
హైదరాబాద్: ఆధార్ సమాచారానికి సరైన భద్రత లేదనీ, సైబర్ దాడి జరిగితే ఊహించని నష్టం జరుగుతుందంటూ బుధవారం మీడియాలో వచ్చిన వార్తకు, తమకు ఏ సంబంధం లేదని ఆర్‌బీఐ అనుబంధ ఐడీఆర్‌బీటీ (ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నీలజీ) చెప్పింది.
కొన్ని మీడియా సంస్థలు ఆ వార్తలోని అంశాలను ఆర్‌బీఐ పరిశోధకులకు అపాదించాయనీ, సదరు నివేదికతో ఆర్‌బీఐకిగానీ, తమకుగానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. నివేదిక తయారుచేసిన అధ్యాపకుడు ఎస్ అనంత్ తమ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా మాత్రమే పనిచేస్తున్నారని ఐడీఆర్‌బీటీ ఒక ప్రకటనలో వెల్లడించింది.