తెలుగుతేజాలు పారుపల్లి కశ్యప్ ఫైనల్కు దూసుకెళ్లి పతకం ఖాయం చేసుకోగా, పీవీ సింధుకు సెమీస్లో నిరాశ ఎదురైంది.
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తెలుగుతేజాలు పారుపల్లి కశ్యప్ ఫైనల్కు దూసుకెళ్లి పతకం ఖాయం చేసుకోగా, పీవీ సింధుకు సెమీస్లో నిరాశ ఎదురైంది.
శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో కశ్యప్ 18-21, 21-17, 21-18 స్కోరుతో ఇంగ్లండ్ షట్లర్ రాజీవ్ ఓసెఫ్పై పోరాడి గెలిచాడు. గంటా 23 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో కశ్యప్ మూడు గేమ్లలో మ్యాచ్ను సొంతం చేసుకుని ఫైనల్ బెర్తు దక్కించుకున్నాడు. కాగా మహిళల సింగిల్స్ సెమీస్లో యువ సంచలనం సింధు 20-22, 20-22 స్కోరుతో కెనడా షట్లర్ లీ చేతిలో పోరాడి ఓడింది. 54 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో సింధు చెమటోడ్చినా ఫలితం దక్కలేదు. కాంస్య పతకం కోసం జరిగే మ్యాచ్లో సింధు తలపడనుంది.