‘బీజేపీపై రాహుల్‌ కొట్లాడగలరా’ | Kavitha Fires On Rahul Gandhi And narendra Modi | Sakshi
Sakshi News home page

‘బీజేపీపై రాహుల్‌ కొట్లాడగలరా’

Nov 30 2018 4:17 PM | Updated on Nov 30 2018 4:17 PM

Kavitha Fires On Rahul Gandhi And narendra Modi - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలకు తెలంగాణపై సరైన అవగహన లేక అవాస్తవాలు మాట్లాడుతున్నారని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో 84 వేల ఉద్యోగాల భర్తికి నోటిపికేషన్‌ ఇచ్చామని, 27వేల ఉద్యోగాలను భర్తీ చేశామని ఆమె వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ చేపట్టామని, దాంతో భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆమె నిజామాబాద్‌లో మాట్లాడుతూ.. తెలంగాణ గురించి రాహుల్‌ గాంధీ అవాస్తవాలు మాట్లాడం సిగ్గుచేటని విమర్శించారు.

పసుపు బోర్డుపై మోదీ ఒక్కమాట కూడా మాట్లాడలేదని.. రాహుల్‌ గాంధీ దానిపై కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. రాహుల్‌, సోనియా ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథి, రాయ్‌బరేలిలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయని పేర్కొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు, ముస్లింలకు రిజర్వేషన్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలను రాహుల్‌ పార్లమెంట్‌ చర్చకు తెగలరా? వాటిపై బీజేపీతో కొట్లాడగలరా? అని కవిత ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement