28 Degree Celsius Movie
-
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
నవీన్ చంద్ర, షాలిని జంటగా నటించిన చిత్రం '28 డిగ్రీస్ సెల్సియస్'(28°C Movie).. 2025 ఏప్రిల్ 4న విడుదలైన ఈ చిత్రం సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ థ్రిల్లర్ చిత్రాన్ని మేకర్స్ విడుదల చేశారు. పొలిమేర సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న దర్శకుడు డా. అనిల్ విశ్వనాధ్ ఆరేళ్ళ క్రితం నవీన్ చంద్రతో ఈ మూవీని తెరకెక్కించారు. అయితే, ఈ మూవీ కరోనాకు ముందే రిలీజ్ కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. ఈ సినిమాను వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్సైడ్ సినిమాస్, జెనస్ స్టూడియోస్ బ్యానర్లపై సాంబకుల సాయి అభిషేక్ నిర్మించారు.హారర్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన '28 డిగ్రీస్ సెల్సియస్' చిత్రంలో ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. చనిపోయిన వాళ్లు మళ్లీ తిరిగొస్తారా? అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ తాజాగా 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో(Amazon Prime Video) స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం నెలరోజుల్లోనే ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది.కథేంటంటే..?కార్తీక్(నవీన్ చంద్ర)కి మెడిసిన్ చదువుతున్న సమయంలో అంజలి(షాలిని వడ్నికట్టి) పరిచయమై ప్రేమలో పడతాడు. కార్తీక్ అనాథ, వేరే కులం కావడంతో అంజలి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో అంజలి ఇంట్లోంచి వచ్చేసి కార్తీక్ ని పెళ్లి చేసుకుంటుంది. అయితే అంజలికి బాడీ టెంపరేచర్ కి సంబంధించిన ఓ ఆరోగ్య సమస్య తలెత్తుతుంది. అంజలి బాడీ 28 డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే బాగుంటుంది. అంతకంటే పెరిగినా, తగ్గినా కాసేపటికే చనిపోతుంది. అంజలి ట్రీట్మెంట్ కోసం కార్తీక్ తనని జార్జియా తీసుకెళ్తాడు. అక్కడ ఇద్దరూ ఓ హాస్పిటల్ లో పనిచేస్తూనే అంజలికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అనుకోకుండా ఓ రోజు కార్తీక్ వచ్చేసరికి ఇంట్లో అంజలి చనిపోయి ఉంటుంది. అంజలి చనిపోయిన బాధలో కార్తీక్ తాగుడుకు బానిస అవుతాడు. కానీ ఆ ఇంట్లో అంజలి ఆత్మ తిరుగుతుందని అనుమానాలు వచ్చేలా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అసలు అంజలి ఎలా చనిపోయింది? నిజంగానే అంజలి ఆత్మ వస్తుందా? కార్తీక్ మళ్ళీ మాములు మనిషి అవుతాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
‘28 డిగ్రీస్ సెల్సియస్’ మూవీ రివ్యూ
పొలిమేర సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న దర్శకుడు డా. అనిల్ విశ్వనాధ్ ఆరేళ్ళ క్రితం నవీన్ చంద్రతో తీసిన ఓ లవ్ థ్రిల్లర్ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసాడు. అప్పుడెప్పుడో తెరకెక్కిన 28 డిగ్రీస్ సెల్సియస్ (28°C) అనే సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ ఇప్పుడు రిలీజయింది. పొలిమేర డైరెక్టర్ ఫస్ట్ సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం.కథేంటంటే..?కార్తీక్(నవీన్ చంద్ర)కి మెడిసిన్ చదువుతున్న సమయంలో అంజలి(షాలిని వడ్నికట్టి) పరిచయమై ప్రేమలో పడతాడు. కార్తీక్ అనాథ, వేరే కులం కావడంతో అంజలి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో అంజలి ఇంట్లోంచి వచ్చేసి కార్తీక్ ని పెళ్లి చేసుకుంటుంది. అయితే అంజలికి బాడీ టెంపరేచర్ కి సంబంధించిన ఓ ఆరోగ్య సమస్య తలెత్తుతుంది. అంజలి బాడీ 28 డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే బాగుంటుంది. అంతకంటే పెరిగినా, తగ్గినా కాసేపటికే చనిపోతుంది. అంజలి ట్రీట్మెంట్ కోసం కార్తీక్ తనని జార్జియా తీసుకెళ్తాడు. అక్కడ ఇద్దరూ ఓ హాస్పిటల్ లో పనిచేస్తూనే అంజలికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అనుకోకుండా ఓ రోజు కార్తీక్ వచ్చేసరికి ఇంట్లో అంజలి చనిపోయి ఉంటుంది. అంజలి చనిపోయిన బాధలో కార్తీక్ తాగుడుకు బానిస అవుతాడు. కానీ ఆ ఇంట్లో అంజలి ఆత్మ తిరుగుతుందని అనుమానాలు వచ్చేలా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అసలు అంజలి ఎలా చనిపోయింది? నిజంగానే అంజలి ఆత్మ వస్తుందా? కార్తీక్ మళ్ళీ మాములు మనిషి అవుతాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ?ముందునుంచే ఈ సినిమాని ఆరేళ్ళ క్రితం సినిమా అని ప్రమోట్ చేసారు. దీంతో ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే మంచిది. ఇప్పుడంటే థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి కానీ ఆరేళ్ళ క్రితం ఒక లవ్ స్టోరీతో థ్రిల్లర్ తీయడం కొత్తే. ఒక మనిషికి ఏదో హెల్త్ సమస్య ఉండటం అనుకోకుండా వాళ్ళు చనిపోవడం, వాళ్ళు చనిపోయాక ఎలా చనిపోయారు అని థ్రిల్లింగ్ గా సాగే సినిమాలు చాలానే వచ్చాయి. ఇది కూడా అదే కోవలో థ్రిల్లింగ్ తో పాటు కాస్త హారర్ అనుభవం కూడా ఇస్తుంది(28 Degree Celsius Movie Review).ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీతోనే సాగుతుంది. లవ్ స్టోరీ మాత్రం కాస్త బోర్ కొడుతుంది. లవ్ సీన్స్, డైలాగ్స్ రొటీన్ అనిపిస్తాయి. హీరోయిన్ కి ఆరోగ్య సమస్య ఉందని తెలిసిన దగ్గర్నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్ కి హీరోయిన్ చనిపోవడంతో సెకండ్ హాఫ్ ఏంటి అని ఇంట్రెస్ట్ నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం హారర్ థ్రిల్లర్ లా ఆసక్తిగా చూపించి కాస్త భయపెడతారు కూడా. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది. అక్కడక్కడా కామెడీ ట్రై చేసినా అంతగా పండలేదు.ఎవరెలా చేసారంటే..? నవీన్ చంద్ర ప్రేమ కథలో, భార్య చనిపోతే బాధపడే పాత్రలో బాగా నటించాడు. షాలినీ వడ్నికట్టి అందాల ఆరబోతకు దూరంగా ఉండి సింపుల్ గా పద్దతిగా కనిపిస్తూనే నటనతో మెప్పించింది. ప్రియదర్శి, వైవా హర్ష నవ్వించే ప్రయత్నం చేసారు. దేవియాని శర్మ తన పాత్రలో బాగా మెప్పిస్తుంది. సంతోషి శర్మ, అభయ్, రాజా రవీంద్ర మిగిలిన నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు మెప్పించారు. శ్రీచరణ్ పాకాల మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. ఆరేళ్ళ క్రితం సినిమా కాబట్టి సినిమాటోగ్రఫీ విజువల్స్ ఓకే అనిపిస్తాయి. లవ్ స్టోరీ రొటీన్ అనిపించినా థ్రిల్లింగ్ పార్ట్ మాత్రం బాగా రాసుకొని తెరకెక్కించాడు డైరెక్టర్ అనిల్ విశ్వనాధ్. నిర్మాణ పరంగా అప్పట్లోనే ఈ సినిమాకు బాగా ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.టైటిల్ : 28°Cనటీనటులు: నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి, దేవియని శర్మ, ప్రియదర్శి, వైవా హర్ష, సంతోషి శర్మ.. తదితరులునిర్మాణ సంస్థలు: వీరాంజనేయ ప్రొడక్షన్స్నిర్మాతలు: సాయి అభిషేక్ఎడిటింగ్: గ్యారీ BHదర్శకత్వం, కథ: డా. అనిల్ విశ్వనాధ్ సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: వంశి పచ్చిపులుసు విడుదల: ఏప్రిల్ 04, 2025 -
ఓటీటీ ఆఫర్స్ రాలేదు..ఇది అది మార్చు అని ఇబ్బంది పెట్టారు: నవీన్ చంద్ర
ఏ హీరోకైనా సక్సెస్, ఒక మార్కెట్ ఉండాలి. లేకుంటా ఆయన సినిమాల రిలీజ్ లకు ఇబ్బందులు తప్పవు. ఆరేళ్ల క్రితం నా సినిమాలు సరిగా ఆడకపోవడం వల్ల అప్పుడు నటించిన ‘28°C’ మూవీకి బిజినెస్ జరగలేదు. ప్పటికి థ్రిల్లర్ జానర్ మూవీస్ ఇంతగా లేవు. ఇది లవ్ అండ్ థ్రిల్లర్ కాబట్టి సినిమా ఎవరికి చూపించినా కొన్ని ఛేంజెస్ చెప్పేవారు. సినిమాలో అది మార్చు ఇది మార్చు అని డైరెక్టర్ గారిని చాలా ఇబ్బంది పెట్టారు. ఓటీటీల్లో కూడా సరైన ఆఫర్స్ రాలేదు.పొలిమేర సక్సెస్ తర్వాత ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి గారు "28°C" సినిమా చూసి ఇంత మంచి ఎమోషన్, డ్రామా ఉన్న సినిమాను ఎందుకు రిలీజ్ చేయలేదు, నేను రిలీజ్ చేస్తా అని ముందుకొచ్చారు. "28°C" థియేటర్ లోనే కాదు రేపు టీవీ, ఓటీటీ ఏ వేదిక మీద రిలీజైనా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు యంగ్ హీరో నవీన్ చంద్ర అన్నారు. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా "28°C". ఈ చిత్రాన్ని ఎమోషనల్ థ్రిల్లర్ లవ్ స్టోరీతో రూపొందించారు "పొలిమేర" ఫేమ్ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్. "28°C" చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర సరసన షాలినీ వడ్నికట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెల 4న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో నవీన్‌చంద్ర మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ఆరేళ్ల కిందట ఈ మూవీ జర్నీ బిగిన్ అయ్యింది. ఒకరోజు రెస్టారెంట్ లో ఉండగా డా. అనిల్ విశ్వనాథ్ కలిసి తన దగ్గర స్టోరీ ఉందని చెప్పారు. రెండ్రోజుల తర్వాత కథ విన్నాను. చాలా యూనిక్ గా అనిపించింది. 28 డిగ్రీల టెంపరేచర్ లో తన జీవిత భాగస్వామిని కాపాడుకునే వ్యక్తి కథ ఇది. ఈ క్రమంలో ఆ జంట చేసిన ఎమోషనల్ జర్నీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా సాగుతుంది. వినగానే ఈ కథ కొత్తగా ఉందని అనిపించింది. అప్పటికి నాపై అందాల రాక్షసి మూవీ ఎఫెక్ట్ చాలా ఉండేది. ఆ మూవీ తర్వాత కొన్ని వేరే జానర్ మూవీస్ చేసినా లవ్ స్టోరీ మూవీస్ లో ఎక్కువ ఆఫర్స్ వచ్చేవి. "28°C" సినిమాను బిగిన్ చేశాం. ఆ మూవీలో నేను తప్ప మిగతా అంతా కొత్త వాళ్లే. ఫస్ట్ డే షూటింగ్ తర్వాత డైరెక్టర్ అనిల్ మూవీని బాగా తెరకెక్కించగలడనే నమ్మకం ఏర్పడింది.→ "28°C" సినిమా రెండు ప్రాంతాల్లో జరుగుతుంది. ఒకటి వైజాగ్, రెండోది జార్జియా. ఫస్ట్ అమెరికా అనుకున్నాం కానీ ఆ టైమ్ లో విదేశీ ఆర్టిస్టులకు ఎంట్రీ కష్టంగా ఉండేది. జార్జియా వెళ్లినప్పుడు కూడా రెండుసార్లు రిజెక్ట్ అయి వెనక్కి వచ్చాం. ఆ తర్వాత లోకల్ గా ఈ వార్త బాగా ప్రచారం కావడంతో మళ్లీ చిత్రీకరణకు పర్మిషన్ ఇచ్చారు.→ మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సమస్య ఉంటే మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. అప్పుడు కష్టం కూడా ఇష్టంగా మారుతుంది. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అయిన కార్తీక్, అంజలి ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. వాళ్లిద్దరు డాక్టర్స్ గా సెటిల్ అవుతారు. అయితే అంజలికి అనారోగ్య సమస్య వల్ల ఆమెను 28 డిగ్రీ టెంపరేచర్ లోనే చూసుకోవాలి. ఇలా నిజంగా ఎవరికీ జరగదు. పుస్తకాల్లో ఉన్న ఒక థియరీని తీసుకుని దాన్ని సినిమాటిక్ గా మలిచారు మా డైరక్టర్. డాక్టర్ కాబట్టి అనిల్ విశ్వనాథ్ సినిమాలో మెడికల్ టర్మ్స్ చాలా డీటెయిల్డ్ గా రాశారు.→ కోవిడ్ తర్వాత థ్రిల్లర్స్, యాక్షన్ మూవీస్ ఎక్కువయ్యాయి. మూవీస్ లో హింస పెరిగింది. సొసైటీలో కూడా హింస పెరిగింది. ఎక్కడ చూసినా క్రైమ్ న్యూస్ వింటూనే ఉన్నాం. సినిమాల్లోనూ అలాంటి క్రైమ్స్ చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నేను హీరోగా చేసే సినిమాలకు ప్రొడక్షన్ సైడ్ స్ట్రాంగ్ గా ఉన్నారా లేదా అని చూసుకుంటున్నాను. క్యారెక్టర్స్ చేస్తే అది లైఫ్ లీడ్ చేయడానికి, కొంత డబ్బు సంపాదించడానికి, నా క్రాఫ్ట్ ను కెరీర్ ను లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తున్నా.→ అరవింద సమేత వీర రాఘవలో నేను చేసిన క్యారెక్టర్ కు చాలా మంచి పేరొచ్చింది. నా కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు అదే బ్యానర్ లో రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర చిత్రంలో ఓ సరికొత్త క్యారెక్టర్ లో నన్ను చూస్తారు. గేమ్ ఛేంజర్ లో ఉండిపోవడం వల్ల సూర్య రెట్రో మూవీలో మెయిన్ విలన్ గా నటించే అవకాశం మిస్ అయ్యింది. ఇప్పుడు ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ లో షో టైమ్ తో పాటు 11 అనే మరో మూవీ ఉంది. నాకు బాగా పేరు తెచ్చిన ఇన్ స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ సీజన్ 2 రాబోతోంది. -
జార్జియా అధికారులతో ఇబ్బంది పడ్డా: నిర్మాత
‘28°C’ సినిమా 2019లోనే పూర్తయింది. 2020లో మేలో విడుల చేయాలనుకున్నాం. కానీ కరోనా కారణంగా అది సాధ్యం కాలేదు. కొన్ని రోజుల్లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని అనుకుంటే, అది నెలల తరబడి సాగింది. దీంతో మా సినిమా విడుదల ఆలస్యమై ఇప్పుడు (ఏప్రిల్ 4) రిలీజ్ అవుతుంది. ఈ మూవీ చేసే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. మూవీ వైజాగ్ లో ప్రారంభించినప్పుడే నా కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఆ తర్వాత జార్జియాలో షూటింగ్ కు వెళ్లినప్పుడు అక్కడి అధికారులు అనుమతి ఇవ్వక ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. ఎన్ని సమస్యలు వచ్చినా కంటెంట్ మీద నమ్మకంతో ఇప్పటిదాకా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ప్రేక్షకులు థియేటర్స్ లో మా సినిమాకు మంచి రెస్పాన్స్ ఇస్తారనే ఆశిస్తున్నాం’ అన్నారు యువ నిర్మాత సాయి అభిషేక్. ఆయన నిర్మించిన తొలి సినిమా 28°C( 28 డిగ్రీల సెల్సియస్). నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. పొలిమేర" ఫేమ్ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ తన మొదటి సినిమాగా "28°C" రూపొందించారు. ఈ సినిమా ఈ నెల 4వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత సాయి అభిషేక్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..నేను, డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ సన్నిహిత స్నేహితులం. మాకిద్దరికీ సినిమాలంటే అమితమైన ఇష్టం ఉండేది. అనిల్ "క్షణం" సినిమా కోసం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాడు. నేను కూడా దర్శకత్వం వైపు కొన్ని ప్రయత్నాలు చేశాను. కొన్ని రోజుల తర్వాత, మేమిద్దరం కలిసి ఒక సినిమా తీద్దామని నిర్ణయించుకున్నాం. అనిల్ విశ్వనాథ్ "28°C" అనే టెంపరేచర్ ఆధారంగా చెప్పిన కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కథ ప్రేక్షకులకు కూడా ఒక కొత్త అనుభవాన్ని అందిస్తుందనే నమ్మకంతో సినిమాను ప్రారంభించాం.మొదట్లో ఈ సినిమా కోసం వేరే హీరోలను అనుకున్నప్పటికీ, చివరికి నవీన్ చంద్ర ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాడని భావించాం. హీరోయిన్గా మొదట అంజలిని ఎంచుకున్నాం, కానీ కొంత ఆధునికత కోసం కొత్త ముఖం ఉంటే బాగుంటుందని షాలినీని ఎంపిక చేశాం. షూటింగ్‌ను వైజాగ్‌లో మొదలుపెట్టాం, ఆ తర్వాత గోవా, జార్జియాలకు వెళ్లాం. నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా అత్యున్నత నాణ్యతతో సినిమాను రూపొందించాం. సినిమా కథాంశంపై మా బృందం అందరికీ గట్టి విశ్వాసం ఉండేది.హీరో నవీన్ చంద్ర మాకు చాలా సహకరించాడు. సినిమాపై మాతో పాటు అతనికి కూడా గట్టి నమ్మకం ఉంది. షూటింగ్ సమయంలోనే కాకుండా, ఇప్పుడు ప్రచార కార్యక్రమాల్లో కూడా మద్దతుగా నిలుస్తున్నాడు. అతని పాత్ర ప్రేక్షకులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాం. అలాగే, హీరోయిన్ షాలినీ కూడా అద్భుతంగా నటించింది. "28°C" టెంపరేచర్ వద్ద హీరోయిన్ ఆరోగ్య పరిస్థితి ఒక విధంగా ఉంటుంది, ఆ ఉష్ణోగ్రత దాటితే ఆమె ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఈ జంట ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొందనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా ఒకే జానర్లో సాగదు, విభిన్న జానర్లను కలుపుతూ ఒక తీవ్రమైన ప్రేమకథగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దర్శకుడు అనిల్ విశ్వనాథ్ సినిమాను మొదటి నుంచి చివరి వరకు ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దాడు.సినిమా తీసే సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వైజాగ్‌లో షూటింగ్ ప్రారంభించినప్పుడే నా కాలు విరిగింది. ఆ తర్వాత జార్జియాలో షూటింగ్ కోసం వెళ్లినప్పుడు అక్కడి అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో సమస్యలు ఎదుర్కొన్నాం. మేము షూటింగ్ కోసం భారీగా ఖర్చు చేశామని స్థానిక మీడియా ద్వారా తెలుసుకున్న జార్జియా అధికారులు చివరికి చిత్రీకరణకు అనుమతి ఇచ్చారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, కథాంశంపై నమ్మకంతో ఇప్పటివరకు ధీమాగా ఉన్నాం. ప్రేక్షకులు థియేటర్లలో మా సినిమాకు సానుకూల స్పందన ఇస్తారని ఆశిస్తున్నాం.ప్రస్తుతం కొన్ని కథలు విన్నా, అయితే ఏదీ ఇంకా ఫైనలైజ్ చేయలేదు. "28°C" సినిమా రిలీజ్ తర్వాత మా సంస్థ నుంచి కొత్త మూవీని అనౌన్స్ చేస్తాం. -
ఆ సమయంలో చనిపోవాలనుకున్నా.. ధైర్యంతో ‘పొలిమేర’ స్క్రిప్ట్ రాశా: డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్
"పొలిమేర" చిత్రం విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా "28°C" ఏప్రిల్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఎమోషనల్ గా సాగే అద్భుతమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర హీరోగా నటించగా..షాలినీ వడ్నికట్టి హీరోయిన్ గా కనిపించనుంది. తాజాగా అనిల్ మీడియాతో ముచ్చటిస్తూ తన తొలి సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అవేంటో ఆయన మాటల్లో.. "28°C" సినిమాతో నాకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఇది మొదటి సినిమా. స్క్రిప్ట్ ను బాగా లవ్ చేశాను. 2017లో స్టార్ట్ చేశాం. క్వాలిటీ పరంగా రాజీ పడకపోవడంతో బడ్జెట్ పెరిగింది. 2020 మేలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. మార్చి లో లాక్ డౌన్ వచ్చింది. ఆ తర్వాత సినిమాల రిలీజ్ ల పరిస్థితి ఎలా మారిందో మీకు తెలుసు. ఓటీటీకి ఆఫర్స్ వచ్చాయి గానీ మేము సినిమాకు పెట్టిన ఖర్చుకు వారు ఆడిగిన రేట్ కు సంబంధం లేదు. అందుకే మూవీని ఓటీటీకి ఇవ్వలేదు. పైగా మా సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేసుకోవాలనే కోరిక ఉండేది. ఏది జరిగినా మన మంచికే అనుకుంటా. "28°C" సినిమా ఇప్పుడు రిలీజ్ కావడం వల్ల మంచే జరిగిందని భావిస్తాఇద్దరు మెడికల్ స్టూడెంట్స్ మధ్య జరిగే ప్రేమ కథ ఇది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సూపర్ న్యాచురల్ షేడ్స్ ఉంటాయి. మెడికల్ గా 28°C అనే అంశాన్ని కథలో మిక్స్ చేశాం. బ్రెయిన్ డ్యామేజీ అయిన వారు ఎక్కువ వేడి, చల్లదనం తట్టుకోలేరు. అది థియరీగా ఉంది. ఈ అంశాన్ని సినిమా కోసం ఎఫెక్టివ్ గా ఉపయోగించాం. టైటిల్ కనిపించే ప్రశ్నార్థకం మిమ్మల్ని సినిమా చివరి వరకు క్యూరియాసిటికి గురిచేస్తుంది.ఈ సినిమాను మొదట అడివి శేష్ కోసం అనుకున్నాం. అయితే శేష్ క్షణం తర్వాత బిజీ అవడం వల్ల కుదరలేదు. నవీన్ చంద్రకు స్క్రిప్ట్ చెబితే ఆయనకు బాగా నచ్చి చేసేందుకు ముందుకొచ్చారు. జార్జియాలో 25 డేస్ షూటింగ్ చేశాం. ఆ షెడ్యూల్ కోసం మేము పడిన కష్టం మాటల్లో చెప్పలేను. అనివార్య కారణాలతో రెండుసార్లు జార్జియాకు వెళ్లకుండా అధికారులు తిరిగి పంపేశారు. థర్డ్ టైమ్ మేము అక్కడికి వెళ్లి షూట్ చేయగలిగాం. మూడోసారి కెమెరా కిట్స్ ఉన్నబ్యాగులు మిస్ అయ్యాయి. జార్జియాలో షాపింగ్ చేసి వాటిని కొని షూటింగ్ చేశాం. ఇలాంటి ఎక్సిపీరియన్స్ లు చాలా ఉన్నాయి కాబట్టే "28°C" సినిమా అనుభవాలతో పుస్తకం రాయాలని అనుకున్నా."28°C" రిలీజ్ ఆగిపోయినప్పుడు నా పర్సనల్, ప్రొఫెషనల్ కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది. ఈ మూవీలో నేను కూడా ఇన్వెస్ట్ చేసి ఉన్నాను. సినిమా రిలీజ్ ఆగిపోయి నెక్ట్స్ ఏంటి అనే డైలమాలో ఉండేవాడిని. ఆత్మహత్య ఆలోచనలు కూడా కలిగేవి. అయితే బతికే సాధించాలనే పట్టుదలతో పొలిమేర స్క్రిప్ట్ చేసుకుని ఆ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో పొలిమేర 2 చేశాను. ఇప్పుడు పొలిమేర సిరీస్ లో థర్డ్ పార్ట్ చేస్తున్నాం. పొలిమేరతో వచ్చిన గుర్తింపుతో "28°C" సినిమా బాగా రిలీజ్ అవుతుందని నమ్ముతున్నా.నా స్నేహితుడు వంశీ నందిపాటి "28°C" సినిమా చూసి ఇంతమంచి మూవీని రిలీజ్ చేయాలని ముందుకొచ్చాడు. ఇప్పుడు మా లక్ష్యం ఈ సినిమాతో డబ్బులు సంపాదించడం కాదు మా ఫస్ట్ మూవీని థియేటర్స్ లో చూసుకోవడం. అందుకే వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ ఇప్పించమని వంశీని అడిగాను. "28°C" సినిమా చూసి నవీన్ చంద్ర ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా ఫీలయ్యారు."28°C" సినిమా రిలీజ్ కావడం ఆలస్యమైంది. అయితే అదృష్టవశాత్తూ ఇలాంటి కథతో మరే మూవీ థియేటర్స్ లో గానీ ఓటీటీలో గానీ రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే చాలా బాధపడేవాడిని. నేను యూనిక్ బ్యాక్ డ్రాప్స్ తో కథలు రాస్తాను. అదే నాకు అడ్వాంటేజ్ అయ్యిందని భావిస్తా. సినిమాను క్రిస్ప్ గా 2 గంటలు ఉంటుంది. అనవసర సన్నివేశాలు తీసేసి టు ది పాయింట్ మూవీని తెరపై చూపించబోతున్నాం.నా నెక్ట్స్ మూవీ పొలిమేర 3 త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్తాం. ఇది పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో ఉంటుంది. సీజీ వర్క్ భారీగా ఉండబోతోంది. అందుకే ప్రీ ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ పట్టింది. వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. పొలిమేర 3 పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రొడక్షన్ వ్యాల్యూతో ఉంటుంది. ఇందులో ఓ స్టార్ కీలక పాత్రలో నటిస్తారు.నేను షో రన్నర్ గా నా టీమ్ మెంబర్ నాని కాసరగడ్డ డైరెక్షన్ లో అల్లరి నరేష్ తో 12ఎ రైల్వే కాలనీ మూవీ చేస్తున్నాం. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాశాను. నేను కెరీర్ మొదలుపెట్టినప్పుడు నాకు పెద్దగా సపోర్ట్ లేదు. నాకున్న గుర్తింపుతో ఇప్పుడు నా కొలీగ్స్ కు నేను ఆ సపోర్ట్ ఇవ్వాలని భావిస్తున్నా. నాకు షెర్లాక్ హోమ్స్ సాహిత్యం ఇష్టం. త్వరలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను.