ఆ రోజు కారును నేను నడపలేదు: సల్మాన్‌ | Salman khan reveals in hit and run case | Sakshi
Sakshi News home page

ఆ రోజు కారును నేను నడపలేదు: సల్మాన్‌

Apr 6 2016 5:21 PM | Updated on Sep 2 2018 5:24 PM

ఆ రోజు కారును నేను నడపలేదు: సల్మాన్‌ - Sakshi

ఆ రోజు కారును నేను నడపలేదు: సల్మాన్‌

ప్రముఖ బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు.

ఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశాడు. ఈ  కేసు విషయంలో సల్మాన్‌ వివరణ ఇచ్చుకున్నాడు. తాను ఆ రోజు రాత్రి కారును నడపలేదని, డ్రైవరే కారును నడపినట్టు తెలిపాడు. కారు డ్రైవర్‌ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్‌ చేయలేదని చెప్పాడు.

కాగా, 2002లో ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్నవారిపై నుంచి సల్మాన్ కారు నడపడంతో ఒ వ్యక్తి మరణించగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఆ సమయంలో సల్మాన్ మోతాదుకు మించి మద్యం సేవించాడని రుజువైన కారణంగా ముంబై సెషన్స్ కోర్టు అతడికి  ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement