిన ప్రజలను మోసం చేయడమే వారి ఉద్దేశం. ప్రజలకు ఐదువేళ్లు నోట్లోకి వెళ్లడం కావాలి.. మందు కాదు. చంద్రబాబు ప్రజలకు మందే కావాలని ఆలోచించాడు. రైతులకు పెట్టుబడి సాయం ఇప్పటి వరకు ఇవ్వలేదుచంద్రబాబు 100 అబద్ధాలు ఆడితే లోకేష్ 200 అబద్దాలు ఆడుతున్నాడు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలకు అతీలేదు గతి లేదు. అడిగితే ఒకరేమో నాలికమందమని ఇంకో ఆయన ఏమో తాటతీస్తాను మక్కెలు ఇరగ కొడుతాను అంటున్నాడు. ఐదు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు మానేశారు ఈ రాష్ట్రంలో.. ఇది వాస్తవం. ఆడబిడ్డ నిధి 1500.. ఎప్పటినుండి ఇస్తారు. P-4 పేరుతో అభివృద్ధి పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు.’ అని బొత్స మండిపడ్డారు.

Indian MEA responds to Nimisha Priya case6
‘నిమిషకు న్యాయపరమైన సాయం అందిస్తున్నాం’

న్యూఢిల్లీ: యెమెన్‌లో చివరి నిమిషంలో మరణశిక్ష వాయిదా పడ్డ కేరళ నర్సు నిమిష కేసు అంశానికి సంబంధించి భారత విదేశాంగ శాఖ స్పందించింది. నిమిష కేసులో అవసరమైన న్యాయ సహాయాన్ని అందిస్తున్నామని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం ప్రయత్నాలే వల్లే నిమిష మరణశిక్ష వాయిదా పడిందని విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ పేర్కొన్నారు. నిమిష తరఫున లాయర్‌ను కూడా నియమించినట్లు ఆయన తెలిపారు. సదరు లాయర్‌ ఆ ఫ్యామిలీతో రెగ్యులర్‌గా ఫాలో చేస్తూ అందుబాటులో అవసరమైన సలహాలు ఇస్తున్నారన్నారు. అలాగే యెమెన్‌ అధికారులతో కూడా లాయర్‌ టచ్‌లో ఉంటూ కేసుకు సంబంధించిన విషయాల్ని చూసుకంటున్నారని రణధీర్‌ జైశ్వాల్‌ పేర్కొన్నారు.కాగా, యెమెన్‌లో కేరళ నర్సు నిమిషా ప్రియాకు భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఆమె మరణ శిక్షను వాయిదా వేస్తున్నట్లు యెమెన్‌ ప్రభుత్వం ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం.. యెమెన్‌ సనా జైలులో బుధవారం(జూలై 16వ తేదీ) మధ్యాహ్నాం నిమిషకు శిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో మరణశిక్ష వాయిదా పడింది.2008లో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్‌ వెళ్లిందామె. 2011లో భారత్‌కు వచ్చి వివాహం చేసుకుంది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత ఆమె మళ్లీ యెమెన​ వెళ్లింది. అక్కడి చట్టాల ప్రకారం.. తలాబ్‌ అబ్దో మహ్దీ అనే వ్యక్తితో కలిసి క్లినిక్‌ తెరిచింది. అయితే తలాబ్‌ తనను వేధించాడంటూ ఆమె 2016లో పోలీసులను ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో తలాబ్‌ వద్ద చిక్కుకున్న తన పాస్‌పోర్టును దొంగలించేందుకు అతనికి మత్తుమందిచ్చింది. ఓవర్‌డోస్‌​ కావడంతో అతను మరణించాడు. శవాన్ని ఓ వాటర్‌ ట్యాంకర్‌లో పడేసి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి.

Babu Mohan Left in Tears over Remembering Kota Srinivasa Rao7
'మూడేళ్లుగా గోసపడ్డ కోటన్న.. నిల్చోలేడు, కూర్చోలేడు, నడవలేడు'

తండ్రిగా, విలన్‌గా, విలక్షణ నటుడిగా, రాజకీయ నాయకుడిగా, కామెడీ విలన్‌గా.. తెలుగు ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao). సినీ చరిత్రలో తనకంటూ ఓ పేజీ లిఖించుకున్న ఆయన జూలై 13న ఇక సెలవంటూ వీడ్కోలు తీసుకున్నారు. ఆయనతో కలిసి ఎన్నో సినిమాలు చేసిన నటుడు బాబూమోహన్‌.. కోటగారు ఇక లేరన్న విషాదాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.చివరిరోజుల్లో తీవ్రబాధ..తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాబూ మోహన్‌ (Babu Mohan) మాట్లాడుతూ.. ఇద్దరం ఆర్టిస్టులమే అయినా మాకు తెలియకుండానే అన్నదమ్ములమైపోయాం. ఏరా, ఎక్కడున్నావ్‌? వారమైంది, ఒకసారి రారా అని పిలిచేవారు. అవును, వెళ్లి చూడాలనుకునేవాడిని. కానీ ఇప్పుడా బంధం తెగిపోయింది. పాపం, కోటన్న చివరి రోజుల్లో కాలి నొప్పితో బాధపడ్డాడు. బాత్రూమ్‌లో కాలి జారి కిందపడటం.. నొప్పి ఉన్న కాలికే మళ్లీ గాయం కావడంతో చాలా ఇబ్బందిపడ్డాడు. నడవలేడు, కూర్చోలేడు, నిలబడలేడు. రెండు, మూడు సంవత్సరాల నుంచి అదే గోస.అలాంటి మరణమే నాకూ రావాలి ఒక విషయంలో మాత్రం దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పూర్తిగా మంచానపడి, సపర్యలు ఎంతకాలం చేయాలని ఇంట్లోవాళ్లే అసహ్యించుకునే స్థాయికి భగవంతుడు ఆయన్ని తీసుకెళ్లనివ్వలేదు. కోటన్న నిద్రలోనే కన్నుమూశాడు. అలాంటి చావే నాకూ కావాలి. నీలాంటి మరణమే నాకూ ఇవ్వమని ఆ దేవుడికి చెప్పమని కోటన్నను వేడుకుంటున్నాను. మా ప్రయాణం ఎలా మొదలైందంటే.. బొబ్బిలి రాజా మూవీతో మా కాంబినేషన్‌ మొదలైంది. మామగారు చిత్రంతో బాగా ఫ్రెండ్సయ్యాం. చనిపోవడానికి ఒకరోజు ముందే..సెట్‌లో నాకు గోరుముద్దలు తినిపించేవాడు. అన్న చనిపోవడానికి ఒకరోజు ముందే ఫోన్‌ చేసి మాట్లాడాను. షూటింగ్‌ మొదలైంది, మళ్లీ చేస్తానని కాసేపాగి కాల్‌ చేశా.. అప్పుడు అన్న నిద్రపోయాడని చెప్పారు. సరే, మళ్లీ నిద్రలేచాక ఫోన్‌ చేయమన్నాను. తర్వాతి రోజు తెల్లవారుజామున 5 గంటలకు కోటన్న చనిపోయారని ఫోన్‌ వచ్చింది. ఆ ఫోన్‌ రాగానే నాకు కన్నీళ్లు ఆగలేదు అంటూ బాబూ మోహన్‌ ఏడ్చేశాడు.చదవండి: జబర్దస్త్‌ పవిత్రకు ప్రపోజ్‌ చేసిన ప్రిన్స్‌ యావర్‌.. అబ్బో!

Injury blow to India? Arshdeep singh sports tape on bowling han8
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. టీమిండియాకు భారీ షాక్‌

లార్డ్స్ టెస్టులో హార్ట్ బ్రేకింగ్ ఓట‌మి త‌ర్వాత ఆతిథ్య ఇంగ్లండ్‌తో మ‌రో ర‌స‌వ‌త్త‌ర పోరుకు టీమిండియా సిద్ద‌మైంది. మాంచెస్ట‌ర్ వేదిక‌గా భార‌త్‌-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా త‌మ స‌న్నాహాకాల‌ను ప్రారంభించింది. గురువారం ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం నెట్స్‌లో భారత ఆటగాళ్లు చెమటోడ్చారు.అర్ష్‌దీప్‌కు గాయం..!అయితే ఈ మ్యాచ్‌కు ముందు భార‌త జ‌ట్టుకు ఎదురు దెబ్బ త‌గిలింది. నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుండ‌గా యువ పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ చేతి వేలికి గాయ‌మైన‌ట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా త‌మ రిపోర్ట్‌లో పేర్కొంది. బంతి చేతి వేలికి తాక‌డంతో రక్తం కూడా వచ్చినట్లు తెలుస్తోంది.దీంతో అతడి చేతి వేలికి ఫిజియో టేప్ వేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్‌డెష్కాట్ కూడా ధ్రువీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్.. టెస్టుల్లో మాత్రం ఇంకా భారత్ తరపున ఆడలేదు.ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికైనప్పటికి తొలి మూడు టెస్టులకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఒకవేళ నాలుగో టెస్టుకు జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇస్తే.. అర్ష్‌దీప్‌కు తుది జ‌ట్టులోకి చోటు ద‌క్కే అవ‌కాశ‌ముంది. కానీ ఇంత‌లోనే అర్ష్‌దీప్ గాయప‌డ‌డం టీమ్‌మెనెజ్‌మెంట్‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. మ‌రోవైపు లార్డ్స్ టెస్టులో గాయప‌డిన వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ ఫిట్‌నెస్‌పై ఇంకా క్లారిటీ లేదు.చదవండి: సిరాజ్ 3 సిక్సర్లతో గెలిపిస్తాడని అనుకున్నా!.. జోకులు ఆపండి: అశ్విన్‌

Janasena Rayudu Sister Keerthi Meets Srikalahasti DSP9
‘మా అన్న చనిపోతే పవన్‌ కనీసం పలకరించలేదు’

తిరుపతి జిల్లా: తన అన్న హత్య చేసిన కేసులో తమకు న్యాయం జరగాలని మరొకసారి స్పష్టం చేసింది శ్రీనివాసులు అలియాస్‌ రాయుడు సోదరి కీర్తి. ఈరోజు(గురువారం జూలై 17) శ్రీకాళహస్తి డీఎస్పీని కలిసిన కీర్తి.. తమకు న్యాయం జరగాలని కోరడంతో పాటు రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు డీస్పీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. ‘ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మాకు రక్షణ కల్పించాలి కోరాం. చిన్న చిన్న విషయాలకు పవన్ కల్యాణ్ స్పందిస్తారు, మా అన్న చనిపోతే కనీసం పలకరింపు లేదు. పవన్ కళ్యాణ్ దగ్గరికి అయినా మమ్మల్ని తీసుకువెళ్ళండి. హత్య జరిగిన తర్వాత మాకు రూ. 30 లక్షలు ఆఫర్ చేశారు. మేము డబ్బులకు లొంగే వాళ్ళము కాదు, మాకు న్యాయం జరగాలి. సోషల్ మీడియాలో మా అన్నపై ఏవో విష ప్రచారం చేస్తున్నారు. ఈ కేసులో చాలా మంది ఉన్నారు..వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి’ అని డిమాండ్‌ చేసింది. కాగా, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జి కోట వినుత మాజీ డ్రైవర్‌ శ్రీనివాసులు అలియాస్‌ రాయుడు దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, రాయుడు హత్యపై అటు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌, ఇటు కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక, తన మనవడు రాయుడు హత్యపై రాజేశ్వరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై పవన్‌ కల్యాణ్‌ స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.రాయుడు అమ్మమ్మ రాజేశ్వరమ్మ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘నా మనవడిని ఏం చేయవద్దని కాళ్లు పట్టుకుని వేడుకున్నాను. కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు. హత్యకు ముందు ఐదుసార్లు పంచాయితీ జరిగింది. ఏ మాత్రం కనికరం లేకుండా నా మనవడిని హత్య చేశారు’ అని రాజేశ్వరమ్మ కన్నీటి పర్యంతమైంది.‘అయ్యా పవన్‌.. నా మనవడి కోసం కాళ్లు పట్టుకున్నా సామీ’

Post Office To Freeze Inactive Matured Accounts Under PPF NSC RD And Others10
పోస్టాఫీసుల్లో కొత్త రూల్స్‌.. ఆ అకౌంట్లన్నీ ఫ్రీజ్‌

చిన్న మొత్తాల పొదుపు పథకాల (ఎస్‌సీఎస్) ఖాతాలకు తపాలా శాఖ కొత్త నిబంధనలను జారీ చేసింది. వీటికి అనుగుణంగా లేని ఖాతాలను మూసివేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మెచ్యూరిటీ పీరియడ్ ముగిసిన తర్వాత మూడేళ్లు దాటినా కూడా క్లోజ్ చేయని ఖాతాలను అధికారులు ఇప్పుడు స్తంభింపజేయనున్నారు.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్ఎస్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్‌సీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (ఎంఐఎస్), పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (టీడీ), పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) వంటి చిన్న పొదుపు పథకాల ఖాతాలకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి.మూడేళ్ల మెచ్యూరిటీ తర్వాత కూడా క్లోజ్ చేయని స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాలను స్తంభింపజేస్తూ తపాలా శాఖ జూలై 15న ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్వెస్టర్ల సొమ్మును కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం, ఇన్ యాక్టివ్, మెచ్యూరిటీ తీరిపోయిన పొదుపు పథకాల అకౌంట్లను ఖాతాదారులు అధికారికంగా పొడిగించుకోకపోతే పోస్టాఫీస్ ఇప్పుడు సంవత్సరానికి రెండుసార్లు గుర్తించి స్తంభింపజేస్తుంది.డిపాజిటర్లు కష్టపడి సంపాదించి పొదుపు చేసుకున్న డబ్బుకు భద్రతను మరింత పెంచడానికి ఈ ఫ్రీజింగ్ యాక్టివిటీని సంవత్సరానికి రెండుసార్లు నిరంతర చక్రంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు పోస్టల్‌ డిపార్ట్మెంట్ తెలిపింది. ఏటా జనవరి 1, అలాగే జూలై 1న రెండు సార్లు ఈ ప్రక్రియ జరగనుంది. ఈ తేదీల నుంచి 15 రోజుల్లో ఇలాంటి ఖతాలను గుర్తించడం, స్తంభింపజేయడం పూర్తవుతుంది. ఏటా జూన్ 30, డిసెంబర్ 31 నాటికి మూడేళ్ల మెచ్యూరిటీ పూర్తి చేసుకున్న ఖాతాలను గుర్తించి స్తంభింపజేస్తామని తపాలా శాఖ తెలిపింది.మెచ్యూరిటీ తీరిన తమ పొదుపు పథకాల ఖాతాలు స్తంభింపజేయకుండా ఉండటానికి, ఖాతాదారులు డిపాజిట్ పథకాన్ని అధికారికంగా పొడిగించడానికి అభ్యర్థనలను సమర్పించాల్సి ఉంటుంది. ఒక వేళ పొడిగింపు వద్దనుకుంటే ఖాతా మూసివేతకు దరఖాస్తు చేయాలి. కాగా 2025-26 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి అన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన కొద్ది రోజులకే ఈ నిబంధనలు వచ్చాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement