నేడు, రేపు సౌర విద్యుత్ ప్రదర్శన | Today and tomorrow, the performance of solar power | Sakshi
Sakshi News home page

నేడు, రేపు సౌర విద్యుత్ ప్రదర్శన

Dec 14 2013 4:48 AM | Updated on Sep 5 2018 2:06 PM

తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో సౌర విద్యుత్ వ్యవస్థపై ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్టు సంస్థ సీఎండీ ఎం.వి.శేషగిరిబాబు ‘సాక్షి’కి తెలిపారు.

సాక్షి, విశాఖపట్నం: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో సౌర విద్యుత్ వ్యవస్థపై ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్టు సంస్థ సీఎండీ ఎం.వి.శేషగిరిబాబు ‘సాక్షి’కి తెలిపారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సీతమ్మధారలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఈ ప్రదర్శన ఉంటుందన్నారు. ప్రదర్శనలో సౌర విద్యుత్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సులు కూడా నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
 
 జిల్లాలోని నెడ్‌క్యాప్‌తోపాటు వివిధ ప్రయివేటు సంస్థల పరికరాలు ఇక్కడి ప్రదర్శనలో ఉంటాయన్నారు. గృహ కేటగిరీలో 3 కేవీ సామర్థ్యం వరకు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం రాయితీ ప్రకటించాయన్నారు. దీన్ని గృహ వినియోగదారులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement