'సోనియా భిక్షమేస్తే కిరణ్ సీఎం అయ్యారు' | kiran kumar reddy has no right for ruling, blames ponnam prabhakar | Sakshi
Sakshi News home page

'సోనియా భిక్షమేస్తే కిరణ్ సీఎం అయ్యారు'

Sep 27 2013 6:27 PM | Updated on Jul 29 2019 5:31 PM

'సోనియా భిక్షమేస్తే కిరణ్ సీఎం అయ్యారు' - Sakshi

'సోనియా భిక్షమేస్తే కిరణ్ సీఎం అయ్యారు'

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ భిక్షమేస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు.

కరీంనగర్:ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ భిక్షమేస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు. సీల్డ్ కవర్ సీఎంకు ప్రజల బాధలు ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. తెలంగాణపై ఏర్పాటుకు యూపీఏ నిర్ణయాన్ని సీఎం అడ్డుకుంటూ కరుడుగట్టిన ప్రజాస్వామ్య వ్యతిరేకిలా తయారయ్యారని ఆయన దుయ్యబట్టారు. సీఎం కిరణ్ నిమిషం కూడా అధికారంలో కొనసాగే హక్కులేదని పొన్నం విమర్శించారు.

 

సీమాంధ్ర ఉద్యమానికి స్పాన్సరర్‌గా, సమైక్యాంధ్ర జేఏసీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని తాము ముఖ్యమంత్రిగా చూడడం లేదని గతంలో ఎంపీ పొన్న ప్రభాకర్ విమర్శించిన సంగతి తెలిసిందే. మరొకమారు సీఎం వ్యవహారశైలిని పొన్నం తప్పుబట్టారు. ప్రజలు బాధలు పట్టని కిరణ్ సీఎం సీట్లో ఎలా కూర్చుంటున్నారని ప్రశ్నించారు. సీల్డ్ కవర్ సీఎంకు ప్రజా సమస్యలు పట్టవనడానికి కిరణ్ అనుసరిస్తున్నతీరే నిదర్శమన్నారు.

 



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement