ఎన్నికల ‘సిత్రాలు’ | leaders move to different steps for elections | Sakshi
Sakshi News home page

ఎన్నికల ‘సిత్రాలు’

Apr 13 2014 2:54 AM | Updated on Mar 29 2019 9:24 PM

అమ్మా... టీడీపీ నుంచి పోటీ చేస్తున్న రమణన్న కూడా మనోడే. మనమంతా ఒకటే.. జర ఇటు రండమ్మా..’

అమ్మా.. జర ఇట్రాండి..
 
 ‘అమ్మా... టీడీపీ నుంచి పోటీ చేస్తున్న రమణన్న కూడా మనోడే. మనమంతా ఒకటే.. జర ఇటు రండమ్మా..’ అంటూ కరీంనగర్ జిల్లా జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్ మండల బీజేపీ అధ్యక్షుడు తురగ శ్రీధర్‌రెడ్డి అదే మండలంలోని ఒడ్డెలింగాపూర్‌లో ప్రజలను కోరారు. టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా జగిత్యాల నియోజకవర్గంలో ఎల్.రమణ పోటీ చేస్తుండగా శనివారం ప్రచారానికి ఒడ్డెలింగాపూర్ వెళ్లారు. అక్కడ ప్రజలెవరూ రాకపోవడంతో ఓ చెట్టు కింద ఇలా కూర్చున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి స్థానికులను ఇలా పిలిచి పోగు చేయగా కొంత మంది రావడంతో రమణ తన ఉపన్యాసం మొదలుపెట్టారు.
 - న్యూస్‌లైన్, రాయికల్
 
 నాడు ‘జై’ఏసీ... నేడు జేఏ‘ఛీ’
 


 గాంధీభవన్‌లో పార్టీలో చేరడానికి వచ్చిన ఓయూ జేయేసీ కన్వీనర్ కొనగాల మహేష్‌ను మీడియా సమావేశం జరుగుతుందని కిందకు దిగమని తోసివేస్తున్న జైరాం రమేష్. చిత్రంలో ఆవేశంతో ఊగిపోతున్న పొన్నాల లక్ష్మయ్య.    
 -ఫొటో: లావణ్యకుమార్
 
 దామన్నా.. బ్యాగులో ఏముందన్నా
 
 ఎన్నికల వేళ ఒక్కో నాయకుడికి ఒక్కో సెంటిమెంట్.
 రాంరెడ్డి దామోదర్‌రెడ్డి స్టైలు మాత్రం వేరు. ప్రతి ఎన్నికల్లో నామినేషన్ మొదలు.. ఓట్ల లెక్కింపు వర కూ ప్రచారంలో ఆయన భుజాన బ్యాగ్ ఉండాల్సిందే. ఈసారి పాత బ్యాగు స్థానంలో
 కొత్త బ్యాగు వచ్చింది. ఈ బ్యాగులో ఏముందో మాత్రం ఎవరికీ తెలియదట..    
 - న్యూస్‌లైన్ భానుపురి(సూర్యాపేట)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement