
భూమా బ్రహ్మానంద రెడ్డి
సాక్షి, కర్నూలు : మున్సిపల్ అధికారులపై నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మావతి నగర్‌లో ఆక్రమణలు తొలగింపునకు చర్యలు చేపట్టిన మున్సిపల్ అధికారులను సోమవారం ఆయన అడ్డుకున్నారు. దీంతో అధికారులకు ఆయనకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గత ఉప ఎన్నికల సమయంలో ఇల్లు, షాపులు పగలగొడితే మాట్లాడని బ్రహ్మానంద రెడ్డి ఇప్పుడు జోక‍్యం చేసుకోవడం ఏమిటని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.